మహిళా టీచర్ పై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం..

18:56 - June 11, 2018

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని మార్గదర్శిని ఎడ్యుకేషనల్‌ సొసైటీలో స్థల వివాదం నెలకొంది. ఈ విషయమై సొసైటీ సభ్యులకు, స్కూల్‌ యాజమాన్యానికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సొసైటీ ప్రెసిడెంట్ బాలయ్య స్థలం విషయమై యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీనికి మద్దతుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, తెల్లాపూర్‌ గ్రామ పంచాయితీ సర్పంచ్‌ సోమిరెడ్డి, ఎమ్మెల్యే అనుచరులు స్కూల్‌కి వచ్చి యాజమాన్యాన్ని బెదిరించారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న స్కూల్‌ జాయింట్‌ సెక్రటరీ విజయలక్ష్మి ఫోన్‌ను...ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా లాక్కొని వీడియోను డెలీట్‌ చేశారు. తమపై దౌర్జాన్యానికి దిగిన వారిపై చర్యలు తీసుకొని స్కూల్‌కి న్యాయం చేయాలంటూ స్కూల్‌ యాజమాన్యం కోరుతోంది. 

Don't Miss