అమెరికాలో ‘మహర్షి’ షూటింగ్ పూర్తి....

10:42 - October 31, 2018

హైదరాబాద్ : కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో...ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుందో తెలియదు. సినిమాకు సంబంధించిన విషయాలు..ఫొటోలు రిలీజ్ కాకుండా చిత్ర యూనిట్ గోప్యంగా షూటింగ్ కానిచ్చేస్తూ ఉంటుంది. ఈ కోవలోకి మహేష్ చిత్రం చేరుతుంది. మెల్లగా ఒక్కో షెడ్యూల్ పూర్తి చేసుకుని పరుగులు పెడుతోంది. వంశీపైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. డెహ్రాడూన్, గోవాలో కూడా చిత్ర షూటింగ్ జరుపుకొంది. మహేష్ కు ఇది 25వ చిత్రం. 
Image result for Maharishi Shooting Completed In America #maheshbabuఇటీవలే చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గడ్డం..మీసాలతో మహేష్ కనిపించడం..కొత్తగా ఉన్న ఈ లుక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇటీవలే చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లింది. అక్టోబర్ నెలలో వెళ్లిన చిత్ర యూనిట్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌కు టీం రానున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు తల్లిగా సీనియర్‌ నటి జయప్రద కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 

Don't Miss