రూ.1000 కోట్ల బడ్జెట్ తో 'మహా భారత్'..

15:26 - August 2, 2018

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 బీసీ లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడింది. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రచించాడని హిందువుల ప్రగాఢ నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యంగా చెప్పబడుతోంది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన అనే కవులు తెలుగు లోకి అనువదించారు. అంతటి పేరుగాంచిన మహాభారతంలోకి ఒక్కొక్క సందర్భం ఒక్కో కావ్యంగా రచించబడింది. ఇప్పటికే మహాభారత ఘట్టాలను కథా వస్తువులుగా మలచుకుని అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఈ నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమైన పాత్రగా .. మహాభారతం కథావస్తువుగా ఒక సినిమాను నిర్మించనున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది.

1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా..
బీఆర్ శెట్టి దీనిని 1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా నిర్మించనున్నారనే టాక్ రావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన 'రండా మూళమ్'అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు.

'ది మహాభారత'గా పేరు మార్పు..
కాగా మలయాళంలో ఇదే టైటిల్ ను ఖరారు చేసి తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం 'ది మహాభారత' అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా..నటీనటులను కూడా ఆయా భాషల నుంచి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటి భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 

Don't Miss