అంబేద్కర్ విగ్రహాన్ని అరెస్ట్ చేసిన

20:18 - August 23, 2017

ఏమాట కామాట జెప్పుకోవాలెగని.. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచిపనిజేశిందమ్మ ఇన్నొద్దులకు.. ఆ బత్కమ్మ పండుగకు చీరలు వంచుడు కథ ఏమోగని.. ఆ చీరెలు తయ్యారు జేస్తున్న నేతకార్మికులకు మాత్రం జర్రంత చేతినిండ పనిదొర్కింది నాల్గొద్దులు.. సిరిసిల్లల..ఇంక వేరే జాగలళ్ల మగ్గాల మోతమోగుతున్నది.. ఈ చీరెల తయ్యారి మీదనే..

డాక్టరు తానికి వోతే.. నొప్పొచ్చినోనికి వైద్యం జేయాల్నా లేకపోతె ఎంటొచ్చినోనికి వైద్యం జేస్తడా..? రోగికి చికిత్స జేయాలేగదా..? మరి కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జేయాల్నా లేకపోతె గుంటెడు భూమి వోని ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయం సేకరించాల్నా మీరే జెప్పుండ్రి..? ప్రాజెక్టుల నష్టపోతున్న జనాన్ని అవుతల వెట్టి కావాలె అనెటోళ్లను లోపట వెట్టి అభిప్రాయం సేకరిస్తున్నరంటే ఇగ ఏమంటరో మీరే అనుండ్రి సూశినంక..

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మీరు మళ్లొక అవద్దం జెప్పిండ్రు సారూ..? నిన్న రెడ్డీ హాస్టల్ శంకుస్థాపన కార్యం కాడికి వొయ్యి మైకందుకోని మాట్లాడిండ్రుగదా..? సరే ఎందుకు మాట్లాడిండ్రు అనేది మీకెర్క వాళ్లకెర్కగని..? ఆ మాటలళ్ల ఒక పెద్ద అవద్దం ఇప్పుడు సోషల్ మీడియకు ఎక్కింది.. అట్లనే మల్లన్న ముచ్చట్ల తానికొచ్చింది.. ఇగ ఈడికొచ్చినంక దాసుడు ఉండది గావట్టి సూపెడ్తున్నం సారూ.. చిన్నవుచ్చుకోకు మన్సు..

తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సక్కగలేదు.. పైన పటారం లోపట లొటారం లెక్కనే ఉన్నది.. ఇది ప్రజల పరిపాలన గాదు.. జాగిర్దారుల పరిపాలన అంటున్నడు జేఏసీ చైర్మన్ కోదండరామయ్య సారు.. మీదికి గనిపిస్తున్నది ఒకటి లోపటి యవ్వారం ఇంకొకటి.. తెలంగాణను సత్తెనాశ్నం జేశిండు కేసీఆర్ అని చెప్పకనే జెప్పిండు ఢిల్లీల..

మన తెల్గురాష్ట్రంల ఊరికో నాల్గు విగ్రహాలున్నయ్.. గాంధీ తాతదో..? లేకపోతె వైఎస్ రాజశేఖర్ రెడ్డిదో.. ఎన్టీరామారావుదో.. ఇంద్రాగాంధీదో.. ఆంధ్ర రాష్ట్రమంత గల్పి.. కనీసం యాభై వేల విగ్రహాలకు ఇన్ని ఎక్వనే ఉంటయ్.. మరి అవ్వన్ని విగ్రహాలు వెట్టెతప్పుడు పర్మీషన్ దీస్కోనే పెట్టిండ్రంటరా..? ముప్పావు విగ్రహాలకు గూడ పర్మీషన్ ఉండది.. కని మరి ఈ అధికారులకు ఎందుకో అంత పైశ్చం.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పర్మీషన్ లేదని ఎత్కపోయిండ్రు ఒకతాన..

అబ్బా డ్రామా అంటే.. డ్రామనే పోండ్రి.. ఫిదా సీన్మ గూడ ఏం పన్కిరాదు ఈ డ్రామా మీదికి.. ఇసొంటి డ్రామ ఎన్కట సురభి నాట్యమండలోళ్లే ఏశిండ్రు.. మళ్ల ఇప్పుడు నిజాంసాగర్ ఎస్ఐ అంతిరెడ్డి ఏశిండు..? కథ క్లైమాక్సు.. స్క్రిప్టు.. దర్శకత్వం.. నిర్మాత అంత అంతిరెడ్డే వహించిండు.. నటినటులు మాత్రం సామాన్య జనం అయ్యిండ్రు.. సూడుండ్రి ఆ సీన్మ కథ..

ఒక్కటే దావఖాండ్ల ఒక్కటే యాళ్లకు రెండు కాన్పులైనయ్.. ఇద్దరికి ఆడివిల్లలే వుట్టిండ్రు.. మరి ఒకలి తల్లి గన్న బిడ్డెను.. ఇంకో తల్లికి.. ఇంకో తల్లి గన్న బిడ్డను ఇంకోతల్లికి ఇస్తె..? ఎంత పరేషాన్ అయితది..? అదే పొరపాటు అయ్యింది విజయనగరం జిల్లాల.. కన్పుకొచ్చినోళ్లకు కన్నబిడ్డలను మార్చి ఒకరి పిల్లను ఒకరికిచ్చిండ్రు పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss