భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి : తమ్మినేని

13:45 - January 11, 2017

మహబూబాబాద్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 87వ రోజు మహబూబాబాద్‌ జిల్లాలోని అబ్బాయిపాలెం వద్ద పాదయాత్ర 2300 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర బృందం అబ్బాయిపాలెం గ్రామం వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయి వద్దకు చేరుకోగానే..గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని గాలివారిగూడెం, ఎల్లారిగూడెం, పురుషోత్తమగూడెం, తండధర్మారం, లక్ష్మాతండా, సిరోలు ఎక్స్‌రోడ్డు, రామచంద్రు దండా, రేకుల తండా, కాంపల్లి, పెరుమాళ్లసంకీత గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగుతోంది. తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు పనులను పాదయాత్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...భక్తరామ దాసు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని తమ్మినేని ఆరోపించారు. వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి గోదావరి నీళ్లను పాలేరులోకి తీసుకురావాలని...కానీ పాలేరు నీళ్లను తీసుకొచ్చి గోదావరిలోకి కలుపుతుందని తమ్మినేని పేర్కొన్నారు.

 

Don't Miss