రాజకీయ సన్నాశి శ్రీ లగడపాటి రాజగోపాల్ సారూ సర్వే

20:13 - August 24, 2017

నంద్యాల ఉప ఎన్నికలళ్ల ఎవ్వలో గెలుస్తరో తెల్సిందా..? నాకు తెల్సిపోయింది అంటున్నడు రాజకీయ సన్నాశి శ్రీ లగడపాటి రాజగోపాల్ సారూ.. సర్వే జేపిచ్చిన మొత్తం లెక్కలన్న దీపిచ్చిన.. ఎన్నికల ఫలితాల కంటె ముందే ఎవ్వలు గెలుస్తున్నరో పశిగట్టేశినా అంటున్నడు.. మరి మీకు గూడ తెల్సుకోలనున్నదా..? నంద్యాల కాడ ఎవ్వలు గెలుస్తరనేది..? సూడుండ్రి..

సమగ్ర కుటుంబ సర్వే అయిపోయింది ఫలితాలు ఏరులై పారుతున్నయ్ తెలంగాణల.. ఇగ ఇప్పుడు ఇంకో సర్వేనటనుల్లో.. అదే భూముల సర్వే.. తెలంగాణల ఏ రైతు తాన ఎంత భూమున్నది..? ఎవ్వలి సర్వేనెంబర్ ఎంత..? ఎవ్వలిది పోరంబొక్కు.. ఎవ్వలిది..? పట్టభూమి అనేది లెక్కలు దీశి పక్కా జేస్తడట ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. సూడుండ్రి ఆ లెక్కల తమాష..

హురక తెలంగాణ భూముల లెక్కలే అనుకున్న విద్యాశాఖ లెక్కలు గూడ దీయవోతున్నరట వచ్చెనెల ఒక్కటి తారీఖు సంది..? ప్రైవేటు బడులళ్ల సద్వెపోరగాళ్లెంత మంది.?. వాళ్లకు సద్వుజెప్పెటోళ్లు ఎంతమందున్నరు..? సర్కారు బడిగానీ.. ప్రైవేటు బడి టీచర్లు గానీ.. కచ్చితంగ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు పాసైనోళ్లే ఉండాలే అన్న నిబంధన మీద జేస్తరట..

చెర్కు రైతుల రుణాలు మాఫీ జేశే ముచ్చట ముఖ్యమంత్రి గారికి చెప్పిచెప్పి చెప్పి యాస్టొస్తున్నది అంటున్నడు ముఖ్యమంత్రి గారి బిడ్డె దేవనపల్లి కవితమ్మ.. రాష్ట్రంల నడుస్తున్నదే మీ నల్గురి ముచ్చటనాయే.. ఇగ బిడ్డమాట తండ్రే ఇనకపోతె మరి..? ఇగ జనం మాట ఏడ ఇంటడు శెల్లే..? జర్ర సముదాయించి చెప్పిసూడకపోయినవ్..?

లోకంల అనేక కళలుంటయంటరు.. మరి అండ్ల దొంగతనం గూడ ఒక కళకిందకే వస్తుండొచ్చు.. వస్తుండొచ్చేంది... బాజప్తొస్తది.. అయితే దొంగతనం జేయాల్నంటే గూడ.. కళఉండాలే.. దొర్కిపోయే తీర్గ ఉండొద్దు.. సగం సగం కోర్సు నేర్చి పొయ్యి దొంగతనం జేస్తె.. ఈజీగ దొర్కిపోతరు.. పూనెం లచ్చినారిగానిలెక్క.. అగో వీడెవ్వడనుకుంటున్నరా..? సూడుండ్రి వాడే సౌట దొంగ..

నమ్మితిరా శివ్వా అంటే ముంచితినే అవ్వా అన్నట్టు జేశిండు ఒకడు.. పాపం రూపాయి రూపాయి కుడవెట్టి ఒకనితాన చిట్టీలేస్కున్న పేదోళ్లకు పెద్దటోపే వెట్టిండు జగిత్యాల పట్నంల ఒకడు.. పాపం కట్టినోళ్లంత కూలినాలి జేస్కోని బత్కెటోళ్లేనట.. పాపం మస్తు బాధపడ్తున్నరు.. చిట్టీల వ్యాపారి కుచ్చుటోపి ముచ్చట జూడుండ్రి..

ఒక్కటే దావఖాండ్ల ఒక్కటే యాళ్లకు రెండు కాన్పులైనయ్.. ఇద్దరికి ఆడివిల్లలే వుట్టిండ్రు.. మరి ఒకలి తల్లి గన్న బిడ్డెను.. ఇంకో తల్లికి.. ఇంకో తల్లి గన్న బిడ్డను ఇంకోతల్లికి ఇస్తె..? ఎంత పరేషాన్ అయితది..? అదే పొరపాటు అయ్యింది విజయనగరం జిల్లాల.. కన్పుకొచ్చినోళ్లకు కన్నబిడ్డలను మార్చి ఒకరి పిల్లను ఒకరికిచ్చిండ్రు.. 

Don't Miss