టీ.ప్రభుత్వానివి ఉట్టి మాటలే : రమ

14:02 - January 10, 2017

మహబూబాబాద్‌ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర 86వ రోజు మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..జిల్లాలోని వివిధ గ్రామాల గుండా సాగుతోంది. ఇప్పటివరకు తిరిగిన 19జిల్లాల్లో ఉన్న సమస్యలే..20వ జిల్లా మహబూబాబాద్‌లో కన్పిస్తున్నాయని పాదయాత్ర బృందం సభ్యులు ఎస్‌ రమ అన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా..రాష్ట్రంలోని ఎక్కడ కూడా రైతులు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేరని రమ తెలిపారు. ఐకేపీ కార్యకర్తలు జీతాల్లేక తీవ్ర అవస్ధలు పడుతున్నారని చెప్పారు. మహిళా అభివృద్ధి కోసం సీఎం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss