ఉస్మానియా దవాఖానల కుక్కల సంచారం..

20:27 - May 12, 2018

పిల్లవుట్టక ముందుకే కుల్లగుట్టినట్టుంది యడ్యారప్ప యవ్వారం జూస్తుంటే.. ఇంక ఓట్లు పూరాగ వడనేలేదు.. పడ్డ పెట్టెలు స్ట్రాంగురూములనే ఉన్నయ్.. అప్పుడే ఏమంటున్నడు.. ఈనెల పదిహేడు తారీఖు నాడు కర్ణాటక ముఖ్యమంత్రిగ ప్రమాణ స్వీకారం జేయవోతున్న.. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీని.. బీజేపీ అధ్యక్షుడు అమీత్ షాను పిల్చుకుంటాంటున్నడు..

ఆ మొత్తం మీద కర్ణాటకల ఇంకో ఘట్టం గూడ ఒడ్సిపోయింది.. అదే ఓట్లు పెట్టెలళ్ల వడ్డయ్.. ఆడాడ చిన్నచిన్న పంచాదులు ఈవీఎంల సతాయించుడు తప్పితె అంత మంచిగనే అయ్యింది.. ఇగ మిగిలింది ఈ పదిహేను తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఒక్కటే.. ఇన్నొద్దులు మీ పంత నవిలిండ్రుగదా.? పార్టీలోళ్లు ఇప్పుడొస్తరేమో సూడుండ్రి మీ ఊర్లపొంటి మీ ఇండ్లపొంటి..

ఉల్వచేన్ల వొడగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కంది చేన్ల ఎంకులాడుకుంటున్నదా.? రెండువేల పందొమ్మిది ఎన్నికలు తెలంగాణల రైతు కేంద్రంగ జర్గబోతున్నయా..? అవును..? అటు టీఆర్ఎస్ పార్టీకి.. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి రైతే కేంద్రం.. నాల్గేండ్ల టీఆర్ఎస్ పరిపాలనల రైతులను పెద్దగ వట్టిచ్చుకోని సర్కారు ఏక్ దం చెక్కులు వంచి కాంగ్రెసుకు చెక్కువెట్టే పనిజేశింది.. మరి కాంగ్రెస్ లక్ష్యమేంది..? వాళ్లెట్ల రైతులను మెప్పిస్తరు..?

సర్కారు బడి ఏమన్న కేసీఆర్ అబ్బసొత్తా.? ఇది రాజకీయ పార్టీ కార్యక్రమాలు జేస్తందుకు ఉన్నదా..? లేకపోతె ఇంకేంది..? అని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణా రెడ్డి పంచాదికి దిగింది.. అటు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ భాస్కరు గూడ కయ్యానికి దిగిండ్రు వీళ్ల మన్సుల పంచాది వేరే ఉన్న ఫ్లెక్సీలు మీదికి మల్పి తిట్టుకుంటున్నరు సూడుండ్రి..

అప్పిచ్చినోడు ఇంటికి రాంగనే.. ఇద్దరాలు మొగలు పంచాది వెట్టుకోని గిన్నెలు గిలాసలు ఎత్తేసుకుంటుంటే అప్పిచ్చినోడు ఉంటడా ఆడ.. ఏ వాళ్ల పంచాదే గట్టిగైతున్నరు అప్పుపైకం అడ్గితె నన్నుగూడ గొట్టగాళ్ల తర్వాతొస్తాని ఎల్లిపోతడు.. వాడువోంగనే మళ్ల భార్యభర్త నిమ్మలంగుంటరు.. అగో సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల బీజేపీ, తెల్గుదేశంది గూడ ఇద్దరాలు మొగల పంచాది అసొంటిదే అన్నట్టు...

తెలంగాణల సర్కారు బడులు ఎట్లున్నయంటే.. అండ్ల అయితున్న ట్రీట్ మెంటుకు రాష్ట్రంలున్న ప్రైవేటు దావఖాండ్లన్ని ఈగెలు జోపుకుంటున్నయ్ రోగులు రాక.. గతపాలకులు ఇంత గొప్పగ సర్కారు దావఖాండ్లను ఏడనన్న తీర్చి దిద్దిండ్రా అని అడ్గుతున్నడు.. నీళ్ల మంత్రి హరీషం సారు.. సంగారెడ్డికాడ కండువాలు మార్చే కార్యం తర్వాత చెక్కుల పంపిణి కాడికొచ్చి ఈ చమత్కారం జెప్పిండు..

జనాభాల యాభై శాతం ఉన్న బీసీలకు చట్టసభలళ్ల రిజర్వేషన్లు గల్పియ్యాలే అని కూడుదినకుంట గూసున్నరు ఒకతాన కొంతమంది బీసీనాయకులు.. నల్గురు గూసోని రాజ్యాధికారం గావాలె అంటున్నరు.. ఎట్లొస్తదే అన్నా రాజ్యాధికారం.. బీసీల శరీరం మాసానికి... మందుకు లొంగిపోతనే ఉండే.. శరీరం తోని గొట్లాడితె బీసీలకు రాజ్యమొస్తాదే.. బుద్దితోని కొట్లాట జేయ్.. అద్దగంటల ఈ రాష్ట్రం నీ చేతులకు రాకపోతె అడ్గు..

కార్డన్ సర్చ్ అని ఒక కథనడుస్తున్నది చానొద్దుల సంది తెలంగాణ రాష్ట్రంల..మరి ఈ కార్డన్ సర్చ్ తోని ఏం బైటవడ్తున్నది ఏ దొంగ దొర్కుతున్న సంగతి మనకు మాత్రం తెల్వదిగని.. పోలీసోళ్లు ఏడైతె చేయాల్నో సర్చింగు ఆడ జేస్తలేరు.. ఏడ జేయొద్దు ఆడ జేస్తున్నరు.. పేదలు బత్కే బస్తీల పొంట సర్చింగులు గాదు పోలీసోళ్లు మీరు జేయవల్సింది నిజంగ మీకు ధమ్ము ధైర్యం ఉంటే ఇగో గీడ జేయుండ్రి...

Don't Miss