స్వరాష్ట్రంలో గిరిజనుల కష్టాలు పెరిగాయి: రవికుమార్

07:07 - December 21, 2016

మంచిర్యాల : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర 65వ రోజు పూర్తి చేసుకొని మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో పాదయాత్రకు బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. గిరిజన జిల్లాల్లో ఆదివాసీలకు న్యాయం జరగడంలేదని..ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన..ఆదివాసి సమస్యలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజనుల కష్టాలు రెట్టింపయ్యాయంటున్న బండారు రవికుమార్‌ విమర్శించారు. ఆదివాసీల కష్టాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.సరైన వైద్యం, రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారనీ..రిజర్వేషన్లు అమలుకాకపోవడంతో గిరిజనులు అనేక కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Don't Miss