మల్లన్న ముచ్చట్లు

Wednesday, January 20, 2016 - 07:39

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ దందాలు మస్తు మొదలవుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర నకిలీ బట్టేవాజి గాళ్లు దొరుకుతున్నరు. కల్తీకాదేది కనర్హం అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వీళ్లను ఎట్ల జేస్తే సోయి కొస్తరో.. అరె రామశంద్రా.. వొక దిక్కు దొర్కుతనే వున్నరు మల్లో దిక్కు తయారు జేస్తనేవున్నరు. శెప్పీ శెప్పి నానోరే వోతున్నది గని.. ఆ సోడిగాళ్లు మాత్రం సోయికొస్తలేరు. వాళ్ల మీద మన్ను వడ మల్లా...

Wednesday, January 20, 2016 - 07:37

సుక్కురారం.. శనివార మొస్తె సాలు హైద్రావాదుల రోడ్ల పొంటి పైపులు వట్కోని నిలవడ్తరు పోలీసోళ్లు.. ఎందుకంటె తాగి బండ్లు నడ్పెటోళ్లు ఉంటరుగదా..? వాళ్ల తాట దీస్తందుకు.. ఒక్క హైద్రావాదులనే ఉండె నిన్నమొన్నటిదాక ఈ కథ.. ఇగ మెల్లెగ మెల్లెగ.. రాష్ట్రమంత ఇస్తరిస్తున్నట్టున్నరు.. నిన్న యాదగిరి గుట్టకాడ గూడ గొట్టాలు దిగేసుడు సుర్వు జేశిండ్రు పోలీసోళ్లు..

Wednesday, January 20, 2016 - 07:36

నీతులు నియమాలు నీవంతు.. చేతలు కోతలు నావంతు అన్నట్టే ఉన్నది అనంతపురం జిల్లా అన్నదమ్ముల ముచ్చట గూడ.. నీతులు జెప్పుమంటే నీ పొడ్గు.. నా దొడ్డు జెప్తరు.. అచరణ మాత్రం ఈళ్లకు సంబంధం ఉండది అదేదో కథ ఉంటది సూడుండ్రి... ఊరోళ్లనందరిని ఉల్లిగడ్డ తినొద్దని చెప్పి ఇంట్ల అదే కూరదినె అయ్యగారు.. అగో సేమ్ అదే కథ. స్వచ్ఛ అనంతరంలో జేసీ ఏమన్నడో వీడియోలో సూడుండ్రి...

Tuesday, January 19, 2016 - 21:56

పెనం మీదికొచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటన.. బీజేపీ మెడకు వడ్డ హెచ్ సీయూ ఉచ్చు…  యాదరిగిగుట్ట కింద పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్, స్వచ్ఛ అనంతపురం, రోడ్లపైకి వచ్చిన పులులు… కొత్త సన్యాసి, బట్టల దుకాణానికి పోయిన కేసీఆర్ వంటి అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..
.

Monday, January 18, 2016 - 20:59

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిదంటరు చూడండి అదే అయితుంది జీహెచ్ఎంసీ ఓట్లలల్ల..చేయి గుర్తు పెద్ద మత్తదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి..పువ్వు గుర్తు పెద్దయ్య కిషన్ రెడ్డి..టిడిపి అత్యవసర ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి..ముగ్గురు అగ్గిగుండాల్లో దుకుండు తప్పేటట్టు లేదు. వీళ్లకు జీహెచ్ఎంసీ ఓట్లకు వీరికే సంబంధం అంటరా ? అయితే ఈ వీడియో చూసేయుండ్రి..

Monday, January 18, 2016 - 20:58

జీహెచ్ఎంసీలో ఓట్లంటే నేతలకు తమాషా అయిపోయినయి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవాడు జరసేపటికి ఇంకో పార్టీలో తేలుతున్నడు. అరగంటలోనే నిర్ణయాలు కూడా మార్చేసుకుంటున్నరు. నిన్న బంగారు తెలంగాణ అన్న లీడరు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటూ రకరకాలుగా మాట్లడుతున్నరు. ఒక్క నాలికతో ఎన్ని చిత్రాలు చూడండి ఈ వీడియోలో చూడండి. 

Monday, January 18, 2016 - 20:51

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నో హామీలు గుప్పిస్తుంటరు కదా..కానీ ఆ హామీలు అమలైందా ? ఏమో తెల్వదు అంటరు కదా. అలాంటిదే ఇది కూడా పాలమూరు జిల్లాలో గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటించిండు. జనవరి 18వ తేదీన పాలమూరుకు వెళ్లిండు. బస్తీ జనం బాధలు కరిగిపోయిన కేసీఆర్ హమీలు గుప్పించిండు. స్ట్రీట్ లైట్లు, మోరీలు, నల్లాలు, ఇళ్లు ఇలా హామీలు ఇచ్చిండు. అంతేగాక...

Monday, January 18, 2016 - 20:36

జనవరి 18వ తేదీన సీఎం కేసీఆర్ పాలమూరుకు వెళ్లి వచ్చి సంవత్సరం దాటింది. కానీ అక్కడ ఆయన ఇచ్చిన హామీ అలానే ఉండిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థుల ఆవేదన. ఉత్తమ్..కిషన్..రేవంత్ రెడ్డిల ముగ్గురు ఆట ఉంటుందా ? తెలంగాణ రాష్ట్రం కళాకారుల పరిస్థితి...కొమరంవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు..సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ...నెల్లూరులో...

Monday, January 18, 2016 - 20:17

'సారూ..నా భూమి కబ్జా చేసిండ్రు' అంటూ ఓ వ్యక్తి 'మల్లన్న' ఎదుట వాపోయిండు. టెన్ టివిలో ప్రసారమయ్యే 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో నల్గొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వచ్చిండు. తన గోస వెల్లబోసిండు. 1992లో కొన్న భూమిని కొందరు కబ్జా చేసేశారని వాపోయిండి. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు..అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని తెలిపిండు. చివరకు మంత్రి కేటీఆర్...

Friday, January 15, 2016 - 20:35

బంగారం..డబ్బు..ఇతరత్రా వస్తువులు దొంగతనం జరుగుతుంటాయి. కానీ గిదేంది కొండచిలువను దొంగతనం చేసిండు ఏందీ అనుకుంటున్నరు కదా..అవును ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కొండచిలువనే దొంగతనం చేసిండు. ఓ జంతువుల దుకాణంలోకి వచ్చిండు. ఎవరూ చూడడం లేదనుకుని అమాంతం కొండచిలువను ప్యాంట్ లో వేసుకున్నడు. కానీ సీసీ కెమెరా అంతా చూసి రికార్డు చేసేసేంది. ఇంకేముందు పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టిండ్రు....

Friday, January 15, 2016 - 20:31

ఏనుగు పాటలు పాడడం ఏందీ ? అసలు మాటలే రావు ఇంకా పాటలు పాడేదేంది అంటారా ? ఈ వీడయో చూస్తే మీకే తెలుస్తది. తమిళనాడులో ఉన్న ఓ ఏనుగు పాటలు పాడుతోంది. ఓ గుళ్లో ఇది ఇలా చేస్తుందంట. ఇక మరో ఏనుగైతే స్టెప్పులేస్తోందంట. మనుషులకే కాకుండా జంతువులకు కూడా సంగీతంపై మక్కువ ఉందని తెలుస్తోంది. మరి ఈ ఏనుగులు ఎలా చేస్తున్నాయో వీడియో చూడుండ్రి.

Friday, January 15, 2016 - 20:29

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక అంశాలపై మస్తు మాట్లాడిండు. అనేక హామీలు కూడా ఇచ్చిండు గుర్తుండే ఉంటుంది కదా. అందులో ముఖ్యమైంది ప్రత్యేక హోదా. ఐదేండ్లు కాదు..పదేండ్లు ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేసిండు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమన్నడో చూడండి.

Friday, January 15, 2016 - 20:27

పెట్రోల్, డీజీల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంపు..తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న అమలు ఏమైంది ? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కూడా చెప్పిండు. కానీ ఇవన్నీ చేయలేదు. ప్రత్యేక హోదాపై సీఎం బాబు ఆనాడు ఏమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు ? ఫోన్ కంపెనీల కుట్ర…ఫేస్ బుక్ జుకర్ బర్గ్ ఫ్రీ బేసిక్స్ అమలు..ఆర్టీఏ అధికారుల దోపిడి..పాటలు పాడే ఏనుగు. కొండచిలువ...

Friday, January 15, 2016 - 20:19

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీ యాదికి ఉందా ? అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12 రిజర్వేషన్ అమలు చేస్తనన్నడు. కానీ ఇప్పటికీ ఆ హామీ నీటి మూటగానే మిగిలింది. అంతేగాదు గిరిజనులకు కూడా ఇస్తనని చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది. ఏమన్నా అమలయ్యాయ్యా ? దీనిపై ముస్లిం నేతలు ఏమంటున్నరో వీడియో చూడండి..

Thursday, January 14, 2016 - 20:25

సంక్రాంతి అంటే ఏమిటీ ? మూడు రోజుల పాటు పండుగ ఎందుకు నిర్వహిస్తారు. ఈ అంశంపై టెన్ టివి మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో 'మల్లన్న' వివరించారు. భోగి మంటలు..చిన్నారులపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు ? అలాగే రంగు రంగుల ముగ్గులలు..హరిదాసులు గంగిరెద్దులు..పిండివంటలు కథ..సంక్రాంతికి నల్లనువ్వులతో తర్పణం..సంక్రాంతి పండుగలో వచ్చే కనుమ ఎందుకు చేస్తారు ? సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటలు.....

