మల్లన్న ముచ్చట్లు

Friday, March 23, 2018 - 20:40

కాంగ్రెస్ పార్టీ మళ్లొక బహుజనుడిని బలిపశువును జేశింది.. నేను జెప్పలే మొన్న నాగం జనార్దన్ రెడ్డి సారు పార్టీ మారవోతున్నడు మారవోతున్నడు అని.. గవర్నర్ నర్సింహన్ సారును అడ్డగోల్గ తిట్టిండుగదా..? పొన్నం ప్రభాకర్..నిండు అసెంబ్లీలనేమో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం జెప్తున్నడు.. కేసీఆర్ అసొంటి తీస్మార్కాండ్లను మస్తుగ జూశిండ్రు ఈ తెలంగాణ ప్రజలు..రాచకొండ పోలీసు కమీషనర్ సారు.. నీకు...

Thursday, March 22, 2018 - 20:25

తెలంగాణల నీళ్ల పంచాది సుర్వైనట్టే అనిపిస్తున్నది.. ఇంక ఎండకాలం పూరాగ రానేలేదు అప్పుడే ఆడోళ్లంత బిందెలు చేతుల వట్కోని రోడ్ల మీదికొస్తున్నరు..తెలంగాణ గౌడన్నలు.. మీరంత తలా ఇంత చెక్కరి దీస్కోని నోట్లె వోస్కోండ్రి మీకు తియ్యటి ముచ్చట జెప్పిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు..ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంల సద్వులు సత్రోలున్నయ్ రా నాయనా అంటే.. ఇప్పుడు టెన్త్ ప్రశ్నా పత్రం మళ్ల లీక్...

Wednesday, March 21, 2018 - 20:26

మల్లన్నముచ్చట్లు : మోదీకీ పవనాలకి లగ్గం చేసిన టీడీపీ తమ్ముళ్లు.. ఏపీకి అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగులుతుందంట. గో పక్కేమో కవితమ్మ ఏపీకి హోదా గివ్వాలనే..మరోపక్క టీఆర్ఎస్ ఎంపీలు సఢ స్టాట్ చేయంగనే వెల్ కాడికెల్లి లొల్లి లొల్లి పెడుతుండే..దీనిపై ప్రజలు చెవులు కొనుకుండ్రంట..పనిచేయనివాళ్లకు జీతం ఇవ్వొద్దని లోక్ సభ స్పీకర్ కు ఉత్తరం ఇచ్చిన మనోజ్...

Tuesday, March 20, 2018 - 21:04

తెలంగాణ ప్రభుత్వానికి అసలైన పంచాంగం నిరుద్యోగులే జెప్పెతట్టున్నరు రాబోయే ఎన్నికలళ్ల.. మొన్న అసెంబ్లీల ముఖ్యమంత్రిగారు ఏం జెప్పిండు.. ఇప్పటికే ఇర్వై ఏడువేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం.. ఇంకా భర్తీగావాల్సినయ్ ఉన్నయ్ అన్నడుగదా..? కని ముఖ్యమంత్రిగారు జెప్పిన లెక్కలకు మీడియా జేశిన ఎంకువైరీకి పొంతన గలుస్తనే లేదు..

కేసీఆర్ గారు గట్టవోతున్న మూడో ఫ్రంట్.. ఇది మూడో ఫ్రంటు గాదు.....

Monday, March 19, 2018 - 20:41

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ రానుందట..కోదండరాముడు పార్టీ పెడ్తుండు..జెండా ఏందో...ఎజెండా ఏందో తెలియనుందట..దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేటందుకు బెంగాల్ పోయిన కేసీఆర్ సారు..కలకత్తా అక్కతోని చర్చలన్నీ సేసేసిండు..అవిశ్వాసంపై ఎన్నో అభిప్రాయాలు వచ్చేసినుల్ల..మోదీగారి సర్కార్ కు గండమని గన్ని మీడియాలు లొల్లి లొల్లి సేసేనియ్యి...మోడీ..నీరవ్ మోడీ ఒకటే నన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్...

Saturday, March 17, 2018 - 21:04

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన...

Friday, March 16, 2018 - 21:38

తెలంగాణ జనం సంతోషంగున్నరు...ఆనందం ఎల్లగక్కిన అధినేత కేసీఆర్, మందక్రిష్ణను మళ్ల అణచివేస్తమన్న సీఎం..మస్తుగ జూశ్నం మీ అసొంటోళ్లనన్నక్రిష్ణ, అయ్యా భజన సుర్వు జేశ్న నారా లోకేశం...ఆర్కేస్ట్రా టీం ఒక్కటే తక్వుండే అసెంబ్లీల, చైర్మన్ సారు కంటి చికిత్స విజయవంతం...డాక్టర్లకు రుణపడి ఉన్న తెలంగాణ జనం, ఎంపీ, ఎమ్మెల్యే కీసులాటకు సీఐ బలి...బహుజన పోలీసు అధికారి సస్పెండ్, ఉంటె పులన్న ఉండాలే...

Thursday, March 15, 2018 - 21:02

లక్షా డెబ్బైవేల కోట్ల రూపాల బడ్జెట్..బడ్జెట్ దండిగ.. పేదల బత్కు ఎండగ,  ఇర్వైఏడువేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం..లక్షా పన్నెండువేల సంగతేంది సారు, జగిత్యాల కాడ అన్నదాతల ఆవేదన..మద్దతు ధర అడ్గుడే పాపం అరెస్టులు, నకిలీ ట్విట్టర్ ఫాలోయింగు గుట్టురట్టు...కేటీఆర్ మిలియన్ కథ జెప్పిన జనం, సర్కారు అధికారి మీద రంగారావు దాడి... ముఖ్యమంత్రి సుట్టాన్ని అని బెదిరింపులు, ముహూర్తం ఆల్చమైందని...

Tuesday, March 13, 2018 - 21:01

కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు..సర్కారు ఇడ్సిపెడ్తలేదుగదా తన జిద్దు, మూకుమ్మడి రాజీమాలకు కాంగ్రెస్ ప్లాన్...మీడియా సహకరిస్తలేదన్న ఉత్తంరెడ్డి, కోమటిరెడ్డితోని కేసీఆర్ ప్లాన్ ఏశిండా.?..కాంగ్రెస్ ఏలుతోని కాంగ్రెస్ కంటికే గాయం, కాంగ్రెస్ను క్లీన్ బోల్డ్ జేయవోతున్నకేసీఆర్..రాజ్య సభ ఎన్నికల కోసం పక్కా స్కెచ్, తెలంగాణ రాష్ట్రంల ధర్నాలే ధర్నాలు...బంగారు తెలంగాణల బత్కులేని...

Monday, March 12, 2018 - 21:55

అనుకున్నట్టే అయ్యింది.. తెలంగాణ అసెంబ్లీ పేరంటం పెంట పెంట అయ్యింది.. ఓదిక్కు గవర్నర్ నర్సింహన్ సారు ఎనలేని పథకాల కీర్తిని వివరిస్తుంటే.. కాంగ్రెసోళ్లు కాయిదాలు చింపి ఇశిరేశిండ్రు.. ఇగ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జర్ర ఓవరాక్షన్ జేశి హెడ్ ఫోన్సు ఇశిరేస్తె స్వామీగౌడ్ సారు కంటికి దాకింది.. ఆయన మీద చర్యలు దీస్కుంటరట రేపు.. ఇదిట్లుంటే.. అప్పటి అసెంబ్లీ గాదుగదా.?? అందుకే...

Saturday, March 10, 2018 - 20:22

మిలియన్ మార్చ్ సభకు సర్కారు అడ్డంకి...సడాకులు బందు వెట్టి.. నేతలను దొర్కవట్టి, కోదండం పిల్పు నిస్తడు కేసీఆర్ సక్సస్ జేస్తడు..అడ్డుకోని జేఏసీకి సాయం జేస్తున్న సీఎం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలదంట...మేమే అన్ని జేశ్నమంటున్న హరీష్ రావు, కేసీఆర్కు ఝలకిచ్చిన మమతా బెనర్జీ...కాంగ్రెస్ తోని పొత్తుకు తయ్యారున్నన్నది, కరీంనగర్ పట్నానికి చేరిన డీఎస్పీ యాత్ర..భారత రాజ్యాంగం ప్రతి...

Friday, March 9, 2018 - 20:35

మందకృష్ణ మాదిగ మర్డర్ కు సర్కార్ కుట్ర పన్నిందట. ఈ కుట్రలో ఓ మంత్రిగారి ప్రమేయముందని మందకృష్ణ సెప్పిండంట..బీజేపీ వైఖరి దున్నపోతుపై వాన పడినట్లేనన్న జేసీ దివాకర్ రెడ్డి. మీడియా కోసమే తప్ప ఎవరికీ చిత్తశుద్ధి లేదంట. రెండు పెగ్ లేస్తే..ఫ్రంట్ ఏదో బ్యాక్ తెలీని కేసీఆర్ కు ఫ్రంట్ అవసరమా అనే విమర్శలు, సెంట్రల్ లో మోదీ, ఇక్కడ చూస్తే కేడీ అంటున్న రేవంత్ రెడ్డి..మిషన్ భగీరథ పైపు...

Thursday, March 8, 2018 - 20:29

హైదరాబాద్ : మహిళలతో అంత్యాక్షరి ఆడించిన మల్లన్న..భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుకున్న అమెరికా పార్లమెంట్, చొప్పదండి ఎమ్మెల్యే శోభక్క పెనిమిటి. మరి గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న తాతా మోసుకొచ్చిండు..మీరు కూడా మస్తుగా ఖుషి అవ్వాలంటే మన మల్లన్న ముచ్చట్లు చూడాల్సింది. మరి జాగెందుకు చూడుండ్రి మల్ల..

Wednesday, March 7, 2018 - 21:32

వచ్చెసారి ఓట్ల వర్కుతెలంగాణ రాజకీయం...మూడు కూటములదే అసలైన పోరాటం, కేసీఆర్ను ఉత్కి ఆరేస్తున్న ఉత్తంకుమార్...అంతే స్థాయిల అర్సుకున్న కోదండరాం, ప్రత్యేక నిరసనకు దిగిన చిత్తూరు ఏశకాడు..మోడీ ఇచ్చిన మట్టీ, నీళ్లు వాపసిస్తడట, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏడు కోట్లతోని బస్సు..మళ్లొక్కటి గొనెతందుకు సర్కారు సమాయత్తం, విపరీతంగ వెర్గిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం...బస్సుఆపి మరీ తన్నుకున్న...

Tuesday, March 6, 2018 - 21:40

రైతు పోరుకు రెడీ అంటున్న సీపీఎం..సర్కారు మోసం జేస్తుందన్నతమ్మినేని, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు విల్వలేదా..?..హామీలిచ్చి మరచిని చంద్రాలు ఏందీ కథ?, అన్నంకోసం అద్దరాత్రి రోడ్డెక్కిన స్టూడెంట్స్...శాతవాహన యూనివర్సిటీల శాతగాని పాలన, కేసీఆర్ కిట్ అద్భుతనుకొచ్చిన కడియం...సద్వుల సంగతి చెప్పెతందుకు బిడియం, తెలంగాణల రాలిపోతున్న రైతన్న బత్కులు...నిన్న ఒక్కనాడే ముగ్గురు రైతుల...

Saturday, March 3, 2018 - 20:49

అవద్దాలు శోధిస్తున్న నిజనిర్దారణ కమిటీ...ప్రత్యేక హోదా మీద మళ్ల ప్రత్యేకంగ భేటీ, సర్కారు వంచిన సబ్సిడీ టాక్టర్ల గోల్ మాల్..టీఆర్ఎస్ లీడర్లకే ముడుతున్న పథకాలు, నాయిని నోరు జారిండన్న బిడ్డె కవితమ్మ...ప్రథాని మీద వాడిన పదానికి వివరణ, మంత్రి మహేందర్ రెడ్డికి పుట్టెడు అవమానం...అమరుని సంస్మరణ సభల ఆడుకున్నజనం, హోళీ పిడిగుద్దులు గుద్దుకున్న జనాలు... ఆచారం ఇదేనట.. ఊరంత బాగుంటదట,...

Friday, March 2, 2018 - 20:54

ఇప్పటికిప్పుడు ఓట్లొస్తె జేఏసీకి ఇర్వై సీట్లు..కోదండరాం జేపిచ్చుకున్న ప్రత్యేక సర్వే, జానాబాబా నల్పైమంది దొంగల పంచాది...కేటీఆర్ను ఉతికి ఆరేస్తున్న కాంగ్రెసోళ్లు, పన్నెండు మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్..పోస్టు మార్టాలకే సరిపోతున్న భద్రాచలం దావఖాన, టీఆర్ఎస్ పార్టీతోని పొత్తువెట్టుకోవాల్సిందేనట...మొత్తుకుంటున్న మోత్కుపల్లి నర్సింహులు, అసెంబ్లీ ఎన్నికలకు ఆత్మలతోని ప్రచారాలు......

Thursday, March 1, 2018 - 20:20

తెలంగాణ, ఆంధ్రల హోలీ పండుగ ఎట్లైంది..?, 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న ఉత్తమ్... 106 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్, పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు అందని పరిహారం, నాలుగు నెలల నుంచి రాని పించన్లు...వృద్ధులు, వికలాంగుల ఆందోళనలు, రైతుల గోసలు, సెల్ ఫోన్ ఎవరు గెలిచారు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లు వీడియోలో...

Wednesday, February 28, 2018 - 20:56

ఓట్లు దగ్గరికొస్తున్నా కొద్దికి శిగాలొస్తయా ఏంది..? ఈ రాజకీయనాయకులకు.. ప్రధానమంత్రి మోడేదో దిగజారి మాట్లాడుతున్నడు.. ఇటు చంద్రశేఖర్ రావుగారేమో ఎగవాకి మాట్లాడవట్టే.. ముఖ్యమంత్రి స్థాయి మన్షితోని మోడీ పంచాది.. ప్రధానమంత్రి స్థాయి మన్షితోని కేసీఆర్ పంచాది.. వీళ్ల పంచాది ఎందుకు..? ఎవ్వలికోసం అన్నట్టు..? 

చంద్రబాబుకు నల్పై ఏండ్ల రాజకీయ బారసాల బాగనే జేశిండ్రు ఆంధ్రల...

Tuesday, February 27, 2018 - 20:46

చింతకాయల కథ సెప్పిన రేవంత్ రెడ్డి..కేసీఆర్ గూడ అసొంటోడే అంటున్నడు, కాంగ్రెస్ పార్టీ యాత్ర మీద మంత్రి కౌంటర్...ఆమీలన్నీ నెరవేర్సేసినమంటున్న జగదీష్, ప్రత్యేక హోదాకు అడ్డంకి రాష్ట్ర నాయకులే...ప్రజల ప్రశ్నిస్తే తప్ప దొర్కరు ఈ దొంగలు, తెలంగాణల ఊపందుకున్న డీఎస్పీ యాత్ర... ఊహించని ఉద్యమంగా దళిత శక్తి ప్రోగ్రాం, శ్రీదేవిగారి సావుజేస్తున్న టీవీలు, పేపర్లు... ఎవల్కిఅక్కరకొచ్చే...

Monday, February 26, 2018 - 20:33

కేసీఆర్ను ఓడగొట్టి కుర్చిల కెళ్లి కిందికి దించితె తప్పు తెలంగాణల ప్రజల బత్కులు మారయంటున్నడు బిఎల్ఎఫ్ నేత తమ్మినేని వీరభద్రంగారు..తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు జోరుమీదికొచ్చిండ్రుగదా... బస్సుయాత్ర వెట్టుకోని బాగనే తన్లాడుతున్నరు.. రైతుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అంటున్నడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు..ఓ దేవనపల్లి కవితమ్మా.. ఎటువాయే...

Friday, February 23, 2018 - 20:12

రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగ ఇడగొట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆగం జేశిండ్రు అంటున్నడు ఆణిముత్యం చంద్రాలు..తెల్గుదేశం పార్టీని బీజేపీని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుమని పిల్పునిస్తమంటున్నడు.. పిడమర్తి రవిగారు..రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారి ఏక్ నంబర్ దొంగ ఉన్నట్టుండుగదా..? కాంట్రాక్ట్ అనే పదాన్ని తెల్గు నేలకు పరిచయం జేశిన పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు...ముత్యంరెడ్డి...

Thursday, February 22, 2018 - 20:56

మొన్న నాగం జనార్దన్ రెడ్డిగారు ఢిల్లీకి సీక్రెటుగ వొయ్యి ఎవ్వలిని గల్చిండట తెల్చిందా.. మీరంత మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రువా..? ఓదిక్కు రైతులు తన్లాడుతుంటే.. కనీసం వాళ్లగురించి ఆలోచన జేస్తున్నరా..?తెలంగాణ జేఏసీ సర్కారు మీద రివైంజ్ తీర్చుకుంటున్నది.. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరులు యాదికొచ్చిండ్రు.. ఈ భూమ్మీద ఏ జీవైనా సరే.. బత్కి బట్టగట్టాల్నంటే ఆహారం...

Wednesday, February 21, 2018 - 20:50

అయ్యో తెలంగాణ సర్కారును నోటికొచ్చినట్టు తిడ్తున్నరు సోషల్ మీడియాల జనం..తెలంగాణ ప్రజలారా..? మీకు తెల్సా..? మీరు ఎంత అప్పులళ్ల జిక్కిన సంగతి..? ఏ జగదీశ్వర్ రెడ్డి గురించి నేనెందుకు మాట్లాడ్త.. ఆయన తీన్ పీటుంటడు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం తయ్యారైనట్టే అనిపిస్తున్నది...ఆర్ఎస్ పార్టీకి ధమ్ముంటే.. కాంగ్రెస్ పార్టీల గెల్చి టీఆర్ఎస్ పార్టీల జేరిన ఎమ్మెల్యేలు,...

Tuesday, February 20, 2018 - 20:25

తెలంగాణ ప్రజలారా.?? మీరంత మళ్లొకపారి తలా ఒక పువ్వు దెంపుకోని తయ్యారు వెట్టుకోండ్రి..పేదల కష్టాలను నా భుజస్కందాల మీద ఏస్కోని మోయడానికి నేను సిద్దంగా ఉన్నాను అంటున్నడు నారా చంద్రాలు సారు.. తెలంగాణ రాష్ట్రమొస్తె మన నీళ్లు మనకొస్తయనుకున్నం.. వచ్చేశ్నయ్.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటే మూతి మీసాలు గాలినట్టు.. అయ్యో పాపం ముఖ్యమంత్రిగారికి అల్లుడు.. గదా అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటే...

Monday, February 19, 2018 - 20:19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల రాజకీయాలు జూస్తుంటే ఏమనిపిస్తున్నది..? అబ్బా లీడర్లకు కమిట్మెంట్ అంటె ఇట్లుండాలే.. ప్రజల మీద..? మళ్లొక పారి మనం ఈ లీడర్లనే గెలిపిచ్చుకోని రుణం దీర్చుకోవాలె అనిపిస్తలేదు.. ప్రత్యేక హోదా విషయంల చంద్రబాబు కమిట్మెంట్... జగన్ బాబు.. ఆరాటం.. పవన్ బాబు పాకులాట.. బీజేపీ పనితనం.. కాంగ్రెస్ హెచ్చరికలు... జూస్తుంటే.. ఇట్లనే అనిపిస్తది.. కని అస్సలు కథ గిది.....

Saturday, February 17, 2018 - 21:47

ఈ కేకుల కటింగులు.. శంకుస్థాపనల సంగతేమోగని.. పాణాలు వోతుండే పబ్లీకుయి.. పొయ్యిపొయ్యి జోగురామన్న గూసున్న వేదిక టెంటుకే మంటలంటుకున్నయ్.. మంత్రిగారాయే.. కింద మందుండే.. మరి టపాకులు గాల్చిండ్రా.? ఏమైంది తెల్వదిగని.. మొత్తం మీద ఒక కుల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఆగమాగమైంది జర్ర శేపట్ల..

తలాపునే పారుతుంది గోదారి.. మనశేను.. మన చెలుక ఎడారి..? తెలంగాణ రైతు బత్కు అమాస.. చంద్రయ్య...

Pages

Don't Miss