మల్లన్న ముచ్చట్లు

Friday, October 27, 2017 - 21:29

చండీయాగంతోనే వానలు వడ్తున్నయట, సిట్టింగులకే సీట్లంటున్న సీఎం సారు, కన్నతల్లి, పెంచిన తల్లి ఇద్దరి అరెస్టు, గుప్తనిధుల కేసుల జేసీబీ బండి అరెస్టు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

Thursday, October 26, 2017 - 21:16

సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ఫస్ట్ దోకా, నవంబర్ ఆరు సంది జగనాలు పాదయాత్ర, అసెంబ్లీ ముట్టడికి ముందస్తు అరెస్టులు, కాంగ్రెసోళ్లతో భుజం గల్పిన రేవంతం, సీన్మ తమాషల చిక్కిన లక్ష్మీ పార్వతి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Tuesday, October 24, 2017 - 21:28

ముస్లీంలకు టీ ప్రభుత్వం క్రీం బిస్కెట్ వేస్తోందంటూ మల్లన్న చెబుతున్న ముచ్చట్లు చూడాలంటే వీడియో చూడండి.. 

Monday, October 23, 2017 - 20:14

ఇంక కొన్ని రోజులు ఇట్లనే భూమ్మీద ఉండెనాంటే... శ్రీక్రిష్ణ పరమాత్మున్ని మరిపిచ్చెతట్టే ఉన్నడు ఒకాయిన.. ముప్పై తొమ్మిది మందిని పెండ్లి జేస్కోని తొంబై నాల్గు మంది పిల్లలను గన్నడంటే.. చెప్పుండ్రి వాడు పోరగాళ్ల కంపిని వెట్టునట్టే లేదు ముచ్చట.. ఇప్పటికి మళ్ల సంబంధాలు జూస్కుంటనే ఉన్నట్టుండు.. బైటిదేశాలపొంటే ఉంటరేమో అనుకున్నగని.. మనదేశంల గూడ మోపైండుగదా ఒకాయిన మరి ఆయన కథ సూడాలంటే...

Saturday, October 21, 2017 - 20:24

ఈ నడ్మ ఆన్ లైన్ మోసాలు ఎక్వైపోయినయ్ గదా..? ఇర్వైవేల రూపాల ఫోను నాల్గువేలకే ఇస్తున్నం అని చెప్పంగనే అబ్బా అగ్వకొస్తున్నదని ఎగవడి పైసలు గడ్తున్నరు పార్సల్ ఇప్పిసూశి ఎడ్డిమొఖం ఏస్తున్నరు.. మాజీ నల్లగొండ జిల్లాల ఇద్దరు మోసపోయిండ్రు.. ఒకాయినకు సెల్ ఫోన్ వచ్చేదుంటే రాళ్లొచ్చినయ్.. ఇంకొకాయినకు ఇర్వైవేల ఫోనుకు బదులు ధనలక్ష్మీ యంత్రమొచ్చింది..గీ ముచ్చట జూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

Saturday, October 21, 2017 - 19:53

తెలంగాణలున్న బీసీ ప్రజలారా..? మీరు ఒక్కటి బాగ ఆలోచన జేస్కోండ్రి.. ఈ రాష్ట్రంల మీ జనాభా ఎంత..? : ఆలేరు ప్రాంత రైతాంగం సొంటెండ వెట్టి.. సిద్దిపేటకు నీళ్లు ఎత్కపోతున్న హరీష్ రావు మీద ఇగ లడాయే అంటున్నరు ఆలేరు ప్రాంత రైతులు.. ఏ ప్రజలైనా ప్రాజెక్టులకు ఎందుకు అడ్డంబడ్తరు.. వాళ్లకేదో నష్టమైతెనేగదా..? గుప్తనిధులను జూశిండ్రా మీరు ఎన్నడన్న.? భూమిలోపట పెట్టెలళ్ల కుండలళ్ల వెట్టి...

