మహాకూటమిలో మరోసారి సీట్ల చర్చలు..

07:54 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమై వారాలు గడిచిపోయాయ్. మరో వారం రోజుల్లో నామినేషన్‌ ఘట్టానికి తెరలేవనుంది. టీఆర్ఎస్ పార్టీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో ఇప్పటివరకూ ‘సీట్ల ముడి’ ఇంకా వీడటంలేదు. ఇప్పటివరకూ పలుసార్లు కూటమి నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. అయినా సీట్ల పంపకాలు తేలటంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈరోజు 4 పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఎవరికి ఏ సీటు అన్నది ఇంకా తేల్చకపోతే ఎన్నిసార్లు చర్చలు జరిపినా వృథా అని కాంగ్రెస్‌కు మిగతా పార్టీలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఇక సమయం మించిపోతున్న తరుణంలో ఏ విషయం అనేది తేల్చేయాలని టీడీపీ నేత ఎల్‌.రమణ కాంగ్రెస్‌కు స్పష్టం చేశారు. టీడీపీ దారిలోనే మిగిలిన 3 పార్టీలూ కూడా స్పష్టం చేశాయి. ఈరోజు మరోసారి కీలక చర్చలు జరపనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు తెజస అధ్యక్షుడు కోదండరాం మీడియా సమావేశం జరపనున్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు, ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నారన్న అంశంపైనా ఆయన వివరణిచ్చే అవకాశాలున్నట్లు..ఇప్పటి వరకూ 8 సీట్లు తెజసకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మరో 2 ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదనపు సీట్లు రెండింటినీ సిద్దిపేట, చాంద్రాయణగుట్టగా ఖరారు చేసినట్లు..మిగిలిన 8 ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఎంచుకోవాలని తెజస తేల్చుకోవాలని కాంగ్రెస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Related imageతేలని సీట్ల ముడి ఆశావహుల్లో గందరగోళం 
మహా కూటమిలో పొత్తులు ఖాయం. కానీ అనుకూలమైన సీట్లు మాత్రం తమకే దక్కాలనే పంతంతో మహాకూటమి భాగస్వామ్య పార్టీల తీరు వుంది. గత కొన్ని వారాలుగా ఆ పార్టీలన్నీ చర్చలు కొనసాగిస్తున్నా...ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఎవరికి వారు టికెట్లపై నమ్మకంతో తామే అభ్యర్థులం అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శేరిలింగంపల్లి స్థానాన్ని తెలుగుదేశానికి ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ గాంధీభవన్‌ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.  ఈ నిరసనలో భాగంగా ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యకు కూడా పాల్పడటంవతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితు నెలకొన్నాయి. కాగా సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా తయారయ్యింది. ఇటువంటి పరిస్థితే రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ ఎదురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Don't Miss