మింగ మెత్కులేదు మీసాలకు సంపెంగ నూనే

20:35 - January 16, 2018

రెండువేల ఇర్వై ఆరు దాక తెలంగాణ, ఆంధ్రల నియోజకవర్గాల పెంపు ముచ్చటనే ఉండది అని మొన్నటిదాక కేంద్రమోళ్లు మొత్తుకున్నరు.. ఈడ రాష్ట్రాధిపతులు మాత్రం.. పెంపు ఖాయం.. త్వరలో పెంపు అని చెరికల కార్యాన్ని సజావుగ నడ్పుకున్నరు... ఇంతకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెర్గుతయా.. లేదా.?. ఇయ్యాళ బీజేపీ మన్సుల ఏమున్నది..? ఒక్కపారి జూద్దాం..

ఒక ముచ్చట రైతులను చాల కన్ఫ్యూజ్ జేస్తున్నది.. తెలంగాణ సర్కారేమో.. మార్చి పదకొండు తారీఖు సంది రైతులకు కొత్త పాసుపుస్తకాలిస్తమంటున్నది.. ఇచ్చుడు అయ్యేపనేనా..? అనేది అనుమానం.. ఎందుకంటె సర్కారు పాత పాస్ బుక్కులను రద్దు జేశి కొత్తయి ఇస్తమంటే బ్యాంకులు ఒప్పుకుంటయా..? బ్యాంకులకు పాసుబుక్కులకు సంబంధం ఏందో సూడుండ్రి ముందు..

మోసం, దగా, కుట్ర, నయవంచనా.. అవినీతి.. అక్రమాలు.. ఇన్నిగల్పితె తెలంగాణ సర్కారట.. అవినీతి అనే పదాన్ని అద్దంముంగట వెడ్తె..అండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం గనిపిస్తదట.. అంత ఆగమున్నదట తెలంగాణల పరిపాలన.. రైతులు మోసపోయిండ్రు, నిరుద్యోగులు మోసపోయిండ్రు.. డ్వాక్రా మహిళలు మోసపోయిండ్రు.. లాభపడ్డది ఒక్క కేసీఆర్ ఫ్యామిలేనట..

మింగ మెత్కులేదు మీసాలకు సంపెంగ నూనే అన్నట్టు.. మన తెలంగాణ ప్రభుత్వం ఏతులెట్లుంటయ్.?? ఓ మొగులు మీదికెళ్లి తెప్పలు దించి.. చెర్లు నింపుతున్నట్టు ముచ్చట్లు జెప్తరు.. తెప్పలుండయ్ లొట్టపీసుండది.. అన్ని ఏతులే.. ఎందుకోమరి ఈ తీర్గ పొంకనాలు గొడ్తది.. తాగెనీళ్లు లేని తండాలు గూడాలను జూశినంక గూడ మనమే నంబర్ వన్ అంటే.. నవ్వాల్నా ఏడ్వాల్నా సార్లూ..

ఏదివా ఓ బాతాల మోడీ..? అచ్చే దిన్ అచ్చేదిన్ అంటివి.. నీ అచ్చెదిన్ నోట్లు దుబ్బ.. సచ్చెదినమొచ్చింది జనం.. ఉప్పునిర్పకాయ ఇడ్సిపెట్టకపోతివి.. గాసం ధరలు వెర్గే.. పిట్రోల్, డీజీల్ ధరలు.. దేశం బుట్టిన సంది ఇప్పటిదాక ఇంత రికార్డు స్థాయిల వెర్గుడేనా అచ్చేదిన్ అంటే..? బొంబాయి దిక్కు అటీటు ఎన్బై రూపాలకు లీటరు పిట్రోలా..? బత్కాల్నా జనం సావాల్నా అయ్యా నీ ఉద్దార్కానికి..

జనవరి నెల వడ్డదంటే సాలూ.. ఇగ ఊర్లపొంటి జాతర్లు సుర్వైనట్టే.. మల్లన్న జాతర.. పోశమ్మ జాతర.. ఐలేని జాతర.. ఇవ్విటికి తోడు రెండేండ్ల కోపారొచ్చె సమ్మక్క సారక్క జాతర.. అటు నాగోబా జాతర.. తెలంగాణ అంతట ఇది జాతర్ల గడియలన్కోరాదుండ్రి.. ఆదిలాబాద్ జిల్లా కెళ్లి వరంగల్ జిల్లాదాక ఏడేడ ఏం జాతరైతున్నది కలెదిర్గొద్దాం పాండ్రి..

నెల్లూరు జిల్లాల ఒక పండుగ గమ్మతున్నది.. సంకురాత్రి పండుగలనే భాగమైనప్పటికీ.. అది జర్రంత వెరైటీగనిపిస్తున్నది..అంటె తెలంగాణల ముఖ్యమంత్రి హైద్రావాదుల దీవులనాడు అయితది ఇసొంటిదే.. సేమ్ అట్లాంటిదే నెల్లూరు కాడ సంకురాత్రి నాడైంది.. సమాధులళ్ల గూసోని తినె పండుగను జూశిండ్రా మీరెన్నడన్న సూపెడ్త రాండ్రి..

 

Don't Miss