Wednesday, January 13, 2016 - 20:41

ఎంపీ మల్లారెడ్డి స్టైలే వేరు. ఇటీవలే ఓ ఫంక్షన్ లో గంగ్నమ్ డ్యాన్స్ చేసింది తెలిసే కదా. అంతేగాక మల్కాజ్ గిరిలో నిర్వహించిన ఓ సభలో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇది విన్న నేతలు..జనాలు అప్పట్లో నోరెళ్ల బెట్టారు. కేసీఆర్ దేవుడు అని పొడిగారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యాన కేసీఆర్ కాస్తా శని అయ్యాడంట. ఆయన అప్పుడు ఏమన్నారో..ఇప్పుడు ఏమన్నారో వీడియోలో చూడండి. 

Wednesday, January 13, 2016 - 20:38

నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు పతంగులపైకి ఎక్కింది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు..ఉభయ రాష్ట్రాల సీఎంల వ్యవహార శైలిలో మార్పులు..జీహెచ్ంఎసీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ ప్రకటించింది...మల్కాజ్ గిరి ఎంపీ గతంలో కేసీఆర్ పై పొగడ్తలు..ఇప్పుడు తిట్లు..కేసీఆర్ ను కలిసిన మహరాష్ట్ర నేత శరద్ పవార్..తెలంగాణలో మద్యం ఆదాయం అధికం..జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం తదితర అంశాలపై టెన్ టివి '...

Wednesday, January 13, 2016 - 20:21

ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఎలా ఉండే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లాగా ఉండే. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుండే. ఓటుకు నోటు కేసు గుర్తే కదా. ఆ కేసు బయటపడినప్పుడు ఈ ఇద్దరు సీఎంలు ఒకటే తిట్టుకున్నరు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ ఇద్దరు ఎక్కడ తిట్టుకోవట్లే. మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బిజెపి బహిరంగసభ నిర్వహించింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్...

Tuesday, January 12, 2016 - 20:32

నారాయణఖేడ్ ఉప ఎన్నిక..జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లు ఆశా వాహులు..సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీల వసూలు..ఏపీలో చంద్రన్న కానుకలో చమత్కారం..దొంగోడికి కీర్తి..పోలీసుల ఇజ్జత్ పోయింది..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం..గెలుపు గుర్రాలను ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతామన్న ఉత్తమ్... అత్తను చంపుదామని చూసిన కోడలమ్మ..సంక్రాంతి పసందైన పాట..దొంగోడికి అరటిపండ్లు తినిపించిన...

Monday, January 11, 2016 - 20:33

గత కొద్ది రోజులుగా ' టెన్ టివి మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఇతరులతో ముచ్చట్లు చెబుతానన్న 'మల్లన్న' మాట నిలబెట్టుకున్నాడు. ఉప్పల్ కు చెందిన విజయ్ తో మల్లన్న ముచ్చట్లు పెట్టాడు. దుబ్బాక సర్కార్ లో తాను చదువుకున్న స్కూల్ నిర్మాణానికి ముగ్గు వేసిన సీఎం కేసీఆర్..మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్..జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు...క్యాడెంట్ల కొంప ముంచిన రిజర్వేషన్లు......

Friday, January 8, 2016 - 21:45

ఎక్కడియక్కడ బయటవడ్డ రిజర్వేషన్ల లెక్క.. వచ్చే నెల రెండు నాడు ఓట్లు… ఐదునాడు లెక్కిపు... పోరగాళ్లను పొర్కపొర్కగొట్టిన పోలీసోళ్లు..నడిమిట్లొళ్లకు చుట్టుకున్న లవర్స్ పంచాయతీ, జీహెచ్ ఎంసీని గెలికి ఆగమైన అంబాజిడర్… హైకోర్టు మాటలతోటి ప్రతిపక్షాలకు జోష్, పేరు మార్సుకున్న టీఆర్ ఎస్ పార్టీ.. భీమవరంల పోటీజేస్తంటున్న కేటీఆర్, చంద్రాలును చండాతున్న బైరెడ్డి… కాక్ బుల్స్ స్టోరీ...

Thursday, January 7, 2016 - 21:23

ఓట్ల నాటకం మొదలువెట్టిన ఏశకాల్లు...వస్తే సంగతిజెప్తమంటున్న బస్తీ జనం, చండీయాగం తర్వాత శరవేగమైన పనులు.. ఆగకుండ అభివృద్ధి చేస్తున్న చంద్రయ్యలు, సెంచల్ గూడ జైలుకు ఒన్నెతెచ్చిన నాయిని..ఈ జన్మల పాపం.. ఈ జన్మలనే పరిహారం, దొంగతనం చేసినప్పుడే దొరుకుతున్న దొంగలు.… ఏడుకొండల ఎంకన్నతో మజాక్ పని.. కొండ మీద కొలువుదీరిన కోటర్లు.. సింగం 4 సినిమాకు రెడీ అయిన ఆనం...డైరెక్టర్ల దృష్టికి...

