సీపీఎం పాదయాత్ర బృందంతో మల్లన్నముచ్చట్లు

22:08 - March 16, 2017

సీపీఎం మహాజన పాదయాత్ర బృందంతో మల్లన్న ముచ్చటించాడు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
చెరుపల్లి సీతారాములు 
'పాదయాత్రకు అపూర్వమైన స్పందన వస్తుంది. గ్రామాలకు గ్రామాల ప్రజలు కదులుతున్నారు. పాదయాత్రకు ఎదురెళ్లి స్వాగతం చెబుతన్నారు. అనేకమైన విన్నపాలు చేస్తున్నారు. సమస్యలను పాదయాత్ర బృందానికి ఏకరవుపెడుతున్నారు. 
స్థానికంగా సమస్యలపై అధికారులకు మెమోరండం ఇస్తున్నాం. సమస్యలను పాదయాత్ర సందర్భంగానే అధికారులకు దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తున్నాం.
తమ్మినేని వీరభద్రం..
ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లలో ధర్నాలు చేయొద్దని...సిటీకి దూరంగా చేయాలని సీఎం కేసీఆర్ అంటున్నాడు.
జనం లేనితాన ధర్నాలు చేసి సమస్యలను చెట్లకు, పట్టలకు చెప్పుకోవాలా..? ప్రతిపక్షాలను లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నాడు. పోలీసులను భారీగా పెంచడం, పోలీసు వాహనాలను ఇచ్చాడు. జీతాలు ఇస్తున్నడు. నా లేఖలకు స్పందన లేదు.. ప్రత్యుత్తరం లేదు.. కానీ సమీక్షలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు కోతా పెడుతున్నారు. నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. 9800 కోట్లు వివిధ పథకాలకు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం దారుణంగా ఉంది. మోడీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. నల్లధనం వెలికి తీయలేదు. నోట్ల రద్దు దేశానికి పెద్ద విఘాతం. బీజేపీ మత భావాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుంది. ప్రజలు బీజేపీకి విజయం ఇచ్చారు..కానీ అది నష్టదాయకం.
రమ...
పాదయాత్ర చాలా బాగుంది. మహిళలకు ప్రభుత్వం ఆచరణలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆశా వర్కర్ల విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదని' చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

Don't Miss