మల్లన్న ముచ్చట్లు

Wednesday, January 17, 2018 - 20:35

తెలంగాణల పుట్టుడే పాపమైందా ఎట్ల నీ అరెస్టులు పాడుగాను.. మీ చేతులకు జెట్టలు వుట్ట.. అరే అడ్గితె అరెస్టులా..? ప్రజలకు అడ్గే హక్కుగూడ లేదా ఎట్ల..? అద్దంకి దయాకర్ అరెస్టు.. ఓయూ విద్యార్థులు అరెస్టు.. మందక్రిష్ణ మాదిగ అరెస్టు.. వంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు.. ఇట్ల ఎంతమందిని అరెస్టు జేస్తరు ముఖ్యమంత్రిగారూ..? ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా ?

జిగ్నేష్ మేవానీ.. గుజరాత్...

Tuesday, January 16, 2018 - 20:35

రెండువేల ఇర్వై ఆరు దాక తెలంగాణ, ఆంధ్రల నియోజకవర్గాల పెంపు ముచ్చటనే ఉండది అని మొన్నటిదాక కేంద్రమోళ్లు మొత్తుకున్నరు.. ఈడ రాష్ట్రాధిపతులు మాత్రం.. పెంపు ఖాయం.. త్వరలో పెంపు అని చెరికల కార్యాన్ని సజావుగ నడ్పుకున్నరు... ఇంతకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెర్గుతయా.. లేదా.?. ఇయ్యాళ బీజేపీ మన్సుల ఏమున్నది..? ఒక్కపారి జూద్దాం..

ఒక ముచ్చట రైతులను చాల కన్ఫ్యూజ్ జేస్తున్నది.....

Saturday, January 13, 2018 - 20:09

తెల్గు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రథ సారధుల కథ గమ్మతున్నది.. ఆంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి.. తెలంగాణ హ్యాండ్ బాస్.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మీద పెద్దపెద్ద బ్రేకింగ్ ప్లేట్లేశి వార్తలేశిండ్రు ఏంది దీని మత్లావు..? కోడి పందాలు.. ఈ ముచ్చట లేకుంటే ఆంధ్రల సంకురాత్రి పండుగనే ఉండది.. ఈ తెలంగాణ రాష్ట్రంల ప్రజలది గాని సంపద ఏదున్నా అది ప్రభుత్వానిదే అంతేనా..? భూములైనా...

Friday, January 12, 2018 - 20:22

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కత్తి స్టార్ కత్తి మహేష్.. ఇద్దరి పంచాదిలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంటరైపోయింది.. నీది పవనిజం అయితే మాది కత్తిజం అంటున్నరు.. మా దళిత బిడ్డ కత్తి తెర్వొస్తె కారం బెడ్తం అని హెచ్చరిస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ.. నిన్న ఓయూకు వొయ్యిన కత్తి మహేస్కు ఖతర్నాక్ వెల్కం జెప్పిండ్రు..గీ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

Friday, January 12, 2018 - 20:19

మనకు ఏడనన్న అన్యాయం అయితే.. కోర్టుకు వోతం.. ఆడగూడ న్యాయంగాకపోతె..ఫలితాలు రాకముందుకే ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ కరెంటి ముచ్చట్ల..చెర్వుమీద కొంగ అల్గితె.. చెర్వుదెండుతదా.?? కొంగదెండుతదా..? ఆ నాగం జనార్థన్ రెడ్డి గారు గూడ.. బీజేపీ కమలానికి కాటు వెడ్తున్నట్టే ఉన్నడుగదా? ఏయ్ మా కేటీఆర్ను తిడ్తరా మీరు..? కబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా అని టీఆర్ఎస్ పార్టోళ్లు..పవర్ స్టార్ పవన్...

Thursday, January 11, 2018 - 20:19

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది..మరి బ్రహ్మంగారు భవిష్యత్తుల ఏం జర్గుతదో ముందే ఊహించే చెప్పె మన్షి.. అగో చంద్రాలు గూడ అట్లనే జెప్తున్నడు రేపు ఏం జర్గబోతున్నదో ముందే ఆలోచన జేశి ముందు సూపుతోని ముంగటికి వోతున్నడట.. కావాల్నంటే సారే జెప్తడు వీడియోలో ఇనుండ్రి..

