మల్లన్న ముచ్చట్లు

Wednesday, June 29, 2016 - 20:41

అరుదైన రికార్డు సృష్టించిన హైదరబాద్ కుక్కలు.. లా 61,749 వేలమందిని పీకేసినియంట పిక్కలు ... కుక్కకాట్ల చేత పట్టాభిషేకం చేయాలంటున్న కుక్కకాటు బాధితులు..ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రధాన పాత్రధారులుగా బాబు, కేసీఆర్ గా బీటీటీ బ్యానర్ లో తెరకెక్కిన అద్భుత చిత్రం 'హైకోర్టుల ఆటాడుకుందాం' ఈ చిత్రంలో ఇలన్లు వుండరంట?!..అందరూ ఈరోలేనంట...నాయం చెప్పేటోల్లే జైలుకెలతారంట!...బల్దియా...

Tuesday, June 28, 2016 - 20:30

మల్కాపురంలో గుండు కిందనుండి దూరితే కడుపు నొప్పులు పోతున్నయంట...కడుపునొప్పులు తగ్గించుకోనీకి జనాలంతా నిజామాబాద్ జిల్లా మల్కాపురానిక లైను కట్టిండ్రు...గిర్ జాతి ఆవు మూత్రంలో బంగారం వున్నదంట..లవ్ డాల్ ను మనువు చేసుకున్న మంత్రి, 25 మంది సేతిలో గులాబీ పూలు పెట్టిన కేసీఆర్ సారు...మీ పిలకాయలను సర్కారు బడికి పంపమటున్న ఈటెల...మొక్కలు నాటిన బాలయ్య...50ఏళ్ళనుండి అంగీలేని నారాయణ.....

Monday, June 27, 2016 - 20:24

ముస్లింల రిజర్వేషన్ కోసం సీఎం కేసీఆర్ హామీల మీద హామీలు..ఉభయ రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నేత నారాయణ విసుర్లు..రాష్ట్రంలో దొంగతనాలు..పలు నేరాలు జరుగుతున్నా రాష్ట్ర హోం మంత్రి నాయినీ శాంతిమంత్రం జపిస్తున్నరు. లంచాల కోసం పోలీసోళ్ల కొట్లాట..కర్ణాటక ముఖ్యమంత్రి మెడకు మరో వివాదం చుట్టుకుంది..వర్షాల కోసం ఆడోళ్ల బతుకమ్మ ఆటలు...కట్కలతో పనిలేదు..చప్పట్లతో పని అయిపోతది..తెలుగు సినిమాలో మరో...

Monday, June 27, 2016 - 20:09

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి షాద్ నగర్ లో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీ మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ జర్నలిస్టు ఈ ప్రశ్న అడిగితే నేను గట్ల అనలేదు సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా మళ్లీ అదే హామీలు...

Saturday, June 25, 2016 - 21:08

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

Friday, June 24, 2016 - 22:26

నవ్వుకుంట గిచ్చిన్న తెలంగాణ సర్కార్..కిరాయిలు పెంచితీర్తం బరాబర్, టీఆర్ఎస్ కార్యకర్త అయితానన్న జానాలు.... ఇప్పుడదే పోస్టులున్నవన్న జనాలు, 
చంద్రబాబు మొగోడేఅంటున్న బంగి.. కర్రులేని నాగలితోటే నడిబజార్లకు, ఎంసెట్ కౌన్సిలింగ్ మీది తేనీగల దాడి... అచ్చినొళ్లకు తెలుస్తున్నది అవిటి వాడి, 
ముచ్చటపెట్టేందుకు వస్తున్న తాతతో మద్యం పానం ఘన స్వాగతం, తిరుమల కొండెక్కిన నాగుబాము...

Thursday, June 23, 2016 - 20:49

వాన కోసం బాలున్ని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు, బోనాల సందడి, తిరుమల కొండపై మద్యం బాటిళ్లు డిస్ట్రాయ్, చదువుపై వృద్ధుడి ఆసక్తి...పదో తరగతి చదువుతున్న వృద్ధుడు, కారుపై వాలిన తేనెటీగలు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Tuesday, June 21, 2016 - 20:10

రాష్ట్రపతి కాడికెళ్లి ప్రధానమంత్రి మీదికెళ్లి.. పట్నాలు పల్లెల దాక.. నడ్ములొంచె దినం జోర్దార్ అయ్యింది అదే యోగా..పేదల పక్షపాతి..? నిరుపేదల పెన్నిధి..అధికార పార్టీ ఎమ్మెల్యే అంటె అంత అలుసా నీకు..? ఆయ్..? గిసొంటోళ్లను మస్తుగ జూశిండ్రుగదా మీరు..? అగో ఇన్నారుల్లో.. పించిండ్లు రానోళ్లు మళ్ల దర్కాస్తు జేస్కుంటున్నరట..ఒక పెద్దమన్షి..? కొడ్కు పన్ను ఊగులాడుతున్నదని..? ఏం జేశిండో.....