Friday, October 20, 2017 - 20:31

ఏం పనిలేనోడు ఆఖరికి కథలు జెప్పుకోనన్న బత్కొచ్చు అని ఎన్కట మా నాయినమ్మ అంటుండే.. రేవంత్ రెడ్డి మీ పార్టీల కొస్తున్నడటగదనే అన్మంతన్నా అంటే.. అరే నాయన మీరు ఇప్పుడు జెప్తున్నరుగని..ఇప్పుడున్న పోలీసోళ్ల కంటె ఎన్కటి రజాకార్లే నయ్యమున్నట్టున్నరుగదా..హరే నీయక ఇదెక్కడి ముచ్చటరో మళ్ల.. ఇప్పుడే జెప్పినగాదు.. బోధన్ సీఐ సురేందర్ గాని బాగోతం.. : గొర్ల స్కీం కథ ఉత్తదే అయ్యింది అనెతందుకు...

Thursday, October 19, 2017 - 20:11

తెలంగాణల మళ్ల అధ్యక్షా..? మాకు గూడ అవకాశం ఇయ్యాలే అధ్యాక్షా.. విపక్షాల గొంతునొక్కుతున్నరు అధ్యక్షా.. అన్న మాటలు మళ్ల ఇనవోతున్నం మనం..అదే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుర్వు జేస్తరట ఈనెలలనే.. ఈనెల ఇర్వై ఏడుసంది.. ఇగ మన అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటయో .. ఎట్ల ఉండబోతున్నయో గీ ముచ్చటతోని చెప్త ఇనుండ్రి..

దీపావళి ఎల్లిందంటే ఇగ హైద్రావాదుల ఆడాడ సదరు పండుగ సుర్వైతది.....

Wednesday, October 18, 2017 - 20:43

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ల కొస్తున్నడు..? వచ్చశిండు.. రాహుల్ గాంధీని కల్చిండు.. అయిపోయింది మాట ముచ్చట ఒడ్సింది.. ప్రచార కమిటీకి ఆయననే చైర్మన్ను జేస్తున్నరు.. ఏ పేపర్ల జూశినా ఈ ముచ్చటనే.. మరి నిజంగ వస్తున్నడా..? కాంగ్రెస్ పార్టీల శెరీకైతున్నడా రేవంత్ రెడ్డి అంటే.. మల్లన్న ముచ్చట్లకు అందిని సమాచారం ప్రకారం.. సూడుండ్రి..

వరంగల్ రోహిణి సూపర్ స్పెషాలిటీ దావఖాండ్ల ఒక ఫ్లోర్ల...

Wednesday, October 18, 2017 - 13:24

పసుపు తీర్థం బుచ్చుకున్న ప్యాన్ ఎంపీ...కర్నూలు జిల్లాల కలర్ మారిన రాజకీయం, నారాయఖేడ్ ఎమ్మెల్యే లంచం తీసుకుండు...మరి ఇచ్చిన సోడిగా నీది తప్పుకాదా..? ఉద్యోగాల కోసం నిరుద్యోగుల భిక్షాటన...ఇన్ని జేసిన మన సర్కారొళ్లకు పడ్తెన, డబుల్ బెడ్ రూం ఇండ్లళ్ల మోసం అయింది....దళారులే లబ్ధిదారులైండ్రని ఆడొళ్ల కోపం, హైదరాబాద్ ల బిచ్చగాళ్ల అరెస్టుకు రంగం సిద్ధం...చర్లపల్లి, చంచల్ గూడ జైల...

Monday, October 16, 2017 - 21:26

సిద్దిపేట, యాద్రాదికి నడుమ నీళ్ల పంజాది....తపాస్ పల్లి నీళ్ల కోసం ఆలేరొళ్ల తండ్లాట, ఇంత పెద్దమియా..డేడ్ పైసా దియా..దారిదప్పిన డబుల్ బెడ్ ఇళ్ల స్కీం, కోదండరాం ఎనుక నక్సలైట్లున్నరంట గదా..ఎడ్డి మాటలు మాట్లాడుతున్న ఇంటి మంత్రి, యాదాద్రి నర్సన్న గుడికి క్యాన్సర్ ముప్పు..ఉద్యమానికి రడీ అయితున్న బాధితులు, సర్కారు గొర్లముకున్న సంఘపొళ్లు...దొర్కిచ్చుకున్న ఆర్మూరు పోలీసొళ్లు, దొంగలకు...

