మల్లన్న ముచ్చట్లు

Thursday, March 10, 2016 - 21:12

యనమల 20-20 పార్మాట్, బడ్జెట్ పై జగన్ బేజారు, సర్కారు గొప్పదనం సద్విజెప్పిన గవర్నర్, వరంగల్ పీఠం మీద పెర్గిపోయిన పోటీ, లీడర్ల పరాష్కానికి బలైన ఉద్యమ బిడ్డ, నీళ్ల కోసం ఎర్రటెండలో నిరసనలు.. సాగునీటి తండ్లాట, ఉత్తమ తెలివైన ఎర్రచందనం స్మగ్లర్లు ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.... 

Wednesday, March 9, 2016 - 20:12

మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న 'మల్లన్న ముచ్చట్లు' ఈ రోజు కూడా కొత్త కొత్త ముచ్చట్లతో మీ ముందుకొచ్చింది.. భూమి-సూర్యుడు నడుమ చంద్రుడు... సుడిపెట్టి తిరిగిన సూర్యగ్రహణానికి గల కారణాలేంటీ? అసలు సూర్య గ్రహణం రోజు గుడులను ఎందుకు మూసేస్తరు? అంటూ మల్లన్న చెప్పిన వార్త తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆ తర్వాత కార్పొరేషన్ ఓట్లల్ల కారుదే జోరు... ఇప్పట్లో అంబాసిడర్ ను ఆపలేరంటూ.. తెర్లు...

Tuesday, March 8, 2016 - 20:31

దెయ్యాలు ఉన్నాయా. ? యే గవన్నీ పాత ముచ్చట్లు..అంటరు..కదా..కానీ కడప జిల్లాలో మాత్రం దెయ్యాలు కొందరికి ఆవహించాయంట..జిల్లాలో పొణతల సాంబయ్య స్వామి ఆలయం వద్ద శివరాత్రి పండుగ సందర్భంగా పలువురు ఊగిపోయారు. వీరకందరికీ దెయ్యాలు పట్టాయని..అందుకే ఇలా చేస్తారంట. దెయ్యాలు..ఎక్కడివి..ఇదంతా కేవలం మంత్రాల పేరిట కొంతమంది మోసం చేస్తున్నరని జన విజ్ఞాన వేదిక పేర్కొంటోంది. మరి వారు దెయ్యాలు...

Tuesday, March 8, 2016 - 20:29

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.ఆడోళ్లకు ఆదరణ లేదు. చిన్నచూపు చూస్తుండ్రు..ఆడ బిడ్డ పుడితే సంతోషం వ్యక్తం చేస్తేలే. చంపేస్తున్నారు..ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నడు..ఏడాదిలో కరవును ప్రారదోలుతాం అంటోంది తెలంగాణ ప్రభుత్వం..కేసీఆర్ కు ప్రస్తుతం ఉన్న ఇళ్లు నచ్చలే..అందుకోసం రూ.30 కోట్లతో మరొక ఇళ్లు కడుతున్నరంట..కర్నూలు జిల్లాలో బాలసాయిబాబా ఆత్మలింగం..ఆటో...

Tuesday, March 8, 2016 - 20:18

కర్నూలు జిల్లా..అక్కడో బాబ ఉంటడు..ఆయనే బాల సాయిబాబా..శివరాత్రి రాగానే లోపలి నుండి లింగం తీస్తుంటాడు. ఈసారి శివరాత్రి పండ్గకు కూడా లింగాన్ని తీశాడు. ఈ తీసిన లింగం తులం సైజులో ఉందంట..కిలో సైజులో తీస్తారా అని కొందరు చెవులు కొరుక్కున్నారంట. లింగం ఎలా తీశాడో వీడియో క్లిక్ చేయండి.