Tuesday, June 21, 2016 - 20:09

ఏ ఏమనుకున్నవ్..? నేను ఎమ్మెల్యే సారు కుడి భుజాన్ని..? నన్నేగంతమాటంటవా..? నీ నౌకరి దీశేపిస్త ఏమనుకుంటున్నవో..? ఏం తమాష జేస్తున్నవా.? అధికార పార్టీ ఎమ్మెల్యే అంటె అంత అలుసా నీకు..? ఆయ్..? గిసొంటోళ్లను మస్తుగ జూశిండ్రుగదా మీరు..? ఇంకొకలు సీఎం కేసీఆర్ చుట్టాన్ని అంటూ పీఎస్ లోనే దౌర్జన్యం చేసిండు. ఆయన తీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Monday, June 20, 2016 - 20:31

వేములగట్టు..మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేపడితే వేములగట్టు మునిగిపోతుంది. ఈ విషయం తెలిసిన ప్రజలు కన్నీళ్లు కార్చుతున్నరు. ఇక్కడ ఎన్నో కులవృత్తుల వారున్నరు. ప్రాజెక్టు కడితే తమ బతుకులు ఛిద్రం అవుతాయని వారు పేర్కొంటున్నరు. వారి ఆవేదన..కన్నీళ్లు తెలుసుకొనేందుకు ఆ గ్రామానికి టెన్ టివి 'మల్లన్న' వెళ్లిండు. వారి బాధలను..ఆవేదనను తెలియచేసే ప్రయత్నం చేసిండు. తమ బతుకు నాశనం చేస్తున్న ఈ...

Monday, June 20, 2016 - 20:23

ప్రజలు..ఆ తరువాత ప్రభుత్వాలు..కానీ మల్లన్న సాగర్ పరిస్థితి చూస్తే ఇది నిజం కాదనిపిస్తోంది. మల్లన్న సాగర్ వద్దు అంటూ మొత్తుకుంటున్నా సర్కార్ లో చలనం లేదు. తాము ఇక్కడనే ఛస్తామని..చట్టాలు..జీవోలు వద్దు అంటూ గొంతెత్తి అరుస్తున్నరు. ఇంత జరుగుతున్న సర్కార్ కు చీమ కుట్టినట్లైనా లేదు. దీనితో వారంతా ఏకమయ్యారు. గత కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టిండ్రు. ఇలా చేపట్టి 19 రోజులవుతోంది....

Saturday, June 18, 2016 - 20:39

వంద ఉపన్యాసాలూ....వెయ్యి మాటలూ....కంటే ఒక పాట మనసుల్ని కదిలిస్తుంది...ఉద్యమాల బాట నడిపిస్తుంది...కొందరూ తమ భావాలను మాటలతో...చేష్టలతో...సైగలతో చెబుతారు..కానీ పాట రూపంలో చెప్పింది మాత్రం హృదయాలకు హత్తుకుపోతుంది కదా...అందుకే శ్రమను మరచిపోవటానికి శ్రామికులతంతా పాటల రూపంలో వ్యక్తపరుస్తూంటారు.....ప్రజా వాగ్గేయకారులు తమ భావాల్ని గేయాలు రాసి పాడుతూంటారు...ఉద్యమకారులు ఉద్యమంలో వుండే...

Friday, June 17, 2016 - 20:42

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఎర్రవల్లి గ్రామం..ఈ గ్రామం పేరు ఈ మధ్య తరచూ వినబడుతోంది...ఎందుకంటారా...మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ ప్రాంతంలోని దాదాపు 14 గ్రామాలు ముంపుకు గురవబోతున్నాయి. ఈ ముంపు గ్రామాలలో ఎర్రవెల్లి గ్రామం ఒకటి...ఈ గ్రామం ముంపుకు గురవుతుంది కాబట్టి ఖాళీ చేయించాలని సర్కారు యోచిస్తోంది....

Thursday, June 16, 2016 - 20:58

మదము.. మస్తీ.. బలుపు.. కొవ్వు.. కండకావరం అన్ని గల్పితె అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అన్నట్టు.. అగో పోలీసాయినను వట్కోని గంత గంత మాటలంటున్నవేందని అనిపిస్తున్నదా..? ఆయిన లళితకళలు జూపిస్తె మీరు నాకంటె ఎక్వంటరు.. సూస్తరా..? తయ్యారుండ్రిమరి తిట్టెతందుకు.. రెడీ వన్ టూ త్రీ..

పోరాని చోట్లకు పోతె.. రారాని నిందలొచ్చినట్టు.. ఒక పెద్దమన్షి ఉన్నతానుండక మా ఊర్లె బాతురూం...

