మల్లన్న ముచ్చట్లు

Tuesday, June 7, 2016 - 22:03

ముందుగాళ్ల ముస్లిం అన్నలకు తమ్ముండ్లకు.. చెల్లెండ్లకు అక్కలకు అందరికి మీ మల్లన్న ముచ్చట్ల తర్పున రంజాన్ పర్వదిన ప్రారంభం శుభాంకాంక్షలు.. ఇగ రంజాన్ మాసమొచ్చిందంటే..? ఎంత జోర్దారుంటది.. నెలరోజులు పండుగ వాసన గుప్పునొస్తది.. నియమ నిష్టలతోని జర్పుకునే ఈ పండుగను ఇంక జర్రంత మంచిగ జర్పుకోవాలని ఒక చిన్నపాట..
పవిత్రమైన రంజానుకు రికార్డింగ్ డ్యాన్సుల కంపు 
...

Monday, June 6, 2016 - 22:12

కోపం మీదకి వచ్చిన కోదండ రామ్ సారూ.. ఆంద్రాల ఉదయించిన కిరణాలూ కిరణం, చెప్పుల గుర్తు యాదికి తెస్తే రణం
సంగారెడ్డి జైలు ను సర్దిపిచ్చిన నాయిని సారు. పైసల కట్టను దొంగతనం చేసిన కోతి.. నిజామాబాద్ ఆసుపత్రికి రోగాలు .. ఈ ముచ్చట్లు ఏంటో  గీ వీడియో ల సుడుండ్రీ

Friday, June 3, 2016 - 20:41

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అందరికంటే మంచిగా హిజ్రాలు సంబురాలు చేస్కున్నరు. తీన్మార్ డాన్సులతో తెలంగాణ పండుగను దుమ్ములేపినరు. నేర్చుకోవాలని ఆశ వుండాలి గానీ వయసుతోని సంబందమేముంది అని నిరూపించనీకి రెడీగా వుంది..కరీంనగ్ జిల్లాలోని కోరుట్ల సత్తెమ్మ నిరూపించినాది. కొడుకులు అమెరికాలో వున్న తన పిల్లలతో మాట్లాడటానికి నేర్చుకుని ఇప్పుడు కంప్యూటర్ లో అన్ని...

Tuesday, May 31, 2016 - 20:58

ఈ రోజు మల్లన్న మస్తు మస్తు ముచట్లు పట్టుకొచ్చిండు. మన తెలంగాణ సర్కారు కొల్వెక్కి రెండేండ్లైంది అనుకున్నంగదా..? మన మోడీ సారు గూడ రెండేండ్లైంది కొల్వులకెక్కి.. తెలంగాణ ముఖ్యమంత్రి సారు గుత్తకు వట్టినట్టే నర్సన్నపేట, ఎర్రవల్లిని మోడీ సారు గూడ ఒక ఊరును గుత్తకు వట్టిండు అటు వారణాసి దిక్కు.. మరి సారు ఎంత గొప్పగ తీర్చిదిద్దిండో వీడియో లో సూద్దాం పాండ్రి..

అటెంక గీ ముచట గూడా...

Tuesday, May 31, 2016 - 10:32

పెదబాబు జోకుడు సభ వొడిసిపోయింది... చినబాబును లైన్లకుదెచ్చుడే మిగిలింది, సువార్త సభలకు సిద్ధమవుతున్న ఎన్ డిఎ.. ఏం బొడిసిండ్రని తిడుతున్న యుపిఎ, నాలుగో సింహాల భరతంపడుతున్న డీజీపీ... ఇప్పడ్సంది పోలీసొళ్లు పెంచుకోవద్దు బీపీ, మైనర్ కొడుకు బండి నడిపితే అయ్యకు శిక్ష, ఆవిరైపోయిన రాయల్ ఛాలెంజ్... సన్ రైజింగ్ తోని కూసిన పుంజు, కొబ్బరిమట్టమీద కూసున్న సంపు.. సోషల్ నెట్ వర్కంతంట ఇదే...

