ఓటర్లను మభ్యపెట్టేందుకుకే ఆత్మీయ సభలు : ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి

20:05 - August 13, 2017

కర్నూలు : నంద్యాలలో కులాల ఆత్మీయ సభల పేరుతో టీడీపీ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారని వైసీపీ ఆరోపించింది. కులాల పేరుతో చంద్రబాబు ఏర్పాటు చేసిన కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లతో ఆయా కులాలకు ఒరిగిందేమీలేదని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాపు కార్పొరేషన్‌ ఎంతమందికి రుణాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 
 

Don't Miss