మల్లన్న ముచ్చట్లు

Friday, February 19, 2016 - 20:16

హైదరాబాద్ : మూడు రోజుల దీక్షకు కూర్చున్న వికలాంగులు... మద్దతిచ్చి మంచి చెడ్డలు అరుసుకున్న ఆర్.కృష్ణయ్య, కస్తూర్బా హాస్టల్ లో బొడబొడ కక్కిన ఆడపిల్లలు.. దావఖానాలో వేసి సూదులిచ్చి పరీక్షలు..డ్యూటీలో ఉండి మందు కొట్టిన పోలీసోళ్లు..పద్మవీర చక్ర అవార్డు ఇచ్చి సత్కరించాలని టాక్, పారా, గడ్డపారతో పాఠాలు నేర్పుతున్న పంతుళ్లు...ద్రోణాచారుడిని మించిన...

Friday, February 19, 2016 - 07:56

ఇట్ల దాపురం అయ్యిండ్రేందమ్మా.. వాళ్ల నోట్లె పొక్కులు వొడ్వ.. వొక్క దెగ్గర అయిపోంగనే వొక్క దెగ్గర వొక్క దెగ్గర అయి పోంగనే వొక్క దెగ్గర సుర్వు జేస్తున్నరు అడ్డమైనోల్లు.. వాళ్లను మనుండంగనే కుత కుత ఉడ్కుతున్న నూనెలేశి గోలియ్య.. నిజాంబాద్ జిల్లా కామారెడ్డి కాడ కొందరు దేడ్ దిమాక్ గాళ్లు ఏం దంద జేస్తున్నరో సూడుండ్రి సూశినంక మీరు గుడ జాగ్రత్తగ వుండుండ్రి..

Friday, February 19, 2016 - 07:55

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కాడ కొంతమంది ప్రజలు రోజుకు ఎన్మిది గంటలు గాదు.. రోజుకు ఇర్వై నాల్గు గంటలు పనిజేస్తున్నరట.. నిద్రలేదు.. ఇళ్లు లేదు.. పెండ్లాం పిల్లలు.. అయ్య అవ్వలు ఎవ్వలు లేరు.. కష్టాన్నే నమ్ముకోని.. ముంగటికి వోతున్నరు.. ఆ కష్టపోతులకు పోలీసోళ్లు విముక్తి గల్పిచ్చిండ్రట.. మరి వాళ్ల కష్టమేంది..? పోలీసోళ్లు ఎందుకు వొయ్యిండ్రు అనేది తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి.

Friday, February 19, 2016 - 07:53

సర్కారు నౌకరంటె ఎట్లుంటది..? పొద్దుగాళ్ల పదిగొట్టంగొచ్చి.. పొద్దుందాముల ఆరుగంట్లకు ఇంటికి ఎల్లిపోవుడుగదా..? యాళ్ల గాకముందుకు సంచి సంకల వెట్కపోతె తప్పైతది.. కని ఆరుగంట్లకు అయిపోవాల్సిన నౌకరి రాత్రి తొమ్మిది పదిగొట్టెదాక పనిజేస్తుంటె వాళ్లను మెచ్చుకోవాల్నా..? అరెస్టు జేశి జైలుకు వంపాల్నా మీరే జెప్పుండ్రి.. శెబ్బాష్ అని.. మెచ్చుకోవాల్సింది ఇడ్సిపెట్టి..అరెస్టు జేశిండ్రు.. మరి...

Thursday, February 18, 2016 - 20:37

బండిపై వెళ్లి తనిఖీలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు..బీడీ కార్మికుల బాధలు...నెల్లూరు జిల్లాలో అధికారుల అరెస్టు..పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసోళ్లు..పైకం ఉంటే సర్కారీ నౌకరీ ఇచ్చినోళ్లను అరెస్టు..అదిలాబాద్ జిల్లాలో నీళ్ల కోసం గిరిజనుల ఏడుపు..ఏపీలో ఉపాధి హామీ వర్కర్ల బాధలు..నిజామాబాద్ జిల్లాలో కల్తీ నూనె తయారీ..చెప్పు కోసం తాగుబోతు విన్యాసాలు..ఆపదలో...

