పోలీసాయన గల్లా పట్టి గుంజిన ఎమ్మెల్యే..

20:49 - December 29, 2016

పోలీసాయనకీ..ఎమ్మెల్యేకి జగడం వచ్చి పడిందబ్బా..గదేందనుకుంటన్నరా?చెప్తా ఇనుండ్రి..ఒకే బండిమీద ముగ్గురు పోరగాళ్లు పోతుండ్రు..పోరళ్లను ఆపిన పోలీసాయన రూ.100 లు జరిమానా ఏసిండు..గంతే గా పోరళ్లు మేమెవరనుకుంటున్నవ్..ఏనుగు రవీంద్రన్న మనుష్యులం మాకే ఫైనేస్తావా?అనంగనే కారులోంచి దిగిన ఎమ్మెల్యే పోలీసాయనతో జగడం పెట్టుకుండు..నువు కొలువు సేసేది మా సర్కార్ లోనే నని మమ్మల్యే ఆపేత్తావా? మామీదనే ఫైన్ రాస్తవా అని పోలీసాయన గల్లా పడ్డిండు..ఎవరానుకుంటున్నారా? గాయనే ఏనుగు రవీంద్రన్న సారు..మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీరందర్ రెడ్డి..నూనె తానం జేసిన రోడ్డు..టపా టపా అని బోల్తా పడతన్న బండ్లు..ముఖ్యమంత్రి సారు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్న సీఎం కేసీఆర్ వదుర్లపై మండిపడ్డ విపక్షాల వారు అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిండు..సీపీఎం పార్టీని సూదులు..దబ్బనం పార్టీ అంటూ కేసీఆర్ వదుర్లతో జనాల మండిపడ్డారు. తమిళనాడులో జయమ్మ జాగాలా మరో చిన్నమ్మ అవతరించింది. ఇసువంటి మస్తు ముచ్చట్ల కోసం గీ వీడియో సూడండి..మన మల్లన్న ముచ్చట్లు..

Don't Miss