జక్కన్న మల్టీ స్టారర్ లో 'మహానటి'..

14:58 - June 28, 2018

సినిమా పరిశ్రమలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. దర్శకుడిగా ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా రాజమౌళివైపు కన్నెత్తికూడా చూడలేదు. స్టూడెంట్ నంబర్ వన్ నుండి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బాహుబలి వరకూ విజయాల పరంపరం జక్కన్నకు ఒక్కడికే సొంతమయ్యింది. హిట్ దర్శకులు ఎంతమంది ఉన్నా ఒక్క ప్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. అందుకే అతనితో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు కూడా వేచి చూస్తుంటారు. బాహుబలి స్వీక్వెల్స్ తో దాదాపు ఐదు సంవత్సరాల పాటు బైటప్రపంచం గురించి కూడా పట్టించుకోని జక్కన్న నెక్ట్స్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి జక్కన్న మెగా మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదికూడా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో . ఇక ప్రేక్షకుల అంచనాలు ఊహకు అందకుండా వున్నాయి. మరి ఈ మెగా మల్టీ స్టారర్ లో ఆ బిగ్గెస్ట్ హీరోలు ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది. మరి వారి రేంజ్ కు తగినట్లుగా హీరోయిన్స్ కూడా వుండాలి కదా మరి!. మరి ఆ హీరోయిన్స్ ఎవరాని ప్రేక్షకులు ఆసక్తికి అంతులేకుండా వుంది.

డిసెంబర్లో షూటింగులో పాల్గొననున్న చరణ్
రాజమౌళి తాజా చిత్రంగా భారీ మల్టీ స్టారర్ చిత్రానికి అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. నవంబర్లో ఎన్టీఆర్ .. డిసెంబర్లో చరణ్ షూటింగులో జాయిన్ కానున్నారు. ఈ ఇద్దరు హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది.

Don't Miss