ఇద్దరు 'చంద్రులు' మోసగాళ్లే : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఎపి చంద్రబాబు మోసగాళ్లేనని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండకృష్ణ మాదిగ ఘాటుగా విమర్శించారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో వన్ టు వన్ కార్యక్రమం నిర్వహించింది. టీసర్కార్ దళితులను పచ్చిగా మోసం చేసిందన్నారు. ఎపి సర్కార్ మాదిగలను మోసం చేసిందని మండిపడ్డారు. నెంబర్ వన్ చీటర్.. కేసీఆర్, నెంబర్ 2 చీటర్ చంద్రబాబు అని పేర్కొన్నారు. కుట్రలు శాశ్వతంగా నిలబడవని.. న్యాయం శాశ్వతంగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...  
'22 ఏల్లుగా ఎస్ సీ కులాల వర్గీకరణ పోరాటం జరుగుతోంది. ఎస్ సీ వర్గీకరణ చేస్తామని టీడీపీ చెప్పింది. రెండు సార్లు విజయాలు సాధించాం. కానీ న్యాయవ్యస్థలో ఉన్న అడ్డంకుల వల్ల కోల్పోయాం. వర్గీకరణ సమస్య రాజ్యాంగ సవరణగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ కేంద్రంకు సిఫార్సు చేయాలి. ఎస్సీ వర్గీకరణ కోసం నాడు కేసీఆర్ అనివార్యంగా ప్రధానికి లేఖ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేందుకు సీఎం కేసీఆర్ కు అవకాశం లేదు. ఎపి ప్రభుత్వం  పౌరహక్కులను కాలరాస్తుంది. ఎపికి పోవాలంటే వీసా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నాడు. ఎపిలో ఎంఆర్ పిఎస్ కార్యకర్తలపై నిర్బంధం పెట్టారు. చింతమడక నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. వామపక్షాలు మొదటి నుంచి మద్దతు తెలుపుతున్నాయి. మాలలతో పోల్చుకుంటే మాదిగల జనాభా ఎక్కువ'. అని వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss