రియల్ వర్షంలో...'ఎం ఎల్ ఎ' ఫైటింగ్..

11:35 - October 9, 2017

రియల్ వర్షంలో 'ఎం ఎల్ ఎ' ఫైటింగ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు అనుకొనేరు. కాదు..'మంచి లక్షణాలున్న అబ్బాయి'. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'నందమూరి కళ్యాణ్ రామ్' హీరోగా 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఎం. ఎల్.ఏ' టైటిల్ పెట్టగా 'మంచి లక్షణాలున్న అబ్బాయి' ఉప శీర్షిక పెట్టారు. ఎం.ఎల్‌.ఏ అనే పేరు ఉన్నా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాదని చిత్ర బృందం పేర్కొంటున్నట్లు టాక్.

ప్రస్తుతం ఈ సినిమా ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతోంది. ఓ భారీ ఫైట్ ను చిత్రీకరించనున్నారు. రెయిన్ ఎఫెక్ట్ తో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. షూట్ ప్రారంభం కాగానే భారీ వర్షాలు కురుస్తుండడంతో అందులోనే షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఒరిజనల్ వర్షంలో చిత్రీకరించిన ఈ ఫైటింగ్ సీన్ బాగా వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న 'కాజల్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. షూటింగ్ స్పాట్ లోని ఈ ఫోటోను ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ ఫోటోలో 'కాజ‌ల్' చాలా క్యూట్ గా కనిపిస్తోంది. 

Don't Miss