Wednesday, June 15, 2016 - 21:36

కరుడు గట్టిన కాంగ్రెస్ లీడర్లు కారెక్కుతున్నరంటే మతులావేంది..? కాంగ్రెస్ పార్టీల పదవులన్ని ఏలి ఇప్పుడెందుకు ఆ పార్టీని పతనం జేస్తున్నరు..? బంగారు తెలంగాణల భాగమయ్యెతందుకా..? భవిష్యత్తును బాగుజేస్కునెతందుకా..? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన్సులళ్ల ముచ్చట ఇది.. ఇంతకు కేసీఆర్ మన్సుల ఏమున్నదనేది ఒక్కపారి మా మల్లన్న జెప్తడట ఇందాం..

ఇద్దుమున్నప్పుడు ఇద్దరు పెండ్లాలు.....

Tuesday, June 14, 2016 - 20:34

కళాకారులు కారు దిగుతుంటే ...లీడర్లు మాత్రం కార్లో కూసుంటున్రు..రైతు ఏడిసిన రాజ్యం..ఎద్దు ఏడిసిన వ్యవసాయం మంచిగుండదన్నట్టుగుంది తెలంగాణల రైతు సంగతి...లుంగీ కట్టి అరక దున్నిన మంత్రి పల్లె ...రక్షక భటుడే రాక్షసుడై ఖాకీ ఆకతాయిని గల్లా పట్టి నాలుగేసిన ఆడామే...సంగీతం సారు అమ్మాయిలతో అసభ్య ఏసాలు... పోలీసోల్లమని పైసలు గుంజుతున్న దొంగలు...గడ్డి మేస్కుంటాబోయి బాయిలో వడ్డ ఎద్దు......

Monday, June 13, 2016 - 20:41

కారు పార్టీలో కాళ్లారజాపుకుని కూర్చుంటున్న వలస నేతలు..బంగారు తెలంగాణలో భరోసాలు లేని రైతులు....'షీ 'టీమ్ ల్లాగా 'గాడ్' టీమ్ లను కూడా పెట్టాలంటున్న జనాలు...థంప్స్ అప్ సీసాలో సచ్చిపడిన పాము పిల్ల...బతికుండంగనే చావు చేసిన చుట్టాలు ...కల్తీ అయిన ఫ్రూటీ డబ్బా...గ్యాస్ నూని పట్టుకోని సెల్ టవర్ఎక్కిన అబ్బాయి...బతుకుండగానే సమాధిలో పడేసిన బంధువులు...ఇటువంటి గరం గరం వార్తలన్నీ మల్లన్న...

Saturday, June 11, 2016 - 21:37

సింగరేణి సంఘంల ఓట్ల పండుగనట.. సాతొళ్లను మళ్ల గెలిపిస్తే దండుగేనట, కాసాయి కస్టమర్లను నమ్మిన బ్యాంకొల్లు.. చిప్పవట్టుకోని అడుక్కొంటున్న సిబ్బంది, నోరుదెరిసిన పాలమూరు జిల్లా సెటర్లు...ఐదు దుకాన్లను ఆగంజేసిన దొంగలు, మఠాలను దర్శించుకుంటున్న చిరుతలు... తిరుమల కొండమీదభక్తుల తిప్పలు, కాస్లీమందు భూమిపాలుజేసిండ్రు.. అమ్ముకున్న పైకమొచ్చంటున్రు, పోలీసోళ్లతోని పోలగాడ్ల కొట్లాట......

Friday, June 10, 2016 - 21:14

ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన, హైదరాబాద్ లో సరువుకానున్న బోనాల సందడి, దేవుళ్లను ట్యాప్ చేస్తున్న మోత్కుపల్లి, కూలిపనికి పోయిన పరిటాల సునితమ్మ, సీఎం కేసీఆర్ కు గుడ్ న్యూస్, సర్కార్ బడులకు ఊపిరి.... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Wednesday, June 8, 2016 - 22:19

సర్కారుకు ఇప్పటిసంది ఇక కోదండమే... గులాబీ టైరుకు జేఏసీ ముల్లు, నడిసంద్రంలో నల్గొండ కాంగ్రెస్..రెడ్ల కోటలకు ఎడ్లు దోలిన టీఆర్ ఎస్, కేరళ మీదికెళ్లి ఉరుకొస్తున్న వానలు... నాగండ్లు ఇంక అందుకోవాలే రైతన్నలు, పోలీసోలను సుడివెట్టిన పిల్లి.. జీపుల జొర్రి ఎల్లదాయే దీంతల్లి, ఆర్ ఎస్ ఎస్ అవతారంల స్వామినారాయణ... సూరత్ కాడా సువ్వర్ పనిజేసిన కంత్రీలు, సూర్యభగవానుని మీద పోలీసు కేసు......