 

Friday, March 4, 2016 - 22:00

హెల్మెట్ దుకాణపోడ్తా ఎగవడ్తున్న జనం..సర్కార్ పనికి సమాన్యుడి సూటి ప్రశ్న... ఖమ్మంల దిరుగుతున్న డూబ్లికేట్ కేసీఆర్, కథ, కదలికంతా సేమ్ టూ సేమ్, తాగుబోతులకు రుణపడిబోయిన తెలంగాణ ప్రభుత్వం, కాళ్లు కడిగిననెత్తిన చల్లుకుంటెనే బెటరంటున్న మనోళ్లు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Thursday, March 3, 2016 - 20:45

జీడబ్ల్యుఎంసీ ఎన్నికల నేపథ్యంలో టెన్ టివి వరంగల్ గల్లీల్లో మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ పార్టీల ప్రచార తీరును మల్లన్న వివరించారు. బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న కోలాటం బృందంతో ముచ్చటించారు. అనంతరం ప్రజలు టెన్ టివితో మాట్లాడుతూ పలు సమస్యలను ఏకరువుపెట్టారు. మరిన్ని మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Wednesday, March 2, 2016 - 21:17

వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ లోని పలు డివిజన్ లలో టెన్ టివి.. 'వరంగల్ గల్లీలో మల్లన్న కార్యక్రమాన్ని' నిర్వహించింది. 38 వ డివిజన్ తోపాలు పలు ప్రాంతాల్లో మల్లన్న ఎన్నికలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సంరద్భంగా ప్రజలు మంచినీరు, ఇళ్లు పట్టాలు, చెత్తకుండీ, మోరీలు క్లీనింగ్ తోపాటు పలు సమస్యలను ఏకరవు పెట్టారు. తమకు ఇళ్ల పట్టాలు కావాలని డబుబ్ బెడ్ రూం...

Tuesday, March 1, 2016 - 22:01

రింజుం రింజుం హైదరబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిరగిర తిరగితె మోటరు కారు బలాదూర్.. ఈ పాట పనిఒడ్సిపోయిందిగ.. ఇప్పుడు లేటెస్టు పాటేందంటే.. రింజుం రిజుం హైదరబాద్ హెలికప్టర్ వాలా జిందాబాద్.. గాలిలో గిరగిర తిరుగుత వుంటే.. లష్కర్ లండన్, న్యూయార్క్ బలాదూర్ అని పాడుకోవాలె ఎందుకో ఎర్కేనా ఇగోంది..
 
ఓయమ్మో ఏమో అనుకున్నంగని.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఓట్లు...

Monday, February 29, 2016 - 20:32

హైదరాబాద్ : గజరాజుకు కోపం వస్తే..., రైలును ఆపిన కుక్క, చేపలు వేటలో పీటన్స్ బర్గ్, బాబు ఆలనా.. పాలన చూస్తున్న రామచిలుక, నీళ్లు అందక అవస్థలు, బీరు తాగిన కోతి, ఈత కొడుతున్న ఏనుగు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సాగర కన్య కనిపించిందట, ఆకులో కల్లు తాగిన విదేశీ వనిత, సౌదీకి పోయిన తెలుగు బిడ్డల ఘోష.. వివిధ సోషల్ నెట్ వర్క్ లో ముచ్చట్లతో నేటి 'మల్లన్న...

Saturday, February 27, 2016 - 06:53

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ... సీఎం కేసీఆర్ తన ఉపన్యాసంలో పేర్కొన్నాడు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సైతం మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటూ.. మీడియా సమావేశంలో మాట్లాడాడు.. తెలంగాణలో ప్రజల నీటి బాధలు... సమ్మక్క సారక్కల జాతర హుండీ డబ్బుల లెక్కింపు... లాంటి అంశాలపై మల్లన్న...

Thursday, February 25, 2016 - 20:07

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు తెడ్డు చూపెట్టిన కేంద్రం..రైల్వే బడ్జెట్ లో రాలని పైసలు.. పనులు, వరంగల్, ఖమ్మం ఓట్లల్లో గమ్మత్తి కత, పుట్టపుట్టక మునుపే కుల్లగుడుతున్న కారు,లలిత కళలల్లో ఆరితేరుతున్న లోకేశం.. నారా నందమూరిని మించిన యాక్టింగ్, తాగి బండి నడిపిండు... తరువాత ఇట్లయిండు, సర్కార్ తప్పుకు సామాన్యుడి బలి, ఆదిలాబాద్ జిల్లాలో అంటరాని...

Wednesday, February 24, 2016 - 20:17

హైదరాబాద్: కాకతీయ చెర్వులల్లో తేలిన గంగరాళ్లు...దూపయితుందంటున్నయాద్రాది నర్సన్న, ఫాం హౌస్ కు దికానాలు మారుస్తున్న చంద్రాలు...అక్కడకెల్లి పాలన అద్భుతం కావచ్చు... దేశ నగరాలను తలదన్నేటట్టు హైదరాబాద్.. మూడేళ్లలో డల్లాసును మించుటే ఆదర్శం, మీరు చేస్తే సంసారం... మేం చేస్తే ఇంకోటా?, రాజకీయాలలో మారుతున్న నీతి, నియమాలు, గంగా నదిలో చిచ్చు పోసిన స్వచ్ఛ అధికారి.. గలీజు...

Tuesday, February 23, 2016 - 20:11

హైదరాబాద్ : బ్రహ్మంగారు జెప్పినయ్ అన్ని బరాబరే అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమం ఎట్లైందో.. అగో మిడ్ మానేరు లడాయి గూడ సేమ్ టూ సేమ్ అట్లనే, ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గుత్తకు వట్టిన చిన్నముల్కనూరు గోస రాస్తె రామాయణం.. , నడిజాము రాత్రి భాగ్య నగరం సందర్శనకు బైలు దేరిండ్రు మన ప్రెండ్లీ పోలీసులు.. శీకట్ల ఎందుకు వోతురో తెల్సుగదా.. వొక పొల్లా పొలగాడు గాఢంగ...

Monday, February 22, 2016 - 20:50

''అసలే కోతి ఆ పైన దయ్యం పట్టింది.. ఆటుపైన తేలు కుట్టింది.. ఆపై కల్లుతాగింది'' అనే సామెత విని ఉంటరు కదా.. అచ్చం అలాగే ఓ కోతి మందు తాగిన కత్తి పట్టుకుని ఏం చేసింది..? ఎంతమందిని భయపెట్టింది?? 
ఓ వ్యక్తి ఓ విషయం దాచి పెళ్లి చేసుకున్నాడు.. తీరా శోభనం గదిలోకి వెళ్లే సమయానికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఇంతకు పోలీసులు ఎందుకు వచ్చారు?? అసలు ఏం జరిగింది??
వీటితో పాటు...

Monday, February 22, 2016 - 20:13

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 104 ఏండ్ల ముసలవ్వ కాళ్లు మొక్కాడు.. కారణమేంటో? కోరుట్ల ఎమ్మెల్యే ముట్టడించిన బీడి వర్కర్స్ ఏం చేశారు.?  పోలీసోళ్ల మీద మంత్రి హారీష్ రావు ఎందుకు ఘరం ఘరం అయ్యిండు..? అర్థరాత్రి అంటుకున్న గుడిసెలు.. కారణం కారణం ఎవరు? పోలీస్ టౌన్ లో ఆత్మహత్యాప్రయత్నం.. కారణం సీఐ అంటున్న బందువుల వాదన నిజమేనా? రాముల వారి సన్నిధిలో రామచిలుక... ఏం చేస్తోంది? ఇత్యాది...

Friday, February 19, 2016 - 20:16

హైదరాబాద్ : మూడు రోజుల దీక్షకు కూర్చున్న వికలాంగులు... మద్దతిచ్చి మంచి చెడ్డలు అరుసుకున్న ఆర్.కృష్ణయ్య, కస్తూర్బా హాస్టల్ లో బొడబొడ కక్కిన ఆడపిల్లలు.. దావఖానాలో వేసి సూదులిచ్చి పరీక్షలు..డ్యూటీలో ఉండి మందు కొట్టిన పోలీసోళ్లు..పద్మవీర చక్ర అవార్డు ఇచ్చి సత్కరించాలని టాక్, పారా, గడ్డపారతో పాఠాలు నేర్పుతున్న పంతుళ్లు...ద్రోణాచారుడిని మించిన...

