మల్లన్న ముచ్చట్లు

Friday, January 29, 2016 - 20:30

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. మరి గ్రేటర్ లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నరు ? నేతలు ఎలాంటి హామీలు గుప్పిస్తున్నరు ? సర్కార్ చెప్పిన హామీలు అమలయ్యాయా ? అనేది తెలుసుకోవాలని 'మల్లన్న' గ్రేటర్ లో పర్యటించాడు. రాంగోపాల్ పేట డివిజన్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అలాగే కస్తూర్బానగర్ లో కూడా పర్యటించాడు. మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు...

Thursday, January 28, 2016 - 20:31

నగరంలో మాజీ మేయర్ గా పనిచేసిన బండా కార్తికరెడ్డి హాయాంలో నిర్మించిన ఇళ్లను 'మల్లన్న' పరిశీలించాడు. ఆ ఇంట్లో ఉన్న వారితో ముచ్చటించాడు. తమకు నీళ్లు సరిగ్గా రావడం లేదని వాపోయారు. వచ్చిన నీళ్లు కూడా మురికిగా ఉంటున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది. బంగాళా మీద కొంతమంది గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని వారు మల్లన్నతో...

Thursday, January 28, 2016 - 20:28

తమ హాయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మాజీ మేయర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న బండా కార్తిక రెడ్డి పేర్కొన్నారు. తార్నాక డివిజన్ లో పర్యటించిన 'మల్లన్న' ఆమెతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బండ కార్తిక రెడ్డి తెలియచేశారు. ఎవరు ఏమి చేసిండ్రో ఓటర్ గమనిస్తున్నరని, పోస్టర్ లో పబ్లిషిటీ తప్ప ఏమి...

Thursday, January 28, 2016 - 20:27

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. ప్రధాన పార్టీల మధ్య మాటలు తూటలు పేలుతున్నయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నరు. హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. ఈ తరుణంలో ప్రజలు ఏమి అనుకుంటున్నరో..నేతల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' నగరంలోని పలు డివిజన్ లో పర్యటించి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. తార్నాకా డివిజన్ లో పర్యటించి సమస్యలు..నేతల అభిప్రాయాలు...

Wednesday, January 27, 2016 - 20:30

కొత్తపేట డివిజన్ లోని ఎస్సీ కాలనీలో సమస్యలను 'మల్లన్న'తో స్థానికులు ఏకరువు పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కాలనీ వాసుల అగచాట్లు...నేతల మాటలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' నగరంలోని గల్లీలో తిరుగుతున్నడు. అందులో భాగంగా కొత్తపేట విలేజ్ ఎస్సీ కాలనీలో తిరిగిండు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ సమస్యలున్నాయన్నారు. 20 ఏండ్ల సందటి నుండి రోడ్డు గిలాగే ఉందని, వస్తున్నరు..పోతున్నరు తప్పించి...

Wednesday, January 27, 2016 - 20:25

గ్రేటర్ ఎలక్షన్స్ పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. పలు డివిజన్ లలో పార్టీల తరపున నిలబడిన అభ్యర్థులు హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. పలు డివిజన్ లలో ప్రజల సమస్యలు..గాథలు..నేతల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' గల్లీల్లో తిరుగుతున్నడు. ఈ సందర్భంగా వనస్థలిపురం..కొత్తపేట డివిజన్ లలో 'మల్లన్న' పర్యటించాడు. మరి ప్రజల గాథలు..నేతలు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్...

Tuesday, January 26, 2016 - 20:55

రామాంతాపూర్ లో పర్యటించిన 'మల్లన్న'కు కొంతమంది విద్యార్థులు కళ్ల పడ్డారు. వీరంతా మేకల అనాల హనుమంత రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నరు. ప్రచారం నిర్వహించే వారికి భోజన సదుపాయం నిర్వహించారు. అక్కడకు వెళ్లిన 'మల్లన్న' వారితో ముచ్చట్లు కలిపాడు. మరి నేతలు..విద్యార్థులు ఏమన్నరో వీడియోలో చూడండి..

Tuesday, January 26, 2016 - 20:36

రామంతాపూర్ డివిజన్ లో 'మల్లన్న' పర్యటించిండు. అక్కడున్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయిండు. బాధలు..గోసను చెప్పుకుంటున్న వారిని 'మల్లన్న' ఓదార్చిండు. తనకు ఫించన్ వస్తలేదనని..తనకు కొడుకులు..ఇళ్లు ఉందని ఫించన్ ఇవ్వరంట అని ఓ వృద్ఢుడు మల్లన్నతో కు చెప్పుకుంటూ వాపోయిండు. అంటే రోడ్డుపై ఉండాలా అని ప్రశ్నించాడు. మరొక గల్లిలోకి వెళ్లిన మల్లన్నకు వాస్తవ పరిస్థితి ఎలా ఉందో స్థానికులు...

Tuesday, January 26, 2016 - 20:32

గ్రేటర్ ఎలక్షన్స్ పోలింగ్ కు తేదీ దగ్గర పడుతోంది. నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నరు. ప్రతి డివిజన్ లో పర్యటిస్తూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. మరి ప్రజల పరిస్థితి ఎలా ఉంది ? వారి జీవన స్థితి ఎలా ఉంది ? అసలు ప్రజలు ఏమనుకుంటున్నరు అనేది తెలుసుకోవడానికి 'మల్లన్న' గ్రేటర్ పరిధిలో పర్యటిస్తున్నడు. ఎన్నికలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేసిండు. రామాంతాపూర్...

Monday, January 25, 2016 - 21:00

స్వచ్ఛ హైదరాబాద్..గ్రీన్ హైదరాబాద్..హైదరాబాద్ డల్లాస్...అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటున్న నాయకుల మాటలు నిజమేనా ? కాదా ? అని 'మల్లన్న' చూపెట్టిండు. ఒక్కసారి పార్సిగుట్ట వైపు చూడండి అంటున్నాడు. రాంనగర్..పార్సిగుట్టను కలిపే ప్రధాన రహదారిపై భారీగా చెత్తా చెదారం పేరుకపోయింది. అక్కడే పని చేస్తున్న వారితో..రోడ్లపై వెళుతున్న వారిపై మల్లన్న ముచ్చటించిండు. అంతేకాదు...

Monday, January 25, 2016 - 20:53

ఏంటీ పిల్లలకు ఓటు గురించి 'మల్లన్న' చెప్పుడేంది అని పరేషాన్ అవుతున్నరా ? వారిని ఓటు వేయాలని మల్లన్న చెప్పలే. కొద్ది రోజల్లో గ్రేటర్ ఎలచ్చన్లు రాబోతున్నయి కదా. అందుకే 'మల్లన్న' గల్లీలో తిరుగుతున్నడు. ఓటు గురించి..ప్రజలు ఏం అనుకుంటున్నరో ఆరా తీస్తుండు. అందుకనే వారాసిగూడలో మల్లన్న తిరిగిండు. అక్కడనే ఉన్న ఓ స్కూల్ కు మల్లన్న వెళ్లిండు. ఓటు వేయాలని..ఓటును అమ్ముకోవద్దని అమ్మా.....

Monday, January 25, 2016 - 20:48

గ్రేటర్ ఎన్నికలు..అభ్యర్థుల కోసం కళాకారులు పాటలు పాడుతున్నరు. పొట్ట కూటి కోసం వీరు ఎక్కడి నుండో నగరానికి వచ్చిండ్రు..వీరంతా తెలంగాణ ఉద్యమంలో కాళ్లకు గజ్జెలు కట్టి ఎగిరినోళ్లు. ఇవాళ..రేపు..పని లేక అవస్థలు పడుతున్నోళ్లు. సర్కార్ గుర్తించక ఇబ్బందులు పడుతున్నోళ్లు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుండి కళాకారులు పాటలు పాడుతున్నరు. పాటలను గళం విప్పుతున్నరు. మరి వీళ్లంతా ఎందుకు...

Monday, January 25, 2016 - 20:43

గ్రేటర్ ఎలచ్చనలలో నగరంలోని గల్లీలో 'మల్లన్న' పర్యటించాడు. ఎన్నికలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేసిండు. ఇందులో భాగంగా బౌద్ధనగర్ లో పర్యటించాడు. అభ్యర్థుల కోసం పాటలు పాడటానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల అవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి పిల్లలకు వివరించాడు. అలాగే ఓటు హక్కు గురించి మహిళలకు తెలియచేశారు....

Sunday, January 24, 2016 - 21:36

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మల్లన్న పర్యటించి ఎన్నికలపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గోషామహల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మడ్ ఫోర్డు ప్రాంతంలోని పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి… అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలను మీడియాతో వివరిస్తూ.. వాపోయారు....

Friday, January 22, 2016 - 20:33

రంజు మీదికొచ్చిన జీహెచ్ ఎంసీ ఎన్నికలు, రంగులు మారుస్తున్న నేతలు, సర్కార్ దావఖానలో మంత్రి కామినేని మోకాలుకు ఆపరేషన్, గోపాల మిత్రుల గోసకు 20 దినాలు, కర్నూలులో తెలివి తక్కువ దొంగలు, కూతురిని కడప కోర్టులో ఇడిసిపెట్టి పోయిన తల్లిదండ్రులు, ఉజ్జయిని జాతర... ఆవులతోటి తొక్కించుకునే భక్తులు...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Friday, January 22, 2016 - 08:19

తెలంగాణ ప్రజానికమా..? మీకు ఏ కష్టమొచ్చినా..? ఎంత ఆపతొచ్చి ఏం మంత్రినోని పనివడ్డా.?? ఏ ఎమ్మెల్యేను గల్వాలె అనుకున్నా..? జర్ర మీ అక్కెరను ఫిబ్రవరి రెండు తారీఖుదాక వాయిదేస్కోండ్రి.. ఎందుకంటె సార్లు ఇప్పుడు చాల బిజీగున్నరు.. లేదు మేము కచ్చితంగ కల్వాలే లేకపోతె ఆగమైతరనుకుంటే మాత్రం..వాళ్ల జాగ కోసం ఈ వీడియో సూడుండ్రి.

Friday, January 22, 2016 - 08:07

వాస్తవానికి ఒక పార్టీ కార్యకర్తలు దిష్టిబొమ్మలు గాల్చినా..? ఎవ్వలినన్న తిట్టాలనుకున్నా..? ఎవ్వల్ని తిడ్తరు... బైటి పార్టీలోళ్లను దిడ్తరు గదా..? టీఆర్ఎసోళ్లు కాంగ్రెసోళ్లను.. కాంగ్రెసోళ్లు టీఆర్ఎసోళ్లను దిట్టుడు సూశ్నం నిన్నమొన్నటిదాక.. కని జీహెచ్ఎంసీ ఓట్లళ్ల ఇది ఉల్టా అయ్యింది.. టీఆర్ఎసోళ్లు టీఆర్ఎసోళ్లనే.. కాంగ్రెసోళ్లు కాంగ్రెసోళ్లనే.. టీడీపోళ్లు టీడీపోళ్లనే దిడ్తున్నరు...

Thursday, January 21, 2016 - 20:51

రోహిత్ శవంపై పేలాలేరుతున్న బీజేపీ, గాంధీభవన్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి, ఓటర్లకు ఓపిక ఉండాలంటున్న కేటీఆర్, పురుగుల మందు తాగిన జెడ్ పిటిసి సభ్యుడు, వందో సినిమాకు కథ రాస్తున్న బాలయ్య… ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.…

 

Wednesday, January 20, 2016 - 21:53

కంప్యూటర్ ల కొలువైన బంగారు తెలంగాణ.. భూమ్మీదికి దిగుదతో చెప్పుడు కష్టం, భక్తి పెంచేసుకున్న నారా బాబుగారు… ఉత్తమ భక్తుని స్థానం కోసం…పోటాపోటీ, స్వచ్ఛమైన నీళ్లు.. అచ్చమైన తెలంగాణ.... వాటర్ గ్రిడ్ పథకానికి గవర్నర్ వన్నెలు, సర్కార్ దావఖానకు పోతున్నరా జాగ్రత్త.. అప్రమత్తంగుండమంటున్న బాధితులు, పోలీసు వ్యవస్థకు మచ్చదెచ్చిన కానిస్టేబుళ్లు…లంచాలు తీసుకోశాతగాకా మీదోళ్ల మీద ఫిర్యాదులు...

Wednesday, January 20, 2016 - 07:47

దైవ భక్తి మన కేసీఆర్ సార్కే ఎక్వ వుంది అన్కున్న.. ఎందుకంటే.. మొన్ననే ఆయత చండీ యాగం జేశి అశేష తెలంగాణలున్న దరిద్రాన్ని పోడగొట్టె గదా.. కేసీఆర్ సారు గురించి అట్లుండని గని.. గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి మేడం గుడ.. భక్తితోని భజనలు జేస్తున్నదట. మరి మేడం ఏం యాగాన్కి పూన్కున్నదో సూద్దాం పార్రి. 

Wednesday, January 20, 2016 - 07:39

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ దందాలు మస్తు మొదలవుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర నకిలీ బట్టేవాజి గాళ్లు దొరుకుతున్నరు. కల్తీకాదేది కనర్హం అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వీళ్లను ఎట్ల జేస్తే సోయి కొస్తరో.. అరె రామశంద్రా.. వొక దిక్కు దొర్కుతనే వున్నరు మల్లో దిక్కు తయారు జేస్తనేవున్నరు. శెప్పీ శెప్పి నానోరే వోతున్నది గని.. ఆ సోడిగాళ్లు మాత్రం సోయికొస్తలేరు. వాళ్ల మీద మన్ను వడ మల్లా...

Wednesday, January 20, 2016 - 07:37

సుక్కురారం.. శనివార మొస్తె సాలు హైద్రావాదుల రోడ్ల పొంటి పైపులు వట్కోని నిలవడ్తరు పోలీసోళ్లు.. ఎందుకంటె తాగి బండ్లు నడ్పెటోళ్లు ఉంటరుగదా..? వాళ్ల తాట దీస్తందుకు.. ఒక్క హైద్రావాదులనే ఉండె నిన్నమొన్నటిదాక ఈ కథ.. ఇగ మెల్లెగ మెల్లెగ.. రాష్ట్రమంత ఇస్తరిస్తున్నట్టున్నరు.. నిన్న యాదగిరి గుట్టకాడ గూడ గొట్టాలు దిగేసుడు సుర్వు జేశిండ్రు పోలీసోళ్లు..

Wednesday, January 20, 2016 - 07:36

నీతులు నియమాలు నీవంతు.. చేతలు కోతలు నావంతు అన్నట్టే ఉన్నది అనంతపురం జిల్లా అన్నదమ్ముల ముచ్చట గూడ.. నీతులు జెప్పుమంటే నీ పొడ్గు.. నా దొడ్డు జెప్తరు.. అచరణ మాత్రం ఈళ్లకు సంబంధం ఉండది అదేదో కథ ఉంటది సూడుండ్రి... ఊరోళ్లనందరిని ఉల్లిగడ్డ తినొద్దని చెప్పి ఇంట్ల అదే కూరదినె అయ్యగారు.. అగో సేమ్ అదే కథ. స్వచ్ఛ అనంతరంలో జేసీ ఏమన్నడో వీడియోలో సూడుండ్రి...

Tuesday, January 19, 2016 - 21:56

పెనం మీదికొచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటన.. బీజేపీ మెడకు వడ్డ హెచ్ సీయూ ఉచ్చు…  యాదరిగిగుట్ట కింద పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్, స్వచ్ఛ అనంతపురం, రోడ్లపైకి వచ్చిన పులులు… కొత్త సన్యాసి, బట్టల దుకాణానికి పోయిన కేసీఆర్ వంటి అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..
.

Monday, January 18, 2016 - 20:59

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిదంటరు చూడండి అదే అయితుంది జీహెచ్ఎంసీ ఓట్లలల్ల..చేయి గుర్తు పెద్ద మత్తదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి..పువ్వు గుర్తు పెద్దయ్య కిషన్ రెడ్డి..టిడిపి అత్యవసర ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి..ముగ్గురు అగ్గిగుండాల్లో దుకుండు తప్పేటట్టు లేదు. వీళ్లకు జీహెచ్ఎంసీ ఓట్లకు వీరికే సంబంధం అంటరా ? అయితే ఈ వీడియో చూసేయుండ్రి..

Monday, January 18, 2016 - 20:58

జీహెచ్ఎంసీలో ఓట్లంటే నేతలకు తమాషా అయిపోయినయి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవాడు జరసేపటికి ఇంకో పార్టీలో తేలుతున్నడు. అరగంటలోనే నిర్ణయాలు కూడా మార్చేసుకుంటున్నరు. నిన్న బంగారు తెలంగాణ అన్న లీడరు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటూ రకరకాలుగా మాట్లడుతున్నరు. ఒక్క నాలికతో ఎన్ని చిత్రాలు చూడండి ఈ వీడియోలో చూడండి. 

Monday, January 18, 2016 - 20:51

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నో హామీలు గుప్పిస్తుంటరు కదా..కానీ ఆ హామీలు అమలైందా ? ఏమో తెల్వదు అంటరు కదా. అలాంటిదే ఇది కూడా పాలమూరు జిల్లాలో గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటించిండు. జనవరి 18వ తేదీన పాలమూరుకు వెళ్లిండు. బస్తీ జనం బాధలు కరిగిపోయిన కేసీఆర్ హమీలు గుప్పించిండు. స్ట్రీట్ లైట్లు, మోరీలు, నల్లాలు, ఇళ్లు ఇలా హామీలు ఇచ్చిండు. అంతేగాక...

Pages

Don't Miss