మల్లన్న ముచ్చట్లు

Saturday, May 20, 2017 - 20:09

హైదరాబాద్: బేడీలు వేసుకున్న రైతులతోని కాంగ్రెసోళ్ల ఆట...సంగారెడ్డి మీటింగ్ లో వాళ్లను చూపెడతారంట, పోలీసులను అరెస్ట్ చేసిన తణుకు ఎమ్మెల్యే....న్యాయం కోసం పోరాడుతున్న ఎస్సై, రైటర్, రాజకీయం కోసం జనాన్ని గోస పెడుతున్న లీడర్లు...నల్లగొండ కాడ నలుగుతున్న అమాయకులు, ఇజ్జత్ కే సవాల్ అంటున్న ఈవీఎం మిషీన్లు...దమ్ముంటే చెరబట్టమని ఢిల్లీలో సవాళ్లు,...

Friday, May 19, 2017 - 20:09

హైదరాబాద్: పోలీసోళ్లను ఆకాశానికి ఎత్తిన సీఎం కేసీఆర్.. అంతకంటే గొప్పోళ్లు లేరని అంటున్నారట, విశాఖలో ముగిసిన జనసేన సెట్ పరీక్ష...ఫలితాల విడుదల మీద పెరిగిన ఉత్కంఠ, తెలంగాణకు సరికొత్త సచివాలయమట...అమరవీరుల ఆత్మకు అసలైన శాంతట, ఆంధ్ర రాష్ట్రం ఆడోళ్లకు లోకేశం బంపర్ ఆఫర్....జలమణి పథకం కొలాయించిన అయ్యా, కొడుకు, మళ్లా మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వం......

Thursday, May 18, 2017 - 20:06

హైదరాబాద్: జూన్ 1న రాబోతున్న రాహుల్ గాంధీ...గాంధీ భవన్ లో గర్జిస్తున్న కాంగ్రెస్ గడ్డం సాబ్, కథ మారిపోబోతున్న కరీంనగర్ పట్టణం...సరిచేసిండు సీఎంసార్ నిధుల కట్నం, బూతు లెవల్ కు బైకు మీద పోతున్న పువ్వు...కమలవోళ్లను చూస్తుంటే రానేబట్టే నవ్వు, మానకొండూరులో మసకబారుతున్న ఎమ్మెల్యే....రసమయి పాలన మీద జనం రుసరుస, పెట్రోలు బంకుల వెంటన అద్భుతమైన మోసం...

Tuesday, May 16, 2017 - 20:27

తప్పుజేశేది ప్రభుత్వమే.. అధికార్లతోని చేపిచ్చేది ప్రభుత్వమే.. చేయకపోతె చర్యలు దీస్కునేది ప్రభుత్వమే.. కేసీఆర్ను గానీ.. ఆళ్ల కొడ్కును గానీ.. బిడ్డను గానీ.. అల్లున్ని గానీ.. ఏమన్న అన్నరే అన్కో.. మీ నాల్కె శీరేస్తరట..తెలంగాణ కాంగ్రెసోళ్ల పుణ్యాన వాళ్లకు జీవనోపాధికి పర్శానొచ్చిపడ్డది..ప్రతిపక్షాలోళ్లు గడ్కోపారి ఈటెలతోని వొడ్వవట్టే.. అని మన కేసీఆర్ సారు ఏం ప్లాన్ జేశిండో తెల్సా...

Tuesday, May 16, 2017 - 20:23

కల్వకుంట్ల కవితమ్మకు నిజాంబాదు జిల్లా అంటె ఎందుకో ఏమో.. మస్తు ప్రేమ అక్కకు.. ఏ జిల్లాల ఉన్నా... నా నిజాంబాదు జనం ఎట్లున్నరో తిన్నరో లేదో అనే కల్వర పడ్తుంటదట.. నిజమో కాదో తెల్వదిగని.. అక్క పనితనం జూస్తుంటే నిజాంబాదు మీద నిజంగనే ప్రేమున్నట్టుగనిపిస్తుంటది.. అత్తగారి ఊరికి వొయ్యి ఎట్ల జేశిందో వీడియోలో సూడుండ్రి..

Tuesday, May 16, 2017 - 20:11

తెలంగాణ భక్త జనులారా..? తెరాసా కార్యకర్తలారా... విపక్ష కుట్రదారులారా..? మూగ జనులారా..? అందరికి ఒక్కటే పారి జేప్తున్న ఇనుండ్రి.. ఇద్వర్ సంది మీరు ఎవ్వలైనా సరే.. కేసీఆర్ను గానీ.. ఆళ్ల కొడ్కును గానీ.. బిడ్డను గానీ.. అల్లున్ని గానీ.. ఏమన్న అన్నరే అన్కో.. మీ నాల్కె శీరేస్తరట.. తెలంగాణ పోరాట యోధుడు తలసాని శీనన్న హెచ్చరిస్తున్నడు ఇని తగు జాగ్రత్తలు దీస్కోండ్రి..

Monday, May 15, 2017 - 20:33

అఖిలపక్షం చేపట్టిన చలో ఇందిరాపార్క్‌ విజయవంతమైంది. ప్రభుత్వ కుట్రను భగ్నం చేసిన ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు నిరసన ద్వారా తమ వాదనను గట్టిగా వినిపించారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేసినా... వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. స్థానికుల ముసుగులో గులాబీనేతలు, పోలీసులు చేసిన హంగామా వీడియో ఫుటేజ్‌ ద్వారా బయటపెట్టారు. సేవ్ ధర్నా చౌక్ లో మల్లన్న కూడా తిరిగి నేతల అభిప్రాయాలు...

Monday, May 15, 2017 - 20:30

సేవ్ ధర్నా చౌక్ కోసం అనుమతినిచ్చి పోలీసులు లాఠీలు పట్టుకున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ‘సేవ్ ధర్నా చౌక్' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేనితో 'మల్లన్న' ముచ్చటించారు. తమ్మినేని మాటల్లోనే..’సీపీ పర్మిషన్ ఇచ్చిండు. సంతోష పడినం..కానీ లాఠీలు పట్టుకున్నారు..నెత్తురు చిందుతున్నా..కాలు..చేతులు విరుగుతున్నా..ఇక్కడే...

Monday, May 15, 2017 - 20:15

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నడని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ‘సేవ్ ధర్నా చౌక్' లో భాగంగా ఆయనతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో సర్కార్ పై నిప్పులు చెరిగారు. జనం చూసి కేసీఆర్ భయపడుతున్నడని..మేజర్ పార్టీ మాదేనని..రీజినల్ పార్టీలు ఎక్కువుండవని తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతోందని విమర్శించారు. 30 మంది గులాబీ...

Saturday, May 13, 2017 - 19:20

పుసుక్కున నరేంద్రమోడీ గన్క ఈ ముచ్చట జూస్తె మట్టుకు.. మళ్ల ఏ మీటింగుల గూడ.. నా చాతీ కొల్త గింత.. నా గుండె కాయ కొల్త గింత.. అబ్బా తెలంగాణ ప్రభుత్వాన్ని జూస్తె కంట్లె నిప్పులు వోస్కుంటరు వా ఈ కాంగ్రెస్ పార్టోళ్లు.. అయ్యా జనసేనా అధ్యక్షుడా..? భావి తెల్గు బాటసారి.. పవన్ కళ్యాణ్ సారూ.. ఏడున్నవో గని.. ఒక్కపారి గుంటురు జిల్లాకాడికంట వో.. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు...

Friday, May 12, 2017 - 20:00

తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అసలు ధర్నాలే ఉండొద్దు అసొంటి గొప్పతెలంగాణను నిర్మించుకుందామంటే..ఓహో ప్రజల అవసరాలన్ని తీరుస్తడేమో ఇగ తీర్చినంక ధర్నాలెందుకని ఆడున్నోళ్లు సప్పట్లు గొట్టిండ్రు...తెలంగాణల అన్నదాత ఆకలి మంట ఆరుతట్టులేదు ఇప్పట్ల.. ఏదో ఒక జిల్లాల ఏదో ఒక జాగ రోజు రైతు రగిలిపోతనే ఉన్నడు.. ఈవీఎం మిషీన్ల పంచాది ఇయ్యాళ మళ్ల లేశింది.. మనదేశంల వాడుతున్న ఈవీఎంలు ఆగమాగమున్నయ్..మన...

Thursday, May 11, 2017 - 20:18

ఈ సుక్కురారం నాడు ఎంసెట్ పరీక్షలు రాస్తందుకు తయ్యారైతున్న పోరగాళ్లు బొట్టగాళ్లు అందరికి ముందస్తు శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్ సారు నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ మీదనే అంటున్నడు.. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు సారుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి సారు క్యాంపు ఆఫీసు గురించి పూరాగ తెల్వనట్టుంది.. తెలంగాణల రైతులంటె.. సర్కారుకు మరి ఎట్ల గనిపిస్తున్నరో ఏమో.. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల కంటె...

Wednesday, May 10, 2017 - 18:59

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కొడ్కు మబ్బుల యాక్సిడెంట్ల సచ్చిపోయిండు...ఆ హైద్రావాదు పబ్లీకు రాత్రి నిద్రవొయ్యిండ్రా మీరూ..? ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటె మూతి మీసాలు గలినట్టే ఉన్నది మా పని అంటున్నరు వరంగల్ పట్నంలున్న ఎస్ఆర్ నగర్ కాడ బత్కే పబ్లీకు.. తెలంగాణనే గాదు.. ఆంధ్రప్రదేశ్ గూడ అద్భుతంగ రైతులను ఆగం జేస్తున్నది అంటున్నరు అక్కడి దిక్కు రైతు సంఘాలోళ్లు.. చాచాచాచా అన్యాయం...

Tuesday, May 9, 2017 - 20:19

భారతదేశంల ఈ ఈవీఎంల సంగతి ఏంది అని అనుమానమొచ్చిన ఆమాద్మీ పార్టీ ఇగో ఆ మిషిన్ల బాగోతం గిదని సూపెట్టింది...ఇయ్యాళ నగతిచ్చి కొన్కపోయి రేపు ఉద్దెర కొచ్చినా మళ్ల ఇయ్యాళ నగతే అని కనిపిస్తది..తెలంగాణ ప్రజల నెత్తిల తేనెతెట్టె వెట్టినట్టే గొడ్తున్నది... అదురుష్టమంటే వాళ్లదే అని బైటి రాష్ట్రాలోళ్లు గూడ ఆసూపడె యవ్వారం గావోతున్నదట.. బంగారు తెలంగాణ రాష్ట్రంల పాలమూరు జిల్లాతోని.....

Tuesday, May 9, 2017 - 20:17

దున్నెటోనిదే భూమిరా..? నడ్మ దొరోడు ఏందిరా అని ఆర్ నారాయణ మూర్తి సారు సీన్మల ఒక పాట ఉండే.. ఆ పాటల పల్లవులు, చరణాలు మార్చవల్సిన అవుసరమొచ్చింది.. ఎందుకంటె దున్నెటోంది గాదు భూమి.. కబ్జావెట్టినోందే అని క్లారిటీ వచ్చేశింది.. ఒక టీఆర్ఎస్ పార్టీ లీడరు.. ఒక్కటి గాదు రెండు గాదు.. అర్వై ఎక్రాల ముప్పై గుంటల భూమీ అప్పనంగ మింగేశిండట. మొత్తం విషయానికి వీడియో క్లిక్ చేయండి.

Tuesday, May 9, 2017 - 20:16

తెలంగాణ ప్రజల నెత్తిల తేనెతెట్టె వెట్టినట్టే గొడ్తున్నది. అదురుష్టమంటే వాళ్లదే అని బైటి రాష్ట్రాలోళ్లు గూడ ఆసూపడె యవ్వారం గావోతున్నదట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారూ ఇన్నొద్దులు ప్రగతి భవన్లనే ముచ్చట్లు జెప్పిండుగదా.? ఇగ ఇద్వర్ సంది.. వాడవాడకు జెప్తడట.. పదిహేను దినాలకోపారి మీరు పనులు పక్కకు వెట్టి చౌరస్తకాడికి రాండ్రి.. ఎందుకనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