Saturday, May 28, 2016 - 20:27

ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లె పదాలతో కూడిన పాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా, ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు, స్థితిగతులు, వారి సున్నితమైన మనస్సులు,...

Friday, May 27, 2016 - 21:18

ఎండలు సేయంగ పంటలు ఎండినాయ్, బోర్లు ఎండినాయ్, బావులు ఎండినాయ్.. సర్కారు అదుకున్తదని సాకులు సెప్పలే ఆ రైతు .. జెర్ర బుర్ర వెట్టి ఆలోసించి  సూర్యుని  మీద, కరువు మీద గెల్సిండు  రైతు.. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు ఉండే గీ  ముచ్చటేందో మీరే సుడుoడ్రి  

Friday, May 27, 2016 - 20:52

తిరుపతి గుంట కింద తిష్టేసిన పసుపు దళం.. బాబుగారిని ఎక్కిచ్చుడే ఇక అందలం, సచివాలయం మీదికి మర్రిన ముచ్చట... కూలగొట్టి కట్టేపడేస్తరట అచట, ఎరుగవోయి ఎల్లెలుకలవడ్డ ఎంకట్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీల తగ్గుకుంటొస్తున్న వన్నె, సమగ్ర సర్వే కాయిదాలకు మహర్దశ.. జోకేందుకొస్తున్న లిమ్కా బుక్కోళ్లు, లిఫ్టులో ఇరికిన హీరో, దర్శకుడు.. సల్లచముటలువట్టిచ్చిన అప్పన్న, దొంగను బరవత్తల నిలవెట్టింది...

Thursday, May 26, 2016 - 21:10

రెండేండ్ల బీజేపీ పాలనకు పండుగనట... దేశమంతటదిరిగి ధూం ధాం జేస్తరట, నారాయణఖేడ్ ఆబ్కారోళ్ల ఆటాపాటా...నకిలీ మద్యం ఏరులైపారుతున్న పట్టదట, తాగుబోతు డ్రైవర్లకు అరుదైన గౌరవం... కంప్యూటర్లకెక్కిస్తరట ఆళ్ల చరిత్ర, మూడు పాములు మింగినా నిండలే... సర్కారోల్లు గుర్తించి పించినియ్యాలే.. 
బతుకుమీద ఆశ దుంకకపోతే ఘోస.. ఆడనేవుంటే సచ్చుడు గ్యారంటీ.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో...

Wednesday, May 25, 2016 - 21:00

సర్కార్ ఇజ్జత్ దీస్తున్న పోలీస్ కానిస్టేబుల్....ఆటోవాల తెరువువొయ్యి పరువుదీసుకున్న ఖాకిక్కులు, నోరుదెరిస్తే పేగులు లెక్కవెడ్తుతున్న దొంగలు... ముంబై ఓటళ్లపోంట గల్ల పెట్టెలు లూటి, తుమ్మకంపమీదికిజేరిన భక్తి.. దేవుని కఠాక్షం కోసం కఠోర చేతలు, సదువు సారెడు పనితనం చేతడు.. సోలార్ కారుకు పాణం బోసిన పోరడు, తెలుగు రాష్ట్రాలల దంచికొడుతున్న ఎండలు... పాల్వంచ కాడా పడిచస్తున్న జీకులు,...

Tuesday, May 24, 2016 - 21:34

తల్లిడిల్లుతున్న మల్లన్న సాగర్ బాధితులు..సర్కారుతోని కొట్లాడకుంటే లీడర్లే నిందితులు, చేతలు చెంబునిండా కోతలు కొట్టం నిండా.... సర్కారు పని తనానికి ముచ్చుతునకలు, యాదాద్రి జిల్లాను ఖాతాలేసుకునే ఉపాయం.. అసలు కొత్తజిల్లానే చేయకపోతే అపాయం, యాడాది మాశ్కానికి హాజిరేసిన కేసీఆర్... పైసలు ఖర్సైన పరువు కోసం పాటుబడే బాస్, మహేష్ బాబు గుత్తవట్న ఊరిజనం గోసలు..
సీన్మల జేసినట్టు...

Monday, May 23, 2016 - 21:25

దూపైతుందంటున్న ఆర్మూరు జనం.. వస్తపోత ఎక్కిరిస్తున్న నీళ్ల పథకం పల్కా, దత్తన్న బట్టలమీద మనసువడ్డ నర్సన్న.. దీపాలుముట్టిచ్చెకాడ జర జాగ్రత్తగుండన్నో, కరీంనగర్ పట్నంలో లండన్ లడాయి.. ముఖ్యమంత్రిగారిదేనట అసలు బడాయి, దాంట్ల దమ్ముందా అంటున్న కారు క్యాడర్... ఇడిసిపెడితే చూపెడతముంటున్న పువ్వు లీడరు, ఆరోపారి ఇమానం దిన్న తమిళనాడు అమ్మ.. వంగి వంగీ గూనోలైతున్న భక్తులు, పుట్టినపిలగానికి...

Saturday, May 21, 2016 - 21:45

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు  వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు,...

Thursday, May 19, 2016 - 21:02

ఐదు రాష్ట్రాల ఓట్లు గూడ ఒడ్సిపోయినయ్.. కండ్లళ్ల వత్తులేస్కోని సూశిండ్రు కొంతమందైతె ఎవ్వలు గెలుస్తరో ఎవ్వలు గెలుస్తరో అని.. ఆఖరికి దేలింది ఏందంటే..? సర్వేలు ఓడిపోయినయ్.. ఓట్లేశిన జనం గెల్చిండ్రు గంతే.. మరి ఏఏ రాష్ట్రంల ఎవ్వలి కిస్మత్ ఎట్లొచ్చింది అనేది మొత్తం తర్వాయి వట్టి చెప్పుకొస్త తయ్యారున్నట్టేగదా..? పాండ్రిగ..
పాలేరుల పెద్ద పాలేరుకే పట్టం గట్టిండ్రు జనం....

Wednesday, May 18, 2016 - 20:38

ఎన్నికల ఫలితాలు..
పదో తర్గతి పరీక్షలు రాశి.. రిజల్ట్ కోసం ఎదురు సూశె పోరగాళ్లకు ఎంత టెన్షన్ ఉంటదో.. గురువారం పొద్దుగాళ్ల ఇడ్దలయ్యె ఓట్ల ఫలితాల మీద గూడ అంతో దగడుతోని ఉన్నరు పోటీల నిలవడ్డోళ్లు.. ఐదు రాష్ట్రాల ఓట్ల పెట్టెలతోపాటే.. మన పాలేరు ఓట్ల పెట్టెలు గూడ ఈ గురువారంనాడే ఇప్పుతున్నరుగావట్టి ఇగ తక్వ టెన్షనున్నదా ఒకలొకలికి..

ఉన్న కరెంటిని...

Tuesday, May 17, 2016 - 20:38

ఆగమైతున్న హరికథ, బుర్రకథలు, కళాకారులను ఆగం చేసిన సిన్మాలు. మల్లన్న సాగర్ మట్టి బిడ్డల కోత కోత. కేసీఆర్ చెప్పింది ఇది గాదొస.ఇంట్ల 20 ఫీట్ల బొక్క తవ్విన తల్లీ బిడ్డలు,కాళీమాతకు బీర్లతో ధూపదీపాలు, బోరులోకి జారిపడ్డ ఎంపీ పూనమ్ మేడమ్...అడ్డుకోబోయి అందులోనే బడ్డ ఆడోల్లు. పాలేరులో ఉప ఎన్నికల్లో ఓట్లు ఈవీఎంలో వచ్చిపడ్డయ్.మళ్లీ వచ్చే ఓట్ల దాకా ప్రజలకు పట్టించుకునే పనే లేదు. మనదేశంలో...