Wednesday, February 17, 2016 - 12:19

తెలంగాణల లంచం ఎవ్వడన్న లంచం అడ్గితె.. 040-23454071 నంబర్కు పోన్ గొట్టుండ్రి అని కేసీఆర్ సారు సరిగ్గ పదమూడు నెల్లకింద వరంగల్లు జెప్పిండు. ఐతే.. సీఎం సారు మాకు గాదు వరంగల్లోల్లకు జెప్పిండు అన్కున్నరో ఏమో గని.. కరీంనగర్ జిల్లా ఎములాడలున్న కొందరు గవుర్మెంట్ అధికార్లు ఏం జేశిండ్రో జూడు నా సామిరంగ ఉండాలే భూమ్మీద ఇసొంటి సద్వుకున్న ఉద్దుండులు..సూడాలంటే వీడియో చూడుండి. 

Wednesday, February 17, 2016 - 12:13

భాగ్య నగరాన్ని స్వచ్చ ఐద్రావాద్ జెయ్యాల్నని.. కేసీఆర్ సార్ కంకణం కట్టుకొని అకుంఠిత దీక్షతోని పురుడు పోశి.. భారసాల జేశ్న భాగ్యనగరం స్వచ్చతకు నోచుకోలేదట.. సంటర్ సర్కారోల్లు జేశ్న సర్వే తోని ఈ ముచ్చట ఎర్కైంది. మన పట్నం పేర్ను ఏన్నో దూరం పడేశిండ్రు.. సెత్త బుట్టలు పంచిపెట్టి.. సీఎం సారు గంత గానం కష్టవడే.. గట్లెందుకు ఎన్కవడ్డదో ఏమో తెలుస్తలేదు. ఎందుకో ఈ వీడియో క్లిక్ చేయుండ్రి...

Wednesday, February 17, 2016 - 12:11

పెన్ను పేపర్ వట్కోని.. అఆలు దిద్దాలి.. అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మయ్య మొత్తం మీద నాల్గు అచ్చరాలు మాత్రం నేర్సుకున్నపో.. ఇన్నొద్దులు ఏంగాదు సద్వురాకున్నా అనుకున్నగని... అమ్మో ఇంతమోసమైతదని తెల్వకపాయే.. ఏంది మల్లన్నా.. ఏమో సద్వంటున్నవ్ మోసమంటున్నవ్ అనిపిస్తున్నదా..? అయ్యో మీరు గీ వీడియో సూడుండ్రి మీకే తెలుస్తది. 

Tuesday, February 16, 2016 - 21:44

ఖమ్మం జిల్లా మీద ముఖ్యమంత్రి వాన, మామకు ప్రేమతో అంటున్న ఫ్యాన్స్, పాలమూరు కాంగ్రెసు మీద కారు మన్సు,చ సద్వుబంజేస్తె సంఘ బహిష్కరణమే నట, దర్వాలలు ఇరగొట్టి.. బ్యాకుకు తొర్రవెట్టి ఈ అంశాలను మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం 

Monday, February 15, 2016 - 20:30

వరంగల్..ఖమ్మం రిజర్వేషన్లు ఖరారైయినయి..ఖమ్మం జిల్లాలో కలియదిరుగుతున్న కేసీఆర్...మంగళవారం నాడు ఖేడ్ ఓటింగ్..ట్యాంక్ బండ్ పై ప్రేమికుల ఇబ్బందులు..మేడారం జాతర..నీటి కోసం ఒంగోలు ప్రజల ఇక్కట్లు...బీడీ కార్మికుల ఆందోళనలు..కేటీఆర్ ఇలాఖాలో చిన్న బోయిన న్యాయం..ఆత్మహత్య చేసుకున్న బస్సు.. తదితర అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించాడు. మరిన్ని...

Monday, February 15, 2016 - 20:20

ప్రేమికుల రోజు...ఫిబ్రవరి 14వ తేదీ..ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఎదురు చూస్తుంటరు కదా. ఎంతో మంది సెలబ్రేషన్ చేసుకుంటరు కదా. దీనిని అడ్డుకోవడానికి ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలు ప్రయత్నిస్తుంటరు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రేమికులను అడ్డుకున్నరు. ట్యాంక్ బండ్ పై భరతమాత బిడ్డలు అనే చెప్పుకొనే వీరు హల్ చల్ చేసిండ్రు. భరత్ మాతాకి జై..జై..శ్రీరాం..అంటూ నినాదాలు చేసిండ్రు...