Friday, February 19, 2016 - 07:56

ఇట్ల దాపురం అయ్యిండ్రేందమ్మా.. వాళ్ల నోట్లె పొక్కులు వొడ్వ.. వొక్క దెగ్గర అయిపోంగనే వొక్క దెగ్గర వొక్క దెగ్గర అయి పోంగనే వొక్క దెగ్గర సుర్వు జేస్తున్నరు అడ్డమైనోల్లు.. వాళ్లను మనుండంగనే కుత కుత ఉడ్కుతున్న నూనెలేశి గోలియ్య.. నిజాంబాద్ జిల్లా కామారెడ్డి కాడ కొందరు దేడ్ దిమాక్ గాళ్లు ఏం దంద జేస్తున్నరో సూడుండ్రి సూశినంక మీరు గుడ జాగ్రత్తగ వుండుండ్రి..

Friday, February 19, 2016 - 07:55

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కాడ కొంతమంది ప్రజలు రోజుకు ఎన్మిది గంటలు గాదు.. రోజుకు ఇర్వై నాల్గు గంటలు పనిజేస్తున్నరట.. నిద్రలేదు.. ఇళ్లు లేదు.. పెండ్లాం పిల్లలు.. అయ్య అవ్వలు ఎవ్వలు లేరు.. కష్టాన్నే నమ్ముకోని.. ముంగటికి వోతున్నరు.. ఆ కష్టపోతులకు పోలీసోళ్లు విముక్తి గల్పిచ్చిండ్రట.. మరి వాళ్ల కష్టమేంది..? పోలీసోళ్లు ఎందుకు వొయ్యిండ్రు అనేది తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి.

Friday, February 19, 2016 - 07:53

సర్కారు నౌకరంటె ఎట్లుంటది..? పొద్దుగాళ్ల పదిగొట్టంగొచ్చి.. పొద్దుందాముల ఆరుగంట్లకు ఇంటికి ఎల్లిపోవుడుగదా..? యాళ్ల గాకముందుకు సంచి సంకల వెట్కపోతె తప్పైతది.. కని ఆరుగంట్లకు అయిపోవాల్సిన నౌకరి రాత్రి తొమ్మిది పదిగొట్టెదాక పనిజేస్తుంటె వాళ్లను మెచ్చుకోవాల్నా..? అరెస్టు జేశి జైలుకు వంపాల్నా మీరే జెప్పుండ్రి.. శెబ్బాష్ అని.. మెచ్చుకోవాల్సింది ఇడ్సిపెట్టి..అరెస్టు జేశిండ్రు.. మరి...

Thursday, February 18, 2016 - 20:37

బండిపై వెళ్లి తనిఖీలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు..బీడీ కార్మికుల బాధలు...నెల్లూరు జిల్లాలో అధికారుల అరెస్టు..పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసోళ్లు..పైకం ఉంటే సర్కారీ నౌకరీ ఇచ్చినోళ్లను అరెస్టు..అదిలాబాద్ జిల్లాలో నీళ్ల కోసం గిరిజనుల ఏడుపు..ఏపీలో ఉపాధి హామీ వర్కర్ల బాధలు..నిజామాబాద్ జిల్లాలో కల్తీ నూనె తయారీ..చెప్పు కోసం తాగుబోతు విన్యాసాలు..ఆపదలో...

Wednesday, February 17, 2016 - 12:19

తెలంగాణల లంచం ఎవ్వడన్న లంచం అడ్గితె.. 040-23454071 నంబర్కు పోన్ గొట్టుండ్రి అని కేసీఆర్ సారు సరిగ్గ పదమూడు నెల్లకింద వరంగల్లు జెప్పిండు. ఐతే.. సీఎం సారు మాకు గాదు వరంగల్లోల్లకు జెప్పిండు అన్కున్నరో ఏమో గని.. కరీంనగర్ జిల్లా ఎములాడలున్న కొందరు గవుర్మెంట్ అధికార్లు ఏం జేశిండ్రో జూడు నా సామిరంగ ఉండాలే భూమ్మీద ఇసొంటి సద్వుకున్న ఉద్దుండులు..సూడాలంటే వీడియో చూడుండి. 