Monday, May 8, 2017 - 20:20

తెరపైకి బీసీ రిజర్వేషన్ డ్రామా పరిస్థితులు సర్వే చేయమన్న ప్రభుత్వం.....పవన్ కల్యాణ్ మీద ఫైర్ అయిన వర్ల మార్పు వచ్చతట్లూ లేదు రామయ్య తీర్లా....సిరిసిల్లల ముగబోయిన పవర్ లూమ్ అపుతాలేదంటూ యాజమాన్యం జూలుం...యువతిని చర పట్టిన ఎమ్మెల్సీ కొడుకు కేసు నిలవడతదో లేదో మీఅందరికి తెలుసు....ప్రేమ జంట తాళ్లి తెంపిన సీఐ రామకృష్ణ ఎట్ల బుద్దస్తాదో కృష్ణ కృష్ణ....పార్టీ మారకుంటే పదవి...

Saturday, May 6, 2017 - 20:14

హైదరాబాద్: బీసిలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తాం.. మరి ఎమ్మెల్యేల టిక్కెట్లు ఏంది సారూ, జీహెచ్ ఎంసీ ఆఫీసులో చెత్త ఆఫీసర్ల పని...లేని పనులకు దొంగ బిల్లులతో ఖూనీ, ట్విట్టర్లో కాలు జారిన మంత్రి లోకేషం..మండలి ఛైర్మన్ ఫోటో తారుమారు, జ్యూసులు, లస్సీలు తాగేటోల్లు ఇనుండ్రి...అడ్డమైన ఐసు వేస్తున్నరంట తన్నుండ్రి, పిల్లల మీద పగబట్టిన హిందూపురం పంది.......

Friday, May 5, 2017 - 20:09

హైదరాబాద్: మళ్లా మైకందుకున్న వర్లా రామయ్య...పాత చింతకాయనే నూరుతున్నడయ్యా...,ప్రగతి భవన్ లో పరవశించిపోతున్న పబ్లిక్.. గా ముచ్చట్లు చెప్పరాదా ఈ సార్ కు, నెల్లూరు కాడ ఆనం రెడ్ల ఆగమాగాలు...అడ్డమైన మాటలనుకుంటున్న అన్నదమ్ములు, ఏఎన్ ఎం అక్కలూ అందుకోండి స్కూటర్లు...టీకాల బండ్లు ఇవ్వబోతున్న ప్రభుత్వం, తిరుపతి వెంకన్న ఉండిలో చెయ్యేసిండు...పోలీసోళ్ల...

Thursday, May 4, 2017 - 20:04

హైదరాబాద్: చెత్తలేని నగరాలల్లో హైదరాబాద్ అదుర్స్.. దరిద్రానికి దండేసినట్లే ఉందంటున్న పబ్లిక్, ఉరితాడునే నమ్ముకున్న రైతులు....తీరుస్తదా ఈ సర్కార్ వారి వెతలు, దుబాయ్, బొంబాయ్, బొగ్గుబాయ్ కథ...రాసి చూస్తే ఉన్నది రామాయణమంతా, గోలివాడ కాడ సురువైన ప్రాజెక్టు కథ...సర్కార్ మెడకు మల్లొక పంచాయతీ, సూసైడ్ అటెంప్ట్ చేసిన చిరుత పులి...అచ్చంపేట అడవిలో...

Wednesday, May 3, 2017 - 20:07

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు పుణ్యమూర్తే గవర్నర్..నరసింహన్ సార్ నే ఉండమన్న కేంద్రం, మీడియా ముందు వీహెచ్ అన్న కన్నీళ్లు...మిర్చి రైతుల ఘోష కు కరిగిన గుండె, కంగారు మాటలంటున్న జేసీ ప్రభాకర్...సోషల్ మీడియాలో తిట్టి పోస్తున్న జనం, వలసలు ఆగని పాలమూరు బతుకు...బంగారు తెలంగాణ లో దొరకని మెతుకు, రాత్రికి రాత్రే ఉద్యోగాలు మాయం అయినయ్..మైనార్టీ...

Tuesday, May 2, 2017 - 20:08

హైదరాబాద్: కేంద్రం మెడకు 12 % గంట..కేసీఆర్ కారు పార్టీకి సరికొత్త తంట, రోడ్ల మీద గుంతలు కనిపీయొద్దు...ఆఫీసర్ల మీద కన్నెర చేసిన సీఎం, బీసీల వాటా బీసీలకు దక్కవల్సిందే... అడుక్కోవదుద్ద ఇక గుంజుకునుడే, పోలీసు మార్కెట్ అయిన ఎనుమాముల...రైతులను కుట్రదారులను చేసిన సర్కార్, పాటలు పాడుతున్న ఆనం వివేకా...ఒంగోలు గిత్త సిన్మా స్టోరీ చెపుకుంటా, వనపర్తి...

Monday, May 1, 2017 - 20:07

హైదరాబాద్: ఓస్త్రీ రేపు రా అంటున్న సీఎం కేసీఆర్... కరెంట్ ముచ్చట మీద గతం కటింగ్, మద్దతు ధర ఇయ్యవల్సింది రాష్ట్రమే... మాట్లాడుతున్న దత్తన్న ఇట్లంటే కష్టమే, రైతుల నెత్తిమీద వడగండ్ల పిడుగు...సూర్యాపేట దిగ్గు తడిసిన కల్లం అడుగు, జమ్మికుంటు సీఐ ప్రశాంత రెడ్డి పనితనం...అన్యాయం చేసిన బహుజన బిడ్డ, కాల్వ దాటని శ్రీరాంపురం కన్నీల్లు.... ఒట్టి మాటలే...

Saturday, April 29, 2017 - 21:40

ఘాటు మీదికొచ్చిన మిర్చి చేటు పంచాది... ఖమ్మం పట్నంల పోలీసు సెక్షన్లు విధింపు, కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఎనుకేసున్నడు... మళ్లోపంచాది ముంగటేసుకున్న కోమటిరెడ్డి, చంద్రన్న కుప్పంల కుప్పల కొద్ది అవినీతి.. ఇంట్ల ఓడి రచ్చ గెలుస్తున్న చంద్రాలు, వరంగల్ సభకు ప్లాప్ కు పోలీసోల్లే కారణం... క్యాడర్ రానియ్యలేదని కారు బాస్ కన్నెర్ర, కామారెడ్డి కాడా స్మశాన వాటిక కబ్జా.... 55 ఎకరాలకు రియల్...

Friday, April 28, 2017 - 21:42

కండ్లెర్రజేసిన ఖమ్మం జిల్లా మిర్చి రైతులు...మద్దతు ధర కోసం మార్కెట్ మీద దాడి, కోదండరాంకు అడ్డంపడ్డ కారు క్యాడరు.... ఆయనదిరిగితే మీకేమైతుంది డర్, ఆడిమనుషులకు నాలుగు వందల కూలీ.... తాగిఊగినంక సూడాలే టీఆర్ఎస్ గాలి, కబ్జానామా సంవ్సరమైన యేడాది...పంచభూతాలను చెరవడుతున్న దొంగలు, కాలనీ ఇండ్లమీద రాళ్లేస్తున్న దయ్యాలు... పాణాలు చేతులవట్టుకోని జనం భయాలు, బాహుబలి సినిమా చూసేటందుకు...

Saturday, April 22, 2017 - 20:06

హైదరాబాద్: కొమటిరెడ్లకు చేయి ఇవ్వబోతున్న కాంగ్రెస్...పార్టీ నుండి పంపించేందుకు పక్కా స్కెచ్, జాబు కావాలంటే బాబు రావాల్సిందే...బాబు వచ్చిన తరువాత ఆకు, అలం తినాల్సిందే, బాన్సువాడ కాడ బేతాలుని జాతర..మస్తయితంది చూస్తానికి పోతారా, నాసా వాళ్ల మనసు దోసిన మెదక్ బిడ్డ...అన్ని ఖర్చులు పెడతానని చెప్పి కేటీఆర్, శ్రీరాములు ఇంట్లోకి దూరిన ఎలుగుబంటి......

Pages

Don't Miss