మల్లన్న ముచ్చట్లు

Wednesday, March 1, 2017 - 20:32

ఇండ్లళ్ల సంసారం ఎల్లి ఎల్లక సతమతమైతున్నోళ్లు బాగ జూడాలే ఈ ముచ్చట.. పిట్రోల్, డీజిల్ ధరలు పెంచి పెంచి పెంచి ధమ్మొచ్చినట్టుంది ఆయిల్ కంపినోళ్లకు.. ఇప్పుడు జనం సమురు దీస్తందుకు గ్యాస్ బుడ్ల ధరలు వెంచిండ్రమ్మా..? అచ్చేదిన్ కోసం ఎదురు సూస్తుంటిరిగదా.?. ఇగో వంటింట్లదాకొచ్చింది అచ్చేదిన్ అందుకోండ్రి మరి.. మరిన్ని ఘరం ఘరం మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

Tuesday, February 28, 2017 - 20:49

జనం పాణాలు దీస్తున్న బస్సులు.... సంపాదనే కావాలంటున్న బాసులు, పురిటినొప్పులకు దూరమైన తెలంగాణ.. సిజేరియన్ ఆపరేషన్లల రాష్ట్రమే ఫస్టు, ఏజెన్సిలపొంటి గిరిజనుల కష్టాలు.. ఎండాకాలం రాకముందే నీళ్ల బాధలు, మహిళా సర్పంచిని తిట్టిన గంగాధర ఎస్సై... కమిషనర్ కు కంప్లైట్ చేసిన గ్రామస్తులు, పిన్ లాండ్ పిల్లతోని తెలంగాణ పోరని పెళ్లి... దండలు మార్చుకుని దంపతులైర్రు, దేవున్ని కిడ్నాప్ జేసిన...

Monday, February 27, 2017 - 20:52

నాలుగు వేల నామినేటెడ్ పోస్టుల భర్తీ... అందుకోరి కారు కార్యకర్తలు జల్దీ, ఎమ్మెల్సీ కావోతున్న చంద్రాలు కొడుకు..సూడాలె ఎట్లుంటదో లోకేష్ సారు ఉడుకు, పాలమూరు జిల్లాల నీళ్ల కటకట సురువు....గొంతు తడపకుంటే ఉంటదా సర్కారు పరువు, ఆస్కార్ అవార్డు ఇచ్చుడు కాడ ఆగమాగం...నవ్వించవోయి నవ్వుల పాలైన యాంకర్లు, చంద్రాలు ఇలాకాల దయ్యాల పంచాదీ...బాబు గారి ఊరికి జేరని లేటెస్టు టెక్నాలజీ, మూసీ నదిలో...

Friday, February 24, 2017 - 20:48

చలో ఇగ తెలంగాణ ప్రజలారా..? ఇయ్యాళటి నుంచి అంటే శివరాత్రి పొద్దు సంది మీ కష్టాలన్ని తీరిపోయినట్టే.. సర్కారు..సింగరేణి సంస్థ మోసం చేస్తోందా..మా నాయినలు మూడేండ్ల సర్వీసు ఇడ్సిపెట్టి వీఆర్ఎస్ దీస్కున్నరు మరి మా సంగతేందంటున్నరు..మనం అప్పుడప్పుడు పోలీసోళ్లను మస్తు బనాయిస్తుంటం అట్ల జేస్తరు ఇట్ల జేస్తరు అని కని.. పోలీసోళ్లు గూడ అప్పుడప్పుడు మంచిపనులు జేస్తుంటరు..చెయ్యి ఇర్గినోనికి...

Thursday, February 23, 2017 - 21:47

ర్యాలీ గెలుపోటముల మీద పోస్టుమార్టం... ఫ్లాపన్న సర్కార్... సక్సెస్ అన్న జేఏసీ, పోలీసు మంత్రికే దెల్వని అరెస్టులు...నామూషిగ మాట్లాడుతున్న నాయిని, 
ఓట్ల కోసం పైకం పంచుతున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలల కమలం కథ, ఇండియాకు రాను... ఈడనే ఉంటా...మంకుపట్టుపడుతున్న విజయ్ మాల్యా, రెండు వందల కడితే ఎయిడ్స్ రోగం మాయం.. నెల్లూరు జిల్లాల తేలిన కొత్తరకం డాక్టరు, కల్లు తాగితే కాన్సర్...

Thursday, February 23, 2017 - 10:21

నాగుపాము తల్కాయల నాగమణి అనే రాళ్లుంటయా..? ఆ రాళ్లను చేతి ఉంగురంల వెట్టుకుంటే పాములు గర్వయా..? మస్తు సంపదొస్తదా..? మనం అప్పుడప్పుడు ఈ రాళ్లను అమ్మెటోళ్లను జూశ్నంగదా..? నిజంగ నాగుపాముల కంట్ల పక్కకు ఉండేటియి రాళ్లా..? రత్నాలా..? చింతగింజలా...? ఇంతకు ఇదంత నిజమేనా అనేది తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.

Thursday, February 23, 2017 - 09:58

అబ్బా తెలంగాణ రాష్ట్రంల పోలీసు స్టేషన్లన్ని ఇయ్యాళ కళకళలాడినయ్ పబ్లీకుతోని.. పోలీసోళ్లకు ఇయ్యాల చేతినిండ పని దొర్కింది.. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు గాదని ఎవ్వలన్నరు చెప్పుండ్రి..?నాగుపాము తల్కాయల నాగమణి అనే రాళ్లుంటయా..? ఆడోళ్లకు కోపమొస్తె ఆపుడు కష్టం సుమా..? మరి ఆడోళ్లకు కోపాలు ఏడొస్తయ్.. రోడ్ల పొంట పెట్రోల్ బంకులు జూశ్నంగని.. నీళ్ల బంకులను జూశిండ్రా..? ఒక్క ఆవేశం...

Tuesday, February 21, 2017 - 20:08

హైదరాబాద్ : హైకోర్టు ఆంక్షల నడుమ నిరుద్యోగుల ర్యాలీ...ఆగం ఆగం చేయకుండా చేయాలి ఖాళీ, ఏడుకొండల వాడా అందుకో కానుకలు...అమరుల గోత్రాల మీద దీవినార్తలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసిన చంద్రాలు...ఆరోపణలు రుజువు చేసిన కే.రామచంద్రాలు, బాబుగారి ఇజ్జత్తు తీస్తున్న వర్లరామయ్య....గోటితోని పోయే పంచాయతీ గొడ్డలితో తెచ్చే, మీరే ముఖ్యమంత్రులు అయితే మరి మేము...బహుజనుల...

Tuesday, February 21, 2017 - 07:49

నీళ్లