నాపై వచ్చిన చెరువు కబ్జా ఆరోపణలు అవాస్తవం : ముత్తిరెడ్డి
17:47 - September 27, 2017
జనగాం : తన పేరుపైన ప్రభుత్వానికి సంబంధించిన గజం భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు నిరూపించినా.. ఏ శిక్షకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కలెక్టర్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కలెక్టర్ నిరాధార ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎంతో పాటు సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీని కోరతానని చెప్పారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఎందుకు ఆరోపణలు చేశారో ఆమెనే వివరణ ఇవ్వాలని యాదగిరిరెడ్డి అన్నారు. గుడికి ట్రస్ట్ చైర్మన్గా ఎమ్మెల్యే ఉండాలని అఖిలపక్షం నిర్ణయించిందని.. గుడికి ట్రస్టీని మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని.. భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని యాదగిరిరెడ్డి వివరణ ఇచ్చారు.