గద్వాలలో వేరుశనగకు మద్దతు ధర లభించడం లేదు : డీకే అరుణ

20:17 - November 8, 2017

హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో వేరుశనగ పంటకు మద్దతు ధర లభించడంలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. వేరుశనగ క్వింటాలుకు ప్రభుత్వం 4 వేల 450 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని.. అయితే మార్కెట్‌ యార్డులలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. వ్యాపారులు మాత్రం 16 వందలు, 14 వందలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వేరుశనగకు మద్దుత ధర ఇప్పించాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు.  

Don't Miss