అడుక్క తినెటోనికి హక్కులెందుకు..?

20:59 - December 13, 2017

అడుక్క తినెటోనికి హక్కులెందుకు..? బనిసగ బత్కనేర్చినోనికి బర్గెలెందుకు..? బహుజన ప్రజలరా..? ఈ మాట ఎందుకు అంటున్న అంటే..? తెల్గు రాష్ట్రాలళ్ల బీసీల మీద అయితున్న గోసను జూడలేక చెప్తున్న.. అటు అధికారం మీ చేతికి అందదు.. ఇటు రాజకీయ రిజర్వేషన్ ఇయ్యరు.. ఎంతసేపు ఓటు అనే గొర్లుగనే బీసీలను జూస్తున్నరు నాయకులు.. ఈ బీసీలళ్లనే కొంతమంది చెంచాగాళ్లు మోపై.. వాళ్ల జనాన్నే ఆగం జేస్తున్నరు..

మళ్లెవ్వడన్న మీటింగుల పొంట రైతును రాజును జేశ్నం.. పెరుగన్నం తిని అర్గుమీద వండెతట్టు జేశ్నమని దొంగమాటలు జెప్తె మూతివలగొట్టుండ్రి ఎట్లైతె అట్లైతది.. నీయవ్వ తమాష కినవారేస్తె.. నెంబర్ నెంబర్ అని చెప్కతిర్గె సన్నాసులారా..? రైతులు ఆత్మహత్యలు జేస్కుంటుండంగ ఏడంగ నెంబర్ వన్ అయితిమిరా.. ఇగో మళ్లొక రైతు నేలరాలిండు

అయ్యా తెల్గుదేశం పార్టీ జాతి పితా.. వెన్నుపోటు దారుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షా.. శ్రీ చంద్రాలు సారూ.. ఏడున్నవోగని.. జర్ర ఒక పెద్ద తాళం చేయిగొన్కొచ్చి.. హైద్రావాదులున్న ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు.. ఏశేయ్.. ఎందుకంటె.. ఇగ ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు గూడ ఇయ్యాల్నో రేపో ప్రగతి భవన్ల కుడికాలు వెట్టవోతున్నరట.. మరి ఖాళీగుంటే ఏమొస్తది.. వీలైతె కిరాయికిచ్చేయ్..

తెలంగాణ ప్రభుత్వానికి చెవ్వులున్నయా..? ఉంటె అవ్వి ఇనవడ్తున్నయా లేవా..? చెవిటి సర్కారే ఉన్నట్టుంది గదా..? ముప్పైరోజుల సంది కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాలు జేస్తున్నరు.. మేము గొంతమ్మ కోర్కెలు ఏం గోర్తలేము.. మీరు మాకు ఇచ్చిన హామీనే అమలు జేయిమంటున్నం అని చెప్తుంటె.. వాళ్ల ముచ్చట ఇనెటోడే లేడాయే తెలంగాణ.. ఇది సంసారమేనా గడ్డమా..? తెలంగాణ..?

బర్తుడేలకు.. పెండ్లి రోజులకు.. స్పెషల్ డేలకు కేకులు కట్ జేస్తరుగదా..? కని కరీంనగర్ జిల్లా రేకుర్తి ఊరి జనం.. అధికారుల నిర్లక్ష్యానికి యాడాది మాష్కం జేశి.. కేకు కట్ జేశిండ్రు.. ఇట్ల జేస్తెనన్న అధికారులకు బుద్ది జ్ఞానం వస్తదో ఏమో అని ఇట్ల జేశినట్టున్నరు.. అయినా కేకు పైసలు దండుగగని.. మన అధికారులకు గంత పాటి సోయున్నదా..? ఏమంటరు..?

అరేయ్ ఈ భూమ్మీద ఎవ్వడన్న మంత్రగాడుంటే.. వానికి మంత్రాల ధమ్మే ఉంటే.. నేను ఇదే చెట్టుకింద గూసుంట మీరు మంత్రాలు ఏశి.. నన్ను ఈడికెళ్లి మాయం జేయుండ్రిరా సూద్దాం.. ఏం మన్షులు మోపైండ్రు ఈ ప్రజలు గూడ.. మంత్రాలు లేవు లొట్టపీసు ఏం లేవురా నాయనా అంటే.. అవ్విటి సుట్టే తిర్గుతరు.. మంత్రాలతోని మన్సులు సచ్చిపోయేదుంటే.. మంత్రాలతోనే సచ్చిపోయినోళ్లను బత్కియ్యొచ్చుగదా.?? అదుండది..

అయినా తెలంగాణ పోలీసోళ్లను అనుడు గూడ తప్పేతీయుండ్రి.. ఎందుకంటె వాళ్లు ఉత్తములు అని అనుకుంటే.. అట్లెట్ల నిర్లక్ష్యం జేస్తున్నరని ప్రశ్నించొచ్చు.. వాళ్లపనితనం తెలుస్తలేదా పబ్లీకుకు.. హైద్రావాదుల బిర్యానీ దినుకుంట.. కాలు మీద కాలేస్కోని గూసున్న భరత్ రెడ్డిగాన్ని వట్టెతందుకే వాళ్లకు నెలవట్టింది.. ఇగ చెడ్డీ గ్యాంగును ఏడ వట్టాలే..

విరాట్ కొహ్లీ.. ఎట్ల న్యాయమైతది తమ్మీ నీకు..? మేము సప్పట్లు గొడ్తెనే గదా... నువ్వే ఇంత పెద్దోనివైతివి.. మేము అభిమానిస్తెనేగదా.?. నీకు అన్నికోట్ల ఆస్తి వెర్గే.. మేము మా టైమంత వేస్టు జేస్కోని నీ ఆట జూస్తెనే గదా నీకు ఇంతగనం కీర్తొచ్చింది.. కోట్ల మంది భారత అభిమానులను గాదని గటెటో వొయ్యి పెండ్లీ జేస్కున్నవ్ లే..? 

Don't Miss