సీపీఎం బహిరంగసభకు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు...

11:35 - March 19, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళానికి సర్వం సిద్ధమైంది. సభ సక్రమంగా జరిగేందుకు నిర్వహణ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియంలో పూలే, అంబేద్కర్, సుందరయ్య ఫొటోలతో ఉన్న ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎల్ బి నగర్, సరూనర్ నగర్ ప్రాంతాలు ఆరుణమయమయ్యాయి. సరూర్ నగర్ స్టేడియంలో నీలి రంగు జెండాలు, ఎరుపు జెండాలు రెపరెపులాడుతున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకు సరూర్ నగర్ లో భారీ సమర సమ్మేళన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు. ర్యాలీని సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. సమర సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. సీపీఎం పాదయాత్ర ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 31జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1800 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు. 
సభకు అన్ని ఏర్పాట్లు చేశాం : సాయిబాబు 
'సరూర్ నగర్ స్టేడియంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొదట నిజాం కాలేజీలో సభ అనుకున్నాం.. కానీ ప్రభుత్వం 
అనుమతి ఇవ్వలేదు. 2 లక్షల మంది హాజరు అవుతారు. తమ్మినేనితో పాటు 9 మంది పాదయాత్ర బృందం పసుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా సరూర్ నగర్ స్టేడియానికి వస్తారు. పాదయాత్ర 31 జిల్లాలు, 1800 గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్ర ఎజెండాను ప్రజలు గుండెలకు అత్తుకున్నారు. పాదయాత్ర అడుగడుగునా ప్రజలు నిరాజనాలు పలికారని' తెలిపారు. 

Don't Miss