Wednesday, January 6, 2016 - 21:31

వరంగల్ మీద కేసీఆర్ వరాల జల్లు.. అప్పటి వరాలకు అదనంగా హరివిల్లు, మళ్ల ఉద్యోగులను గిచ్చుతున్న చంద్రాలు...తిట్టుకుంటనే భయపడుతున్న ఆఫీసర్లు, ప్రతిపక్షాలను కట్టేశి కొడ్తున్న టీఆర్ఎస్…  జీహెచ్ ఎంసీ ఓట్లళ్లల సర్కార్ వారి ఆట, కొత్తగూడెం ఎమ్మెల్యేగారి చెత్త పని, ఇండ్ల దరఖాస్తు కాడా ఇరుసుక పడ్డ జనం, ఆంధ్రల అప్పుడే సుర్వైన సంక్రాంతి... అందంగా ముస్తాబైన పల్లెటూర్లు, ఒల ఒల ఏడ్చిన ఒబామా...

Tuesday, January 5, 2016 - 20:11

హైదరాబాద్ : అయ్యది ఒక మాట... కొడుకుది మరోమాట.. జీహెచ్ఎంసీ ఓట్ల కోసం పార్టీలో కొట్లాట. భూపాలపల్లి ఇక భూతల స్వర్గమే... పెద్దమ్మ కథ చెప్పిన కేసీఆర్ సార్. ఏడు కొండల వెంకన్నకు అగ్ని పరీక్ష. కొండెక్కిన కోడెల సార్... రోజమ్మ పంచాయతీ. తీరా ఇంటికి చేరిన తీర్థయాత్రీకుడు... మనసిప్పక మాట్లాడిన మల్లాది... పశువుల కాపరులను మింగిన ముసళ్లు... మెదక్ జిల్లా పుల్కలోళ్లకు...

Monday, January 4, 2016 - 20:54

వరంగల్ వరాలకు సరిగ్గా ఏడాది.. ఈంచుగూడా ఇటటు జరగని అభివృద్ధి, హైదరాబాద్ లో ఉడుకుతున్న రాజకీయం.. ఓట్ల పన్లవడ్డ రాజకీయపార్టీలొళ్లు, పొగతాగడం ఆరోగ్యానికి ఆరోగ్యకరం.. కొత్తముచ్చటచెప్పిన బాలికకియ్య,  రౌడీ అవతారంలో దర్శనమిచ్చిన రాజాసింగ్... కార్యకర్తను ఆగంజేయమని దొంగనాటకం, భారతదేశం మీదుబాదుకు ఒనికిన భూమి.. కోట్ల రూపాయలు భూమి పాలుజేసిన భూకంపం, వెండితెరమీదికి రాబోతున్న రోజక్క జీవితం...

Saturday, January 2, 2016 - 20:29

హైదరాబాద్ : చలికాలం లేటుగా అయినా లేటెస్టుగా వచ్చింది. పట్నాల్లో కాస్త తక్కువగా ఉన్నా… వూర్లల్లో మాత్రం వణికిస్తోంది. ఆన్ లైన్లో కోళ్ల అమ్మకాలు... 20వేల రూపాయల కొట్లాడే కోడి....కర్జూర కల్లు… దానిమ్మ కల్లు, పోతులూరు బ్రహ్మంగారిని ఎందుకు అందరూ తలుచుకుంటున్నారు.… తల్లి ప్రేమను చాటుకున్న ఏనుగు, భారతదేశంలో సిగిరెట్లు తాగే ఆడోళ్లు ఎక్కువవుతున్నారట… లేటు వయసులో...

Friday, January 1, 2016 - 20:07

హైదరాబాద్ : కొలువుల తలుపులు తెరిచిన సర్కారోళ్ళు… ఉత్తమాట చేయకంటున్న పోరాగాళ్ళు… పొగడ్త కోసం తిట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యే, మైకు ఇరగ్గొట్టి మరీ వెళ్లిపోయిన గాంధీ, దుమ్ము లేచిపోయిన న్యూఇయర్ పండుగ - హైదరాబాద్ లో అదరగొట్టిన పడుచు పిల్లలు, పోలీసోళ్ల మీద వాలుతున్న పావురాళ్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అల్లుతున్న అస్సలు కథ, తాగమని పైపులు పెడుతున్న ట్రాఫికోళ్ళు...కొత్త సంవత్సరం...

Pages

Don't Miss