Thursday, January 11, 2018 - 19:54

బహుష కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారే .. ఇప్పుడు చంద్రబాబు రూపంల మళ్ల భూమ్మీదికొచ్చిండా ఏంది..? కాకపోతేంది.. ఇన్నొద్దులు ఉల్వశేన్ల వొడగొట్టుకోని కంది చేన్ల ఎంకులాడుకుంటొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్ర దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ అణిముత్యం శ్రీ మాణిక్యాల రావు ఏమంటున్నడంటే.. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నెంబర్ అని అనెతందుకు లోకేశం ముచ్చట్లు సరిపోయినయ్ ఇయ్యాళటికి.. జబర్దస్త్...

Wednesday, January 10, 2018 - 20:54

అయ్యా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారూ.. మీకేమన్న శీమునెత్తురు ఇజ్జత్ మానం.. శిగ్గుశరం ఉన్నయా సారూ..? మన్షివేనా నువ్వింతకు..? అది నాల్కెనా తాటిమట్టనా..? ఒక ప్రభుత్వ అధికారిని వట్కొని నీ అమ్మమొగనికి ఫోన్ జేస్తున్నావ్ రా అని తిడ్తవా..? లేదు సారు మీ అమ్మకే ఫోన్ జేస్తున్నా అని ఆ అధికారి సమాధానం ఇస్తె ఏమన్న శిగ్గు ఉంటుండెనా నీది..? నీ బల్పు బండకేశి కొట్ట..గీ ముచ్చట జూడాలంటే...

Tuesday, January 9, 2018 - 20:39

 

పాపం కోమటిరెడ్డి చిన్నరెడ్డి పెద్ద రెడ్డి ఆశల మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కుడ్ది గుమ్మరిచ్చింది.. అగో వస్తున్నది మాకే పీసీసీ.. వచ్చే పాయే.. ఏనుగెల్లింది తోకజిక్కింది అని నిన్నమొన్నటిదాక ఎంటుండె దండుకు చెప్పుకుంటొచ్చిన అన్నదమ్ములకు ఇప్పుడు కార్యకర్తల ముంగట మొఖం చిన్నబుచ్చుకున్నట్టైందట.. మరి మళ్లిప్పుడేం జెప్తరో అని అసక్తిగ జూస్తున్నరు అభిమానులు..

ఓదిక్కు...

Monday, January 8, 2018 - 21:47

పేపర్ల రాశి జనం మీదికి ఇడ్సిపెట్టెటోడుండాలేగని.. ఈ భూమిని.. దాని మీద మన్సులను నేనే తయ్యారు జేశ్నాని చెప్పుకున్నా చెప్పుకుంటడు.. చంద్రాలు.. ఇప్పుడు జెప్తలేడా..? ప్రపంచంలొస్తున్న ప్రతి మార్పుకు నేనే తల్లిని.. నేనే తండ్రిని అని చెప్కతిర్గవట్టే.. ఇప్పుడు క్రీడారంగం మీద వడ్డడు.. మరి అండ్లేంత గప్పాలు గొడ్తున్నడో సూడుండ్రి..

ఆంధ్రల చంద్రబాబేశిన.. జన్మభూమి కమిటీలు.. తెలంగాణల...

Saturday, December 30, 2017 - 20:32

ఐసీస్ ఉగ్రవాదుల కంటే ఎక్కువ మోపయినయ్ గద వీధి కుక్కలు...పాత నల్గొండ జిల్లా మొత్తం అవిటి వ్యవహారం నడుస్తున్నట్లే ఉంది గదా...మిర్యాలగూడ దిక్కు 20 మందిని కరిచి సత్తా చాటినయంట. ఆత్మకూరు మండలంలో కూడ పది మందిని కరిచి ఆడ వాళ్ల ఉనికిని చాటుకున్నయంట. కుక్కల సంగతేంటో వీడియో క్లిక్ చేయండి. 

