తినేది మొగని సొమ్ము పాడేది ఎవ్వలి పాటనో

20:38 - December 12, 2017

అమ్మా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభమ్మా..? మందికేనా మీరు నీతులు జెప్పేది లేకపోతె మీరు గూడ ఏమన్న పాటించేది ఉంటదా..? మీ ముఖ్యమంత్రిగారు ఇట్లనే జెప్పిండా..? మీరు గెల్వంగనే.. వాన్ని తన్నుండ్రి.. వీన్ని దన్నుండ్రి.. ఎదురుదిర్గినోన్ని గెదిమికొట్టుండ్రి.. ప్రజలని గూడ జూడకుండ్రి అని చెప్పిండా ఎట్ల..? ఎట్లాని గొట్టినవ్ టోల్ గోళ్లను..? ఏం కథ..?

ప్రజలను గల్వలేనంత బిజీగున్నరా ఎట్ల తెల్గురాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తెలంగాణ ముఖ్యమంత్రిగారైతె ప్రగతి భవన్ల అడ్గేవెట్టనియ్యడు అది వేరే ముచ్చటగని.. కనీసం ప్రజలమన్షిని అని చెప్కతిర్గె చంద్రాలన్న ప్రజలను కల్వకపోతె.. మరి ఆయన ముఖ్యమంత్రి గిరి ఎందుకు..? ఏం కథ..? విజయనగరం జిల్లా కెళ్లొచ్చిన ఒక మహిళ చంద్రాలు దొర్కుతలేడని ఏం ఉపాయం జేశిందో సూడుండ్రిగ..

అరే నాయన ఈ నారాయణఖేడ్ పోలీసోళ్లకు ప్రత్యేక చట్టాలు.. ప్రత్యేక అర్హతలు ఏమన్న ఇచ్చిండ్రా ఎట్ల..? ప్రజల సొమ్ముతోని జీతం దీస్కుంట ప్రజలకు సేవ జేయుండ్రిరా వారీ అంటే ప్రజలను గొడ్లను గొట్టినట్టు గొట్టిస్తున్నరు.. మరి ఎవ్వని బిర్రు జూస్కోని ఈ తీర్గ ఎగురుతున్నరో ఏమోగని.. తినేది మొగని సొమ్ము పాడేది ఎవ్వలి పాటనో అన్నట్టు ప్రజలిచ్చెజీతం దీస్కుంట.. నాయకులకు కొమ్ముగాస్తున్నరుగదా..?

ధైర్యం నాతాన దండిగున్నది.. చెప్పులు దేపోరా మొగడా నిప్పులళ్ల దుంకుతా అన్నదట ఎన్కటికి ఒకామే.. సేమ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసోళ్లు పనిగూడ అట్లనే ఉన్నది.. వీళ్లే దొంగలకు సద్దిగట్టి వీళ్లే అక్రమార్కులను రక్షించుకుంటుంటే.. వీళ్లు పోలీసోళ్లు ఎట్లైతరు..? బ్రోకర్లు గదా కావాల్సింది..? ఔషధ ప్రయోగం కేసును ఎట్ల ఆగం జేశిండ్రో సూడుండ్రి..

అభివృద్ధిని జేస్తుంటె అడ్డుకుంటున్నరని విపక్షాలను తిట్టె తెలంగాణ ప్రభుత్వం.. మరి అభివృద్ధి జేయుండ్రి అని జనం మొత్తుకుంటుంటె గూడ ఎందుకు జేస్తలేదు ఒక్కొక్కతాన.. నంది మేడారం పనులు జల్దిన కంప్లీట్ జేశి.. యాసంగి పంటకు గూడ నీళ్లు అందెతట్టు జూడుమని అక్కడి జనం మొత్తుకుంటున్నరు.. మరి ఎందుకు జేస్తలేరు.. అండ్ల ఏం మిగుల్తలేవా ఎట్ల..?

తండ్రి వికలాంగుడు.. ముగ్గురు ఆడపిల్లలు చిన్నచిన్నోళ్లు.. ఉన్నది రెండు ఎక్రాల భూమి.. ఈ భూమిని సర్కారోళ్లు ప్రాజెక్టుల పేరుతోని గుంజుకోవాల్నని సూస్తున్నరట.. సర్కారు సద్విచ్చె పాయమాలుతోని ముగ్గురు ఆడివిల్లల పెండ్లీలు అయ్యి వాళ్ల భవిష్యత్తు మార్తదా..? ఎవ్వలికి జెప్పుకోవాల్నో అర్థంగాక.. ఆ ఆడపిల్లలు ఏడ్సుకుంట ఏమంటున్నరో ఇనుండ్రి..

తెలంగాణ పోలీసోళ్లే గొప్పోళ్లు అనుకున్నంగని.. ఆంధ్రా పోలీసోళ్లు గూడ అత్యంత ప్రతిభావంతులు తయ్యారైండ్రుగదా..? ఠాగూర్ సీన్మల సచ్చిపోయిన శవానికి వైద్యం జేశే సీను ఉంటదిగదా..? అగో అదే యాదికొస్తున్నది ఈళ్ల పనితనం జూస్తుంటే.. సచ్చి స్వర్గానికి జేరిన డీఎస్పీగారికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వంపిండ్రంటే తమాష గాకపోతే ఏందిది..?

ఆవుకు పెండ్లీలు జేయంగ జూశ్నం.. శ్రీమంతాలు జేయంగ జూశ్నంగని.. సచ్చిపోయిన ఆవుకు సావు జేయంగ జూశిండ్రా.. అది గూడ మన్సులకు ఎట్ల జేస్తరో ఒక సచ్చిపోయిన ఆవుకు అట్లనే జేశిండ్రు.. మాజీ నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం.. కోటమర్తి ఊర్లె అయ్యింది ఈ గమ్మతి ముచ్చట.. ఆవు అంత్యక్రియల కాడికి వాండ్రి పొయ్యొద్దం.. ఖర్చయ్యేదున్నదా..?

Don't Miss