Wednesday, February 17, 2016 - 12:13

భాగ్య నగరాన్ని స్వచ్చ ఐద్రావాద్ జెయ్యాల్నని.. కేసీఆర్ సార్ కంకణం కట్టుకొని అకుంఠిత దీక్షతోని పురుడు పోశి.. భారసాల జేశ్న భాగ్యనగరం స్వచ్చతకు నోచుకోలేదట.. సంటర్ సర్కారోల్లు జేశ్న సర్వే తోని ఈ ముచ్చట ఎర్కైంది. మన పట్నం పేర్ను ఏన్నో దూరం పడేశిండ్రు.. సెత్త బుట్టలు పంచిపెట్టి.. సీఎం సారు గంత గానం కష్టవడే.. గట్లెందుకు ఎన్కవడ్డదో ఏమో తెలుస్తలేదు. ఎందుకో ఈ వీడియో క్లిక్ చేయుండ్రి...

Wednesday, February 17, 2016 - 12:11

పెన్ను పేపర్ వట్కోని.. అఆలు దిద్దాలి.. అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మయ్య మొత్తం మీద నాల్గు అచ్చరాలు మాత్రం నేర్సుకున్నపో.. ఇన్నొద్దులు ఏంగాదు సద్వురాకున్నా అనుకున్నగని... అమ్మో ఇంతమోసమైతదని తెల్వకపాయే.. ఏంది మల్లన్నా.. ఏమో సద్వంటున్నవ్ మోసమంటున్నవ్ అనిపిస్తున్నదా..? అయ్యో మీరు గీ వీడియో సూడుండ్రి మీకే తెలుస్తది. 

Tuesday, February 16, 2016 - 21:44

ఖమ్మం జిల్లా మీద ముఖ్యమంత్రి వాన, మామకు ప్రేమతో అంటున్న ఫ్యాన్స్, పాలమూరు కాంగ్రెసు మీద కారు మన్సు,చ సద్వుబంజేస్తె సంఘ బహిష్కరణమే నట, దర్వాలలు ఇరగొట్టి.. బ్యాకుకు తొర్రవెట్టి ఈ అంశాలను మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం 

Monday, February 15, 2016 - 20:30

వరంగల్..ఖమ్మం రిజర్వేషన్లు ఖరారైయినయి..ఖమ్మం జిల్లాలో కలియదిరుగుతున్న కేసీఆర్...మంగళవారం నాడు ఖేడ్ ఓటింగ్..ట్యాంక్ బండ్ పై ప్రేమికుల ఇబ్బందులు..మేడారం జాతర..నీటి కోసం ఒంగోలు ప్రజల ఇక్కట్లు...బీడీ కార్మికుల ఆందోళనలు..కేటీఆర్ ఇలాఖాలో చిన్న బోయిన న్యాయం..ఆత్మహత్య చేసుకున్న బస్సు.. తదితర అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించాడు. మరిన్ని...

Monday, February 15, 2016 - 20:20

ప్రేమికుల రోజు...ఫిబ్రవరి 14వ తేదీ..ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఎదురు చూస్తుంటరు కదా. ఎంతో మంది సెలబ్రేషన్ చేసుకుంటరు కదా. దీనిని అడ్డుకోవడానికి ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలు ప్రయత్నిస్తుంటరు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రేమికులను అడ్డుకున్నరు. ట్యాంక్ బండ్ పై భరతమాత బిడ్డలు అనే చెప్పుకొనే వీరు హల్ చల్ చేసిండ్రు. భరత్ మాతాకి జై..జై..శ్రీరాం..అంటూ నినాదాలు చేసిండ్రు...

Pages

Don't Miss