కాశిపేట ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాటానికి మద్దతిస్తాం : తమ్మినేని

15:43 - December 21, 2016

మంచిర్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా 66వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పాదయాత్ర దుబ్బగూడెం, మందమర్రి, మేడారం, పులికుంట... బొప్పలగుట్ట, గద్దెరాగడి, మంచిర్యాలలో సాగనుంది. కాగా ఈ మహాజన పాదయాత్రకు దోమగూడ, కాశిపేట ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాట బృందం సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 'ఓపెన్‌ కాస్ట్‌ వ్యతిరేక పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. పోరాటంలో మేం భాగమవుతామని' సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. 

 

Don't Miss