పాములు పగవట్టుడేందో సూద్దాం..

20:11 - October 19, 2017

తెలంగాణల మళ్ల అధ్యక్షా..? మాకు గూడ అవకాశం ఇయ్యాలే అధ్యాక్షా.. విపక్షాల గొంతునొక్కుతున్నరు అధ్యక్షా.. అన్న మాటలు మళ్ల ఇనవోతున్నం మనం..అదే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుర్వు జేస్తరట ఈనెలలనే.. ఈనెల ఇర్వై ఏడుసంది.. ఇగ మన అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటయో .. ఎట్ల ఉండబోతున్నయో గీ ముచ్చటతోని చెప్త ఇనుండ్రి..

దీపావళి ఎల్లిందంటే ఇగ హైద్రావాదుల ఆడాడ సదరు పండుగ సుర్వైతది.. దున్నపోతును కాళ్ల మీద నిలవెట్టుడు.. ఆ దున్నపోతు మీదికి ఎక్కి హకీ కట్టెలు వట్టుకోని డ్యాన్సులు జేసుడు.. ఓ అదో పెద్ద పండుగనే అయ్యింది రాను రాను.. ఈసారి గూడ సర్కారు ఏలువెట్టింది అండ్ల సర్కారు తర్పున జేయవోతున్నదట.. సరే అదెట్లున్నాగని.. ఆ దున్నపోతులు సల్లగుండ..? కోట్ల రూపాల విలువైన దున్నలను తెచ్చి ఆడిస్తరు..

డబుల్ బెడ్రూం ఇండ్లియ్యిమంటె ఇయ్యరు.. మూడెక్రాల భూమి జూపెట్టుండ్రి అంటె సూపెట్టరు.. ఇస్తమన్నయ్ ఇయ్యరు.. వద్దన్నయ్ ఏర్పాటు జేయరు.. తెలంగాణల వాడవాడకు వైన్సు దుక్నాలు వెట్టాలని ఏ మహిళా సంఘాలోళ్లు ఆందోళన జేశిండ్రని పెడ్తున్నరు ముఖ్యమంత్రిగారూ..? చెర్లున్నోళ్లను బాయిలేశినట్టు.. రోడ్ల మీదున్న వైన్సులు ఇండ్ల నడ్మిట్లకు తెస్తివి..? ఇగో ఆడోళ్లు దీపావళే వైన్సుల ముంగట జేస్కునె కాలం దెస్తివి..?

ఊరంత ఒకదిక్కుంటే.. ఊసుగండ్లోడు ఇంకో దిక్కున్నట్టు.. ఇప్పటికే తెల్గు భూమ్మీద కన్నమ్మ బాధలు వడ్తున్నరు ఆడోళ్లకు.. ఇగ ఆ ఆడోళ్ల నడ్మకు ఈ దొంగపాస్టర్ గాళ్లు జొర్రి వాళ్లో ఏగిలం మోపు జేశిండ్రు... ఏసు క్రీస్తును సూపెడ్తదా నీకు అని..? అందమైన ఆడోళ్లను ఇంటికి తోల్కపోయిండట ఒక పాస్టర్ గాడు.. వాని చెరల జిక్కినోళ్లు తక్వ ఏడుస్తలేరు..

కాకులు పగవట్టంగ జూశ్నంగని.. ఈ పాములు పగవట్టుడేందో నాకు గూడ అర్థమైతలేదు.. ఒక పోరన్ని మూడు మాట్ల గర్శిందట నాగుంబాము.. మూడు మాట్ల వైద్యం జేపిచ్చుకోని బత్కిబట్టగట్టిండు.. నాల్గో పారి గూడ రానే వచ్చిందట మళ్ల కర్శెతందుకు.. అమ్మా నువ్వు మళ్లొచ్చినా అని ఆయింత కట్టెదీస్కోని సంపేశిండట.. నిజంగ పాములు పగవడ్తయా..? ఏడైంది ఈ ముచ్చట అనేది సూడుండ్రిగ..

ఈ తెల్గు భూమ్మీద గానీ.. ప్రపంచంల ఏడనన్నగానీ.. ఎవ్వనికన్న మంత్రాలోస్తె నేను ఈడనే గూసుంట నా మీద మంత్రం జేయమనుండ్రి సూద్దాం.. అరే మంత్రాలు లేవు లొట్టపీసు లేవు.. అదంత ఉత్తకథనేరా నాయనా..? ఇవ్వి మూడనమ్మకాలు అని ఎన్నిమాట్ల జెప్పినా ఇనరాయే పబ్లీకు.. మంత్రాలు మంత్రాలని అవ్విటి ఎంటవడి పాణాలు తీస్కుంటరు..

Don't Miss