'బిగ్ సీ డైరెక్టర్ ఆరోపణలు నిజం లేదు'...

18:34 - January 13, 2018

హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ సెల్‌కాన్ మొబైల్స్‌పై బిగ్ సీ డైరెక్టర్ వై. స్వప్న కుమార్ పెట్టిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన మాదాపూర్‌ పోలీసులు స్వప్నకుమార్‌ ఆరోపణల్లో నిజం లేదని తేల్చారని సంస్థ తెలిపింది. 2015లో సెల్‌కాన్‌ కంపెనీ నుంచి తప్పుకున్న స్వప్నకుమార్‌.. సెల్‌కాన్‌ సంస్థపై పలు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. దీనీపై దర్యాప్తు చేసిన పోలీసులు సెల్‌కాన్‌కు సంబంధించిన బ్యాంకర్లందరినీ సంప్రదించారు. నిబంధనలకు లోబడే వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు అన్ని బ్యాంకులు రిపోర్టు ఇచ్చాయని సెల్‌కాన్‌ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉందని, బ్యాంకర్లు రాతపూర్వకంగా పోలీసులకు వెల్లడించారని సెల్‌కాన్‌ సంస్థ ప్రకటించింది. దీంతో తమ సంస్థపై స్వప్నకుమార్‌ దురుద్దేశంతోనే ఆరోపణలు చేసినట్టు రుజువైందని సెల్‌కాన్‌ సంస్థ స్పష్టం చేసింది. 

Don't Miss