Saturday, October 14, 2017 - 20:31

జేఏసీని జూశి దడ్సుకుంటున్న కేసీఆర్, సర్కారు దావఖాండ్లకొచ్చిన చంద్రాబాబు, ముఖ్యమంత్రి మాటతోటి రగులుతున్న మంట, బాధితురాలిని అరెస్టు జేశ్న పోలీసోళ్లు, వరంగల్ జిల్లాల మీడియాతోని పంచాది....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Friday, October 13, 2017 - 21:26

యాదాద్రి జిల్లాకు ముఖ్యమంత్రి ఢోకా, సీఎం వస్తున్నడంటే విపక్షాలోళ్ల అరెస్టు, భారతదేశం అగ్రగామి ఆకలి రాజ్యం, నెత్తి గొర్గి లంచం దీస్కున్నరని సస్పెండ్, కొండలళ్ల తిర్గుతున్న కలెక్టర్ అమ్రాపాలి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Thursday, October 12, 2017 - 21:13

కేంద్రమంత్రులకు తెలంగాణ కానుకలు, కొడ్కు అల్లుడిని పొగిడె తందుకే సభల?, పేదలకు బియ్యమిస్తమంటే అడ్డుకుంటున్నరు, ఏసీబోళ్లకు దొర్కిపోయిన పోలీసు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Wednesday, October 11, 2017 - 20:53

కొత్త జిల్లాల యాడాది మాష్కం, డీఎస్సీ ప్రకటన ఎన్క అసలైన కుట్ర, యోగిని సీఎం జేశింది పాలమూరు బిడ్డే, ఎన్టీఆర్ సీన్మకు జగన్ పెట్టుబడి... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

Tuesday, October 10, 2017 - 20:58

ఈనెల ముప్పై ఒక్కటి నాడు కొల్వుల కొట్లాట, చంద్రబాబు వల్లనే వానలు వడ్తున్నయ్, వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్ బాగోతం, ట్రంపు ఇంట్ల పెరిగిపోయిన సముతుల పోరు, పవన్ కళ్యాణ్ కు కొడ్కు వుట్టిండట.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Monday, October 9, 2017 - 20:10

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారంట.. ఒక వేస్టు ఫెల్లోనట.. ఇది నేనంటున్న ముచ్చటగాదు సుమా..? కోపానికొచ్చేరు చంద్రన్న దండు.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సారు మాట.. మరి ఆయనకు ఏడగనిపిచ్చిందో ఈన వేస్టు అన్న ముచ్చట జర్ర అర్సుకుందాం పాండ్రి.. రఘువీరా సారుగూడ అప్పుడప్పుడు ఎటో మాట్లాడుతుంటడు..

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఎంత పెద్ద పనిజేశిండో సూస్తిరా...

Friday, October 6, 2017 - 20:22

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? టీఆర్ఎస్ పార్టీ.. ఈ మాట ఉత్తంకుమార్ రెడ్డో.. కోదండరాం సారో.. రేవంత్ రెడ్డో చెర్కు సుధాకరో అంటలేడు సుమా..? ఇది విపక్షాల మాటగాదు.. నీళ్ల మంత్రి తన్నీరు హరీష్ రావు సారే అంటున్నడు.. తెలంగాణ అభివృద్ధికి అడ్డం బడ్తున్నది టీఆర్ఎస్ పార్టేనట.. కావాల్నంటే ఆయన నోటితోనే ఎలా జెప్పిండో వీడియోలో సూనుండ్రి..

Friday, October 6, 2017 - 20:18

సింగరేణి ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు...ఓ మాగంటి బాబు.. నీకేమన్న శిగ్గుశరం ఉన్నాదయ్య.. అన్ని బట్టెవాయి మాటలు మాట్లాడుతున్నవ్..? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ ఏదో తెల్సా..? వర్ల రామయ్య సారు చంద్రాలు కొంప ముంచెతట్టే ఉన్నడుగదా..? కన్న బిడ్డెను అమ్ముకోని తీర్థయాత్రలు తిర్గవోయిండ్రట తల్లిదండ్రులు.. ఇట్లనే ఉంటదా యవ్వారం..? ఇంకో...

Thursday, October 5, 2017 - 20:36

అరే నాయన ఇవ్వి సింగరేణి సంఘం ఎలచ్చన్లా లేకపోతె ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలా..? చిన్న హడావుడా చిన్న కథనా..? ఓ ఎన్నికల నిబంధనలు లేవు.. ఏం లేవు.. పోలింగ్ బూతు కాడ గూడ ప్రచారాలు జేసుడే..? పైకం బంచుడే.. ఎద్గ ఆ సర్కారు సంఘపోళ్లనే పట్టవశమైతలేదు.. వాళ్ల ఏశాలు జూస్తుంటే.. ఎన్నికలను ఎన్నికలెక్క గాకుంట... అద్రగానం లెక్కనే జేశిండ్రుగదా..?

