'ఏజెన్సీ, గిరిజన సమస్యలు పరిష్కరించాలి'...

13:09 - December 19, 2016

ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక న్యాయం సాధన కోసం తమ్మినేని చేపట్టిన మహా పాదయాత్ర కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. దీంతో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లోపించిందని పాదయాత్ర బృందం సభ్యురాలు, శ్రామిక మహిళా నేత ఎస్‌ రమ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. రాష్ట్రంలో కనీసం మంచినీటి సదుపాయం లేని గ్రామాల్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె దుయ్యబట్టారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. 63వ రోజు పాదయాత్ర ఆదిలాబాద్‌ జిల్లాలో బూసిమెట్ల క్యాంప్‌, ఘాట్‌రోడ్డు, కేస్లాగూడ, కెరామెరీ, ఝరీ, తుర్దాపూర్‌, దనోరా, శివగూడా, గోయగాం, అంబరావుగూడ, కొలాన్‌కొఠారీ, అడ గ్రామాల్లో పర్యటించింది. ఏజేన్సీ, గిరిజన గూడేల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

Don't Miss