బోధన్ పట్టనంల టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఏశాలు..

20:21 - July 24, 2018

ప్రత్యేక హోదాకోసం పోరాటం జేస్తె తెల్గుదేశమే జేయాలేగని.. ఇంకోడు జేయొద్దు అనేది చంద్రబాబు యవ్వారం.. లేదు మేమే జేయాలే.. చంద్రబాబును ప్రత్యేక హోదా సీన్మల విలన్ను జేయాలే అని జగనాలు ఆరాటం.. అటు ఢిల్లీల పాలన జేయవల్చిన అంతర్జాతీయ అత్యుత్తమ పర్యాటకుడు ఈళ్ల డ్రామాలు జూడకుంట విదేశీ యానాలు జేసుడు... దేశానికి రాష్ట్రాలకు సరిగ్గ సరిపోయిండ్రు ఈ నాయకులు..

నెట్టెంపాడు నీళ్లను ఎవ్వలు తెచ్చిండ్రు..? మీ డీకే అరుణమ్మ నేను తెచ్చినా అంటున్నది.. కని అది కేసీఆర్ తెచ్చిండు అని నేను జెప్తున్న అంటున్నడు మంత్రి జూపల్లి కిష్టయ్య.. అవునయ్యా ఓ సారు.. మీ అయ్యాజాగీర్లు ఏమన్న అమ్మి నెట్టెంపాడు నీళ్లను జనాలతానికి దీస్కొచ్చిండ్రా లేకపోతె.. ఆ డీకే భరత సింహారెడ్డి సారదందల సంపాయించిన పైకం తెచ్చి మాకోసం ఖర్చువెట్టిండ్రా.?. మీరు తెచ్చినారు..?

 

ఉన్నదున్నట్లు మాట్లాడుట్ల.. తెలంగాణల ఎం సత్యనారాయణ ఒక్కడైతె.. ఆంధ్రల జేసీ దివాకర్ రెడ్డి ఇంకొక్కలు.. వీళ్లకు పట్టింపులు గిట్టింపులు ఏముండయ్.. ఏది మాట్లాడాలే అనుకుంటే దాసుకోరు కటక్కున అనిపారేస్తరు.. మొత్తానికి మీడియాకు దొర్కుతరు.. తర్వాత మీడియాను జూశి భయపడ్తరు ఇద్దరు ఇద్దరే.. జేసీ దివాకర్ రెడ్డి మీడియా జూశి వద్దురా నాయనా మీకో దండం అని పెడ్తున్నడు..

కేసీఆర్ ముచ్చట జెప్తె ఎట్లుంటది.. కడ్పుల అన్నంలేకున్నా కక్కొచ్చెతట్టు తిన్నట్టుంటది.. అట్ల ఫీలైనోళ్లే విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు.. ఏ ఎన్నిరోజులువా ఇంక వీళ్లను పర్మినెంట్ జేశిపడేయుండ్రి అని మంది ముంగటనే చెప్పుడు బాధితులు సప్పట్లు గొట్టుడు.. పాలాభిషేకాలు జేసుడు.. తర్వాత ఏందంటే.. పర్మినెంట్ లేదు లొట్టపీసు లేదు.. యాడేశ్న గొంగడి ఆడనే..

 

ఏం తయ్యారైండ్రు సూడుండ్రి రాజకీయ నాయకులు.. రాజకీయం అంటే తినుడు తాగుడు జల్సాలు జేసుడు.. పైసలు సంపాయించుడు అవినీతులు జేసుడు ఇదా..? అయినా వాళ్లదేం తప్పు.. ఓట్లు ఏశెటోళ్లది తప్పుగదా..? మీరు సక్కనైనోళ్లకు ఓట్లేస్తె వ్యవస్థ ఇంత ఎందుకు ఆగమైతదిగని.. ఈముచ్చట ఎందుకంటె.. గా బోధన్ పట్టనంల టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఏశాలు జూడుండ్రి..

ఒక్కనాడు మంచినీళ్లు రాకపోతె ఈ మంత్రులు.. ఎమ్మెల్యేల భార్యలు ఊకుంటుండొచ్చునా..? తానాలు జపాలు జేయకుంట అట్లనే ఉంటరా..? ఉండరు మరి జనం ఎందుకు ఉండాలే..? సిద్దిపేటకాడ నీళ్లలొల్లె.. పాలమూరుల నీళ్ల లొల్లే.. సూర్యాపేటకాడ నీళ్లలొల్లె.. వస్తయ్ మిషన్ భగీరథ నీళ్లు ఏమన్న అంటే.. ఆ వచ్చేదాక జనం బత్కుండాలేగదా..?

తెలంగాణల సర్కారు విద్య సత్రోలు అయితున్నది అనెతందుకు మళ్లొక ముచ్చటొచ్చింది మనకు.. పేదోనికి సద్వు అందొద్దు వాని పిల్లలు మళ్ల గదే ఊర్లపొంటి బానిసలుగ.. ఉపాధి హామీ కూలీలుగ.. ఉప్పరిపనోళ్లుగ.. మోరీలు ఎత్తిపోశెటోళ్లుగ బత్కెతందుకు సర్కారు ఎంత కష్టపడి పనిజేస్తున్నదో ఈ పాల్ టెక్నిక్ కాలేజీ కథ జూస్తె మీకే అర్థమైతది..

జోగిని.. అంటే తెల్సా..? అగ్రవర్ణ దొరలు పెత్తందారులకు అవసరాలకోసం బుట్టిన ఒక పేరు అది.. తరతరాలుగా దొరల శారీరక అవసరాలకు బలై.. సమాజంల చిన్నచూపుకు గురైతున్న సమాజమే ఈ జోగిని దేవదాసీ మాతాంగిలు.. కొందరు అంటరు తీన్మార్ మల్లన్నా దేవుడే లేడంటవ్ గదా..? గీ బోనాల పండుగేంది..? అని.. అసొంటి అజ్ఞాన మేధావులకు ఇగో ఇండ్ల సమాధానం ఉన్నది సూడుండ్రి..

 

Don't Miss