అరే ఎక్కడి వాస్తు పిచ్చోళ్లు దొర్కిండ్రు రా...

Wednesday, October 4, 2017 - 21:23

సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. ఈనేపథ్యంలో మల్లన్న బొగ్గుబావిలో పర్యటించారు. గోదావరిఖని ఓపెన్ కాస్ట్ 1 నుంచి బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరిన్ని వీడియోలో చూద్దాం..

Tuesday, October 3, 2017 - 20:18

ఓ అయ్యా సారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారూ.. మీరు హైద్రావాదును డల్లాస్ జేయలేరుగని.. ఈ పట్నం వాసులకు ఇంటికో పడ్వనన్న గొనియ్యి.. వాళ్ల మానాన వాళ్లు ఉంటె ఉంటరు పోతె వోతరుగని..? కనీసం గా ఏర్పాటన్న జేయ్ నాయన.. నాలాల సర్వే.. స్కైవేలు.. మోరీల వెడల్పు.. ఈ మొతెవరి మాటలన్ని బంజేశి కనీసం గా పనన్న జేయుండ్రి.. ఓట్లేశి గెలిపిచ్చినందుకు..

ఊర్లపొంటి రైతు సమన్వయ సంఘాలు వెట్టి ఓట్ల...

Tuesday, October 3, 2017 - 08:27

ఎన్కట రామాయణంల రాముడు శివధనస్సును ఇశిండంటే.. మళ్ల ఇప్పుడే ఇశిరేశిండు నరేంద్రమోడీ..? ఆయననేమో భార్యకోసం ఇరగొడ్తె.. ఈన విల్లును ఎక్వతక్వ గుంజి ఇరగొట్టిండు... ఒక్క ముచ్చట జెప్పాల్నంటే మోడీ ఇజ్జత్ కచరా అయ్యింది సోషల్ మీడియాల.. పాపం దసర పండుగ వేడుకల స్టేజీమీద యాభై రెండించుల చాతి ఖ్యాతి గంగల గల్చింది..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

Tuesday, October 3, 2017 - 08:24

వారెవ్వ భళే ఉన్నవ్ కోదండరాం సారూ నువ్వు..? జనగామా ఎమ్మెల్యే మీద ముఖ్యమంత్రి గారు చర్యలు దీస్కోవాల్నా..? సింగరేణి ఎన్నికలళ్ల టీఆర్ఎస్ పార్టీ సంఘం పరిస్థితి ఆగానికొచ్చినట్టేనా..? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా..? డిపాజిట్ రాదని తెల్సినా..? పబ్లీకుల మాత్రం.. గెల్పు నాదే.. ఎంతైనా మన దత్తన్న అలయ్ బలాయ్ లేకపోతె దస్రపండుగ పూర్తైనట్టుండదిగదా..? అయ్యో పాపం మోత్కుపల్లి నర్సింహులు సారును...

Friday, September 29, 2017 - 21:18

సింగరేణిలోని బొగ్గు గని కార్మికులతో మల్లన్న ముచ్చటించారు. కార్మికులతోపాటు బొగ్గుబావిలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికులు పడుతున్న శ్రమను తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, September 27, 2017 - 20:56

చీరెల పంపిణీల 28 కోట్లు గోల్మాల్, వాన నీళ్లళ్ల కొట్కపోయిన మక్కజొన్న, పరిహారం అడ్గితె కేసులు వెడ్తున్నరు, కన్నీరు వెడ్తున్న మిడ్ మానేరు జనం, ఎంపీ నగేష్ ఇంటి మీద దొంగల పగ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Tuesday, September 26, 2017 - 21:11

చెత్తకుండి అయిన చంద్రాలు పోట్వ, గెల్పుకోసం శెమ్ట ఓడుస్తున్ననేతలు, లేకలేక పనిల మున్గిన గవర్నర్ సార్, కబ్జా కోర్ అయిన జనగామా ఎమ్మెల్యే, లలితా జ్యూవెల్లర్స్ ను మించిన నగలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియలో చూద్దాం...

Pages

Don't Miss