Monday, February 15, 2016 - 20:07

టెన్ టివిలో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథి తన పాటతో అలరించాడు. సోమవారం నాడు ప్రసారమైన మల్లన్న ముచ్చట్లులో ఇబ్రహింపట్నం, యాచారం మండలం ధర్మనగూడెనికి చెందిన మండల నరేందర్ వచ్చాడు. ఈ సందర్భంగా తన ఓ పాట వినిపించిండు. ఆ పాట గెట్లుందో వీడియోలో వినండి.

Saturday, February 13, 2016 - 20:09

హైదరాబాద్ : సవ్వారీ ఎవ్వరిదీ... సల్లబడేది ఎవ్వరిదీ. నారాయణ ఖేడ్ ఆటల పోటీలు ఖతం, వ్యభిచారం కథ చెప్పిన సిపిఐ నారాయణ... రాజకీయానికి సరిగ్గా కలిసిన సూటీ, వ్యవసాయం చేయబోతున్న సర్కార్... కూరగాయల దుకాణాల మీద నజర్, తాత కోసం వెతుకులాడుతున్న మనుమడు.... ఢిల్లీలో కేసీఆర్.. సచివాలయంలో ఇమ్మాన్ష్, ముంబైలో దీక్షకు కూర్చున్న మోడీ వైఫ్, స్వచ్ఛా పేరుతో...

Friday, February 12, 2016 - 20:11

హైదరాబాద్ : టివి జర్నలిజంలో ఓ ధృవతార రాలిపోయింది. ప్రజల భాషల్లోకి వార్తలు తీసుకొచ్చి మహామేధావి అరుణ్ సాగర్, సార్ మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మల్లన్న ముచ్చట్ల తరపున కోరుకుంటున్నాం. అప్ డేట్ దిక్కు అడుగులు వేస్తున్న అసెంబ్లీ... కంప్యూటర్లతోనే రేపటి ప్రశ్నోత్తరాలు, వోట్ల నామ యాడాదిల వొడ్వని పండ్గ... వారం పది రోజులల్లోనే మున్సిపాలిటీ ఓట్లు, తెర్లు...

Friday, February 12, 2016 - 13:16

ఆనందంతోని అంగి లాగిడ్సి ఎగిరితె.. ఆకలిగొన్న కుక్క అవ్వెత్కపోయిందట అని అంటరు సూడు... అగో అట్లనే అయ్యింది తమిళనాడుల ఒక పోలీసాయిన పనిగూడ.. ఆనందం ఆపుకోలేక.. కాళ్లకు భర్త నాట్యం జోడియ్యవొయ్యి.. మొత్తం కాళ్లకు పని లేకుంట ఇంట్ల గూసునె కాడికొచ్చింది యవ్వారం ఆ కథ ఏందో సూడుండ్రిగ మీరే.

Friday, February 12, 2016 - 13:10

కొందరు కళాకారులు ఎట్లుంటరంటే పాట కోసం పాణమిస్తరు.. భూకంపం వొచ్చి భూమి అదులుతున్న అకుంఠింత దీక్షతోని ఇయ్యాలనుకున్న పర్ఫామెన్స్ ఇచ్చిన శబ్బాష్ అనిపిచ్చుకుంటరు.. అగో గట్లనే జేశింది వొక పిల్ల.. స్టేజీ మీద ఈవెంట్ మేనేజరేనో లేకుంటే కార్యక్రమాన్కి హాజిరైన అతిథో తెల్వగని గని.. స్టేజీ మీదికెల్లి జారిపడ్డడు.. కిందవడి ఆయిన తిప్పల వడ్తుంటే.. ఆమె డ్యాన్స్ స్టెప్పులు ఎట్లేశిందో ఇగో ఇండ్ల...

Friday, February 12, 2016 - 13:04

ఆదిలాబాద్ జిల్లా అంటె ఏంది..? మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారును జెప్పుమంటే.. అది తెలంగాణకు కాశ్మీర్ అసొంటిది అంటడు.. ఇంకా జెప్పుమంటే.. మావా నాటే.. మావా రాజ్ అని కొమురంభీం నినాదం గూడ అచ్చుగుద్దినట్టు జెప్తడు.. ఇంకా ఏమన్న ఉన్నదాంటే..? గిరిజన గోండు గూడాలకు అంబులెన్సులు వోవుగా వట్టి హెలికాప్టర్లు వెట్టి వాళ్లను దావఖాండ్లకు దోల్కొస్తాని గూడ అంటడు.. మరి ఈ తెలంగాణ కాశ్మీర్ కథ చెప్పి...

Friday, February 12, 2016 - 13:02

తెలంగాణల తెల్గుదేశం పార్టీ పరిస్థితి ఏడికెళ్లి ఏడికొచ్చింది సూశిండ్రా..? గుడ్డి కంటె మెల్లెనన్న నయ్యం అనుకుంటరు.. కని ఆ పార్టీకి కనీసం గుడ్డి గూడ లేకుంటయ్యెతట్టున్నది ఇప్పటి పరిస్థితిని వట్టి సూస్తుంటె.. రెండువేల పద్నాలు కెళ్లి ఇప్పటిదాక.. తెల్గుదేశం పార్టీ ఎట్ల తెర్లయింది..? దానికి కర్మ కర్త క్రియ ఎవ్వలు అనేది వీడియోలో చూడండి.

Thursday, February 11, 2016 - 20:37

హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ గా బొంతు రాంమ్మోహన్ డిప్యూటీ మేయర్ గా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కలగనకపోయినా కలం మార్చేసిందా? తెలంగాణలో టిడిపి పరిస్థితి ఏడికెళ్లి... ఏడికొచ్చింది..! తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్ లో సీఎం కేసీఆర్ ఏం చెప్పారు? ఏం జరుగుతుంది? మొగులయ్య, మొగులవ్వ పేర్ల ముచ్చట ఏంటి? రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర.. ప్రభుత్వ...

Wednesday, February 10, 2016 - 20:08

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ దిక్కు మల్లా ఓట్ల గంట, కార్పొరేషన్ కాడికి ఉరకజూస్తున్న కారు, లవర్స్ డేకు తయారవుతున్న బజరంగ దళం, ఫిబ్రవరి 14 లవర్స్ అందరికీ అలర్ట్, ఆదిలాబాద్ లో ఆడిపాడుతున్న అడవి బిడ్డలు,తెల్లబట్టలు ఏసుకొని కులంలో కలిసిన పిల్లలు, సిలిగిరి వూరిని చీల్చి చెండాడిన ఏనుగు.. భయంతో పబ్లిక్ అంతా పరుగో పరుగు,బస్తాలు మోస్తున్న బాహుబలి...

Wednesday, February 10, 2016 - 11:26

భూమ్మీద నూకలు బాకుంటె సముద్రంల నూకేసిన బత్కి బట్ట కడుతరు కొందరు.. అగో అట్లనే బత్కిండు వో ఆర్మీ పోలీసు.. ఆయినను జూశ్నంక అందరు పర్షాన్ అయ్యిండ్రు.. గంత పెద్ద అపాయంల శిక్కుకొని గుడ ఇంకా బత్కి ఉన్నడా అని సూశినోల్లు నోరెల్ల వెడ్తున్నరు.. ఇంతకు ఏం ఆపదల శిక్కుకున్నడు.. ఎట్ల బత్కిండు ఏందనేది వీడియోలో సూడుండ్రి..

Wednesday, February 10, 2016 - 11:24

వలస బత్కులు అనేటియి ఉండొద్దు.. ఉన్న ఊళ్లె పని జూపెడ్తం.. కరువు కరాల నృత్యం జెయ్యని.. ఇంకేమన్న జెయ్యని.. జాన్తానై.. అని కాంగ్రేసోల్లు.. ఉపాధి హామీ పతకాన్ని.. పదేండ్ల కింద హంగూ హార్బాటాలతోని సుర్వు జేశిండ్రు. మరి అప్పుడు సుర్వైన పతకం ఎట్లున్నది.. మన బంగారి తెలంగాణ బాటసారి కేసీఆర్ సారు ఆధ్యర్యంల ఎట్ల నడుస్తున్నది ఏం కత అనేది వీడియో చూడండి..

Wednesday, February 10, 2016 - 11:20

సర్కారుకు కోపమొచ్చినా..? అంగన్ వాడీల మీదనే.. ఊరి సర్పంజికి కోపమొచ్చినా అంగన్ వాడీల మీదనే.. మరి అంగన్ వాడీలకు కష్టమొస్తె ఎవ్వలికి జెప్పుకోవాలె చెప్పుండ్రి..? అని అడ్గుతున్నరు అమ్మలక్కలంత.. మెల్లెగ మెల్లెగ రాష్ట్రంల అంగన్ వాడీలు అనెటోళ్లు లేకుంట జెయ్యాలె అని కుట్ర జేస్తున్నదట సర్కారు.. వాళ్లు లొల్లి వెడ్తున్నరు...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ వీరు కష్టపడ్డరు. మరి ఆ కష్టానికి...

Wednesday, February 10, 2016 - 11:16

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టైంది మా పని అంటున్నరు కాంగ్రెస్ పెద్ద ముత్తైదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సైకిల్ మావటి రమణ సారు.. ఎందుకంటె జీహెచ్ఎంసీ ఓట్లళ్ల ఓటర్లు మాకు ఓటేశ్నాగని.. ఈవీఎంలు అడ్డం బడ్డయ్ అని మొత్తుకుంటున్నరు.. మరి వాళ్ల మొత్తుకోళ్ల ఎంత న్యాయం ఉన్నది అనేది జూద్దాం..

Wednesday, February 10, 2016 - 11:16

ఎన్కటి రాజులు శ్రీక్రిష్ణదేవరాయలు కాడికెళ్లి సూడుండ్రి.. మన తెలంగాణ భూమిని ఏలిన నిజాం నవాబుల దాక.. వాళ్లకో సప్రేటు చరిత్ర ఉన్నది.. రాయలవారు.. తిరుమల ఎంకన్నసామికి చేతికి ఎంతొస్తె అంతే బహుమానాలు ఇచ్చిండు.. నిజాం రాజులు గూడ.. భద్రాచల రామయ్యకు బొచ్చెడు దానాలు జేశిండ్రు.. ఇప్పటిదాక మనం సద్వుకున్న చరిత్ర ఇది.. ఇగ ఇప్పుడు ఇండ్లకు ఇంకో చరిత్రొచ్చి జొర్రవోతున్నది.. సూడుండ్రి.

Wednesday, February 10, 2016 - 11:15

ఊరు సర్పంజి గుడ్సెలుండి..? ఊరిజనమంత పెద్దపెద్ద బంగ్లలళ్ల ఉంటే..? ఆ ఊరి పర్వేమన్న ఉంటదా..? సూడొచ్చినోళ్లు ఏమంటరు.. అవ్వో గా సర్పంజి ఇంకా గుడ్సెలనే ఉంటున్నడు ఏమాయే మంచిదొక ఇల్లుగట్టుకుంటే..? అని ఊరిపర్వుదీశిపోతరు.. ఆడ సర్పంజి ఇజ్జత్ వోకున్నా.? ఉరినే అంటరుగదా..? పలానా ఊర్లే సర్పంజికి ఇల్లే గతిలేదని.. అగో గసొంటి బద్నం గాకుంట మన ముఖ్యమంత్రి సారు ఒక పని జేస్తున్నడట..గదేందో వీడియో...

Tuesday, February 9, 2016 - 20:28

హైదరాబాద్ : సైకిల్ ను జాడిచ్చి తన్నిన మళ్లొక తమ్ముడు, బంగారు తెలంగాణకు షురూ అయిన బాటలు, జనం ఓట్లేశినా? గ్రేటర్ ఎన్నికల్లో మిషీన్లు గోల్ మాల్ జేశ్నయ్ అని ఈసీకి ఫిర్యాదు, కొత్తిల్లు గట్టుకుంటున్న సీఎం కేసీఆర్, దేవుండ్ల సేవల మునిగిన అపర భక్తి సర్కార్, దూపైతుందంటున్న ఎములాడ రాజన్న, అంగన్ వాడీలు లేకుండా చేయాలని సర్కార్ కుట్ర, ఉపాధి హామీ పథకంపై...

Pages

Don't Miss