Friday, May 13, 2016 - 20:10

హైదరాబాద్ : చెవి కమ్మలదాకా చేరిన అమ్మల కథ.. ఈ ముచ్చట రాస్తే రామాయణమే కదా, సర్కారు దావఖానాలు బాగుపడాలనట...ప్రైవేటు ఆసుపత్రుల ఓపెనింగ్ లకు పోయేటోళ్ల మాట, దారం తెగిన సిరిసిల్ల నేతన్న బతుకు..టెక్స్ టైల్ మగ్గాల మీద అతకని చితుకు, ఓపెన్ కాస్ట్ వద్దంటున్న ప్రజలు...తోడుగ కొట్లాడుతమంటున్న ప్రతిపక్షాలు, అన్నం పెట్టిన...

Thursday, May 12, 2016 - 20:12

పాలేరు ఉపఎన్నికల పంచాది ఇంకా రంజుకొచ్చిందుల్లా.. ఇంకో నాల్గైదు రోజులున్నయ్ ఓట్లు అనంగ.. కత్తులు ఆకురాయి వెట్టి నూరుకుంటున్నరు టీఆర్ఎస్ పార్టోల్లు.. కాంగ్రెస్ పార్టోల్లు.. మాటలు మాత్రం పెద్దపెద్దయ్.. పొడ్గుపొడ్గుయి మాట్లాడుకుంటున్నరు.. పది మందికి వొయ్యవల్సిన సల్లవొట్టు.. ఇర్వైమందికి వొయ్యాల్నంటే ఏం జెయ్యాలే..? అదే సల్లల ఇన్ని నీళ్లువోశి కల్పిపొయ్యాలే అంతేనా..? అగో టీఆర్ఎస్...

Wednesday, May 11, 2016 - 21:05

సిరిసిల్ల నియోజకవర్గంల బాత్ రూం బాధలు... మంత్రి మాటలకు ఘోరిగట్టిన అధికారులు, పాలమూరి మీద వానదేవుడి గావురం... వద్దంటే వచ్చిపడుతున్న గాలిదుమారం, వరకట్న వేధింపులజిక్కిన కళ్యాణలక్ష్మీ... పథకం పరువుదీస్తున్న ఆఫీసర్లు -దొంగలు, మనోజ్ గా మారిపోయిన మానసనే పిల్ల.. పదకొండేండ్ల తర్వాత గుర్తువట్టిన అవ్వఅయ్యా, 70 ఏండ్లకు బిడ్డనుగన్న ముసలామె...అమ్మైనంకనే మురుస్తున్నదామే, సర్కార్ దావఖాన్ల...

Tuesday, May 10, 2016 - 20:12

ఆర్డీఎస్ కాడ రాజుకున్న నీళ్ల రగడ... కుర్చీ వేసి సీఎం ను పిలుస్తున్న రైతులు, రాజకీయాలనుండి తప్పుకుంటవా ఉత్తమ్... మీ అయ్యకు సమాధానం చెప్తారా బచ్చా, ఉత్తరాఖండ్ రాజకీయం ఆఖరి అంకం..సుప్రీం కోర్టుకు చేరిన బలపరీక్ష ఫలితం, ఆలోచన లేని పని చేసిన ఆంధ్ర మేధావి...ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒప్పుడు పాసు, హైదరాబాద్ రోడ్ల మీదకొచ్చిన యమధర్మరాజు..ముందుగాల దులపాలే సర్కారోళ్లు బూజు, సజీవ పరీక్షకు...

Monday, May 9, 2016 - 20:07

ఏశకాళ్లంత.. ఇగ పాలేరుల దిగిండ్రు.. ఓ ఒక్క హామీగాదు.. ఒక్క నాట్కం గాదు.. ఒక్కలెక్కగాదు.. అన్ని పార్టీలు.. పబ్లీకు ఓట్లకోసం బిచ్చగాళ్లలెక్క దిర్గుతున్న ఇదానం జూస్తుంటే.. పాలేరు ఓటర్లు పక్కున నవ్వుతున్నయ్.. వాస్తవానికి ఆ పాలేరు ఓట్లు గూడ.. అన్ని పార్టీలకు ఇజ్జత్ కే సవాల్ తయ్యారైనయనుకో.. ఆ ఇజ్జత్ నిలవెట్టుకునెతందుకు తక్వ తన్లాటనా..? తక్వ కథ..?