Tuesday, June 7, 2016 - 22:03

ముందుగాళ్ల ముస్లిం అన్నలకు తమ్ముండ్లకు.. చెల్లెండ్లకు అక్కలకు అందరికి మీ మల్లన్న ముచ్చట్ల తర్పున రంజాన్ పర్వదిన ప్రారంభం శుభాంకాంక్షలు.. ఇగ రంజాన్ మాసమొచ్చిందంటే..? ఎంత జోర్దారుంటది.. నెలరోజులు పండుగ వాసన గుప్పునొస్తది.. నియమ నిష్టలతోని జర్పుకునే ఈ పండుగను ఇంక జర్రంత మంచిగ జర్పుకోవాలని ఒక చిన్నపాట..
పవిత్రమైన రంజానుకు రికార్డింగ్ డ్యాన్సుల కంపు 
...

Monday, June 6, 2016 - 22:12

కోపం మీదకి వచ్చిన కోదండ రామ్ సారూ.. ఆంద్రాల ఉదయించిన కిరణాలూ కిరణం, చెప్పుల గుర్తు యాదికి తెస్తే రణం
సంగారెడ్డి జైలు ను సర్దిపిచ్చిన నాయిని సారు. పైసల కట్టను దొంగతనం చేసిన కోతి.. నిజామాబాద్ ఆసుపత్రికి రోగాలు .. ఈ ముచ్చట్లు ఏంటో  గీ వీడియో ల సుడుండ్రీ

Friday, June 3, 2016 - 20:41

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అందరికంటే మంచిగా హిజ్రాలు సంబురాలు చేస్కున్నరు. తీన్మార్ డాన్సులతో తెలంగాణ పండుగను దుమ్ములేపినరు. నేర్చుకోవాలని ఆశ వుండాలి గానీ వయసుతోని సంబందమేముంది అని నిరూపించనీకి రెడీగా వుంది..కరీంనగ్ జిల్లాలోని కోరుట్ల సత్తెమ్మ నిరూపించినాది. కొడుకులు అమెరికాలో వున్న తన పిల్లలతో మాట్లాడటానికి నేర్చుకుని ఇప్పుడు కంప్యూటర్ లో అన్ని...

Tuesday, May 31, 2016 - 20:58

ఈ రోజు మల్లన్న మస్తు మస్తు ముచట్లు పట్టుకొచ్చిండు. మన తెలంగాణ సర్కారు కొల్వెక్కి రెండేండ్లైంది అనుకున్నంగదా..? మన మోడీ సారు గూడ రెండేండ్లైంది కొల్వులకెక్కి.. తెలంగాణ ముఖ్యమంత్రి సారు గుత్తకు వట్టినట్టే నర్సన్నపేట, ఎర్రవల్లిని మోడీ సారు గూడ ఒక ఊరును గుత్తకు వట్టిండు అటు వారణాసి దిక్కు.. మరి సారు ఎంత గొప్పగ తీర్చిదిద్దిండో వీడియో లో సూద్దాం పాండ్రి..

అటెంక గీ ముచట గూడా...

Tuesday, May 31, 2016 - 10:32

పెదబాబు జోకుడు సభ వొడిసిపోయింది... చినబాబును లైన్లకుదెచ్చుడే మిగిలింది, సువార్త సభలకు సిద్ధమవుతున్న ఎన్ డిఎ.. ఏం బొడిసిండ్రని తిడుతున్న యుపిఎ, నాలుగో సింహాల భరతంపడుతున్న డీజీపీ... ఇప్పడ్సంది పోలీసొళ్లు పెంచుకోవద్దు బీపీ, మైనర్ కొడుకు బండి నడిపితే అయ్యకు శిక్ష, ఆవిరైపోయిన రాయల్ ఛాలెంజ్... సన్ రైజింగ్ తోని కూసిన పుంజు, కొబ్బరిమట్టమీద కూసున్న సంపు.. సోషల్ నెట్ వర్కంతంట ఇదే...

Saturday, May 28, 2016 - 20:27

ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లె పదాలతో కూడిన పాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా, ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు, స్థితిగతులు, వారి సున్నితమైన మనస్సులు,...

Friday, May 27, 2016 - 21:18

ఎండలు సేయంగ పంటలు ఎండినాయ్, బోర్లు ఎండినాయ్, బావులు ఎండినాయ్.. సర్కారు అదుకున్తదని సాకులు సెప్పలే ఆ రైతు .. జెర్ర బుర్ర వెట్టి ఆలోసించి  సూర్యుని  మీద, కరువు మీద గెల్సిండు  రైతు.. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఉండే గీ  ముచ్చటేందో మీరే సుడుoడ్రి  

Pages

Don't Miss