Saturday, December 30, 2017 - 20:28

టెన్ టివి ప్రజల కోసం..వారి అన్యాయాన్ని బాహ్యాప్రపంచానికి చూపెట్టేందుకు నిరంతరం కృషి చేస్తోంది..అందరికీ న్యాయం కావాలన్నదే టెన్ టివి లక్ష్యం..మంథని లో దళితుల బహిష్కరణపై టెన్ టివి గొంతెత్తి నినదించింది....పేరుకు మద్యపాన నిషేధం..ఆ శాఖలు ఏం చేస్తున్నయి..పాత నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది...మల్లన్న అడిగే ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పింది ఎవరు ? ఇవాళ్టి ప్రశ్న.....

Friday, December 29, 2017 - 21:55

తెల్గురాష్ట్రాలళ్ల రాజకీయ పార్టీలు ఆడిన నాట్కానికి అమాయక జనం ఎట్ల బలైపోతున్నరో సూడుండ్రి.. వాళ్ల ట్రాపుల వడి.. ఎవ్వని శవాన్ని వాడే బుజం మీద ఏస్కోని పోతున్నడు.. కుట్రలను మాత్రం పశిగట్టలేకపోతున్నరు పేదలు.. ప్రజల నడ్మ ఎప్పుడు తాకులాటలు వెడ్తెనే ఈ అగ్రవర్ణ పార్టీలకు పట్టుంటది గావట్టి వాళ్లు ఎంత గొప్ప కుట్రలు జేస్తరో జర గమనించుండ్రి ప్రజలారా..

సూశిండ్రా ప్రజలారా..?...

Thursday, December 28, 2017 - 20:15

ఒకవేళ ఈ ముచ్చట నిజమే అయితే మట్టుకు.. తెలంగాణలున్న తాగువోతులకు ఇదో పండుగ దినం అన్నట్టే..చలో అన్నట్టే మళ్లొక ఉద్యమాన్ని తయ్యారు జేశిండు మంద క్రిష్ణ మాదిగ.. జనవరి ఒక్కటి సంది.. కాంగ్రెస్ పార్టీ వుట్టి నూట ముప్పై మూడు ఏండ్లైందట.. మన్షిని మన్షిగ గుర్తించలేని శాస్త్రాన్ని తల్గవెట్టుడు గాదు పాతిపెట్టాలే అంటున్నడు తమ్మినేని వీరభద్రం సారు.. ఒక వడ్డెరోళ్ల బిడ్డను శీతగోసవెడ్తున్నరట.....

Thursday, December 28, 2017 - 20:13

కాంగ్రెస్ పార్టీ వుట్టి నూట ముప్పై మూడు ఏండ్లైందట.. ఇయ్యాళ పుట్టినదినం జేశిండ్రు దేశమంతట.. దేశమంత ముచ్చటమనకెందుకుగని.. గాంధీభవన్ కథ జూద్దాం పాండ్రి.. జెండా ఎగిరేశినంక మేమంత ఐక్యమత్యంతోని కల్సిమెల్చి ముంగటికి వోతున్నమని చెప్పిండ్రు.. ఓదిక్కు ఈ ముచ్చట చెప్తుండంగనే.. ఐకమత్యంతోని ఒకల్నొకలు నూకేసుకున్నరు..

 

Wednesday, December 27, 2017 - 20:41

దొంగది గాదు దొడ్లకు రాదన్నట్టు.. ఆ బట్టెవాయి మాటలు ఎందుకు మాట్లాడాలే మళ్ల ఎందుకు మత్పరియ్యాలే జనగామా ఎమ్మెల్యేగారూ..? విద్యల రిజర్వేషన్లు తీశేయాలని కుద్దుగ అంటివి మళ్ల.. డ్యాష్ కథలు వడవడ్తివి నేను అట్ల అనలేదు.. చేయలేదని.. ఒక్కదినంలనే మాటమార్చెటోనివి నువ్వు ఎమ్మెల్యే పదవి శిగ్గుదీస్తున్నవ్ గదా..? ప్రజలారా సూడుండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాగోతం..

Wednesday, December 27, 2017 - 20:40

అబ్బ మొత్తం మీద సర్కారు ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముంగట దోషిగ నిలవడక తప్పలేదు సూడుండ్రి.. మంద క్రిష్ణ మాదిగనే అరెస్టు జేశి ఆరు రోజులు వట్టి జైళ్ల వెట్టిన ప్రభుత్వం.. బెయిల్ రాకుంట శాతనైన కాడికి బాగనే తన్లాడింది.. కని ఎట్టకేలకు బెయిల్ మంజూరై బైటికొచ్చిండు.. ఇగ మరి సర్కారు మీదికి యుద్దానికి తయ్యారైతున్నడా..? కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జెప్పవోతున్నడనేది సూద్దాం..

తెలంగాణ...

Tuesday, December 26, 2017 - 21:10

తెలంగాణ, ఆంధ్ర రెండు తెల్గు రాష్ట్రాలళ్ల.. బీసీలు జర్ర హుషారుకొచ్చినట్టే అనిపిస్తున్నది.. ఇద్వరకు ఎవ్వలి కులం వాళ్లకు.. ఎవ్వలి సంఘం వాళ్లకుండేది.. కని ప్రభుత్వాల నిర్ణయాల పుణ్యమాని.. బీసీలంత కులాలను పక్కకు వెట్టి.. మేమంత ఒక్కటే అనేకాడికొచ్చింది.. ఈ వచ్చిన చైతన్యం ఓట్ల పెట్టె దాక ఉంటే.. ఇగ బీసీలను ఆపుడు ఎవ్వలితరం గాదు..

ఏంరా వారీ గట్ల తిర్రి తిర్రి జేస్తున్నవ్.....

Monday, December 25, 2017 - 20:33

ప్రజలారా ఒక్కటి బాగ గమనించుండ్రి.. ఈ భూమ్మీద ఏ బిడ్డైనా తల్లి కడ్పులకెళ్లే జన్మిస్తడుగదా..? తల్లి కడ్పుల కెళ్లి బైటికి రానంత సేపు వానికి కులం అంటుతదా..? బైటికి రాంగనే కులం అంటుకుంటది.. మనుధర్మ శాస్త్రం అనేది ఎంటవడి వానికి కులాన్ని తలిగిస్తది.. బాపనోళ్లంల తల్కాయలకెళ్లి వుట్టిండ్రట.. పరిపాలించెటోళ్లు బుజాలళ్లకెళ్లి వుట్టిండ్రట.. కోమటోళ్లు తొడలళ్ల కెళ్లి వుట్టిండ్రట.. ఇగ...

Saturday, December 23, 2017 - 20:45

తెలంగాణ జేఏసోళ్లు వెట్టిన అమరవీరుల స్పూర్తి యాత్ర ఇయ్యాళ గూడ జోరుగనే అయ్యింది.. నిన్న నల్లగొండ కాడ బహిరంగ సభ వెట్టిండ్రు.. దానికి మంది బాగనే వచ్చిండ్రు.. ఇగ అదే జోషుతోని ఇయ్యాళ సూర్యాపేట కాడ గూడ సభ వెట్టిండ్రు.. మొత్తం మీద జేఏసీ మాత్రం ప్రతిపక్షాల కంటె ఫాస్టుల ప్రజలళ్లకు వోతున్నట్టనిపిస్తున్నది..

తెలంగాణ ప్రభుత్వ మన్సులు మంత్రులు గానీ.. ముఖ్యమంత్రిగానీ.. ఏడ...

Friday, December 22, 2017 - 21:30

జేఏసీ చైర్మన్ కోదండరాం సారు మొండిపట్టోడే ఉన్నట్టుండుగదా..? యాత్రలు జేయనియ్యం అడ్డుకుంటమని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని శిక్కులు వెట్టినా.. అమరుల స్పూర్తి యాత్ర జర్గవల్సిందే.. మేము ప్రజలళ్ల తిర్గవల్సిందే అన్నట్టు.. మళ్ల సుర్వు జేశిండు యాత్ర.. ఇయ్యాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాల అయితున్నది.. 