తానొకటి దలిస్తె...

Sunday, May 8, 2016 - 22:16

మల్లన్న ముచ్చట్లు : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు...

Friday, May 6, 2016 - 21:30

శాపల శెర్వుకు సెక్యూరిటీ, కులం పేరుతోని గుడి కాడ అవుమానం, లాఠీకి పని జెప్పిన సర్కిల్ ఇన్స్ పెక్టర్, తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు, ఆడామె బట్టలు ఇడ్పిచ్చిన సన్నాసి....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

Friday, May 6, 2016 - 10:59

హైద్రావాద్ ముచ్చటొక్కటున్నది. ఈ పట్నం తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లమారిపోయింది శాంతి భత్రల ముచ్చట్ల అంటే..? పంచాయితీలు..జగుడాలు.. కొట్లాటలు ఏం లేవు.. జనం సాధుజీవులై జీవిస్తున్నరని మన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సారు ఎప్పుడు చెప్తాఉంటడు.. వాస్తవానికి గూడ జర్రంత మారినట్టే అనిపిస్తున్నది అనుకునెయాళ్లకు నర్సన్న ఆశయానికి తూట్లు వొడ్సినంత పనైంది. ఓ ఎనిమిది మంది ఇద్దరిపై...

Thursday, May 5, 2016 - 21:30

మల్లన్నజెప్పిండట బొమ్మల కథలు.. మస్తు పవర్ ఫులట కార్టూన్ గీతలు, హైదరాబాదుకొస్తలేరంట పారీను తాగువోతులు..కేసీఆర్ చేస్తడ మందు సవలతులు, అన్నముగూర్తానికి కాలే.. సత్తెన్న పెళ్లి.. అన్నవరం గుడిల పెళ్లి పత్రిక లొల్లి, కరీంనగర్లవెరిగిన అవినీతి పరులు..లంచం మరిగిన సర్కారు అధికారులు, బుడ్డ పోరనికి ముప్పైరెండు ఏళ్లు... ఎట్లున్నయోజూడు చేతులు-కాళ్లు, తెలుగు రాష్ట్రాలల గాలి దుమారం.....

Wednesday, May 4, 2016 - 21:53

జూన్ రెండు నాడు సంపూర్ణ తెలంగాణ...జెండెగిరేసి దండబెట్టవోతున్న సీఎం, మూడు వేల సర్కారు బళ్లకు తాళాలు.. కేజీ టు పీజీ చదువుకు ఇవేనా మేళాలు, దిష్టిగుమ్మడికాయచేతులవట్టిన సునీతక్క.. నిప్పు కిందవడేసి.. కాయవల్గొట్టిన వనిత.. చదువులతల్లికి చదివేరాదంటున్న పెద్దమనిషి..స్మృతిఇరానీ పట్టా కాయిదాలకోసం పట్టు, పాల్వంచ మండలంల నీళ్లు కరువు.. మురుగునీళ్లే అక్కడి జనంకు ఆదెరువు, కరీంనగర్ బాయిల...

Tuesday, May 3, 2016 - 21:44

మెదక్ జిల్లాల మల్లన్నసాగర్ ముంపు...జనాలకు తప్పదంట ఇంకోదగ్గరికి జంపు, లొల్లివెట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు... ఒక్కొక్కళ్లకు ఉన్నదంట మస్తు కుళ్లు, పొగడ్తలు నేర్సుకుంటున్న పొంగులేటి.. రారు శ్రీనువాసురెడ్డికి ఎవ్వరు సాటి, హైదరాబాదుల పేరుకుంది అడ్డగోలు సెత్త.. మున్సిపాలిటోళ్లకు ఇదేమన్న కొత్త, ఎములాడ గుడిల పిలగాడు మాయం.. అయ్యవ్వలకు ఐతుంది మస్తు భయం.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను...

Pages

Don't Miss