ఏయ్ అనంతపురం పోలీసులు.. ఏం తమాష జేస్తున్నరా..? నేను జేసీ ప్రభాకర్ రెడ్డిని.. నా...

Wednesday, December 20, 2017 - 21:41

తెలుగు తప్పని సరిమీద జనం కన్నెర్ర, పితృవియోగ నేతను పల్కరిచ్చిన సీఎం, మందక్రిష్ణ అరెస్టు మీద రగులిన ఎమ్మార్పీఎస్, మంత్రాలు జేస్తున్నదని చేశిండ్రు మర్డర్, పగటీలే ఇంట్లకు జొర్రిన చిరుత పులి...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...  

 

Tuesday, December 19, 2017 - 20:36

గుజరాత్ లో దిగజారి గెలిచిన కమలం...వికాస్ మాకొద్దన్న యాభై ఒక్కశాతం జనం, బీజేనీ, కాంగ్రెస్ను చుచ్చువోపిచ్చిన జిగ్నేష్... ఇండిపెండెంట్ గా గెలిచిన దళిత యువకుడు, ఏట్లె రాయిదీయని మేడం కూటికాడికి వాయే..షూగర్ ఫ్యాక్టరీ మర్శి ఖమ్మంల దిగిన కారు మేడం, రైతులకు గుబులు రేపిన గులాబీ పురుగు...నకిలీ పత్తి ఇత్తునాల కంపిని మీద చర్యలేవి?, మూడు రోజుల సంది తానాలు బందు...ట్యాంకరొచ్చిన నాడే...

Saturday, December 16, 2017 - 21:33

నేరేళ్ల బాధితులకు తప్పని తిప్పలు...కలెక్టర్ ఆఫీసుల ఆత్మహత్యాయత్నం, ముప్పై ఎన్మిది వేల ఉద్యోగాలిచ్చినం..తలసానిగారూ.. అవ్వతోడు నిజమేనా?, మైసమ్మ గుడి మీద మానవుల దాడి...ఘట్ కేసర్ కాడ గలీజు గాళ్ల పని, అంబులెన్సును ఆపేశ్న పోలీసులు...వైద్యం అందక అండ్లున్న పేషెంటు మృతి, ఐపీఎస్ ఐడీ కార్డేసుకున్న అవారాగాడు..ట్రైనింగ్ కోసం జైలుకు వంపిన పోలీసులు, నాగుంబాముకు.. జెర్రిపోతుకు పెండ్లి.....

Saturday, December 16, 2017 - 07:55

సర్కారు బడిలె సద్వు జెప్పె పంతులు పదవికోసం.. టెట్టు పాస్ గావాలె..హోంగార్డుల మీద వరాల వాన అనంగనే పాపం వాళ్లుగూడ పాల ప్యాకెట్లు బాగనే గొన్నరు... ఎన్ కౌంటర్.. ఇది పేరుకే ఇరువర్గాల నడ్మ కాల్పులు.. ఎదురుకాల్పులు అనిపిస్తదిగని.. ఆడ ఏముండది..పార్టీ అధిష్టానం మాటలు వట్టిచ్చుకోకుంట ఎవ్వలు వ్యవహరించినా ముమ్మాటికి తప్పై అయితది అంటున్నడు విద్యావంతుడు.. నాగార్జున సాగర్ కట్టకు గులాబీ...

Thursday, December 14, 2017 - 20:20

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. మీరు గడ్కోపారి మనది ధనిక రాష్ట్రం.. మనది సంపన్న రాష్ట్రం అని సూరత్ లేని మాటలు జెప్పకుండ్రి సారు.. శిగ్గనిపిస్తున్నది ఆ మాటలు ఇంటుంటే.. ఓదిక్కు ధనిక రాష్ట్రమని మీరు ప్రగతి భవన్ల బాతాలు జెప్తుంటరు.. ఇంకో దిక్కు అసెంబ్లీల అధికార లెక్కలేమో అప్పులళ్ల జిక్కిన రాష్ట్రమని తేల్తది... ఏంది సారూ మీ తమాష..?

ప్రజలను ఎట్ల మోసం జేయాలనే ముచ్చట్లు...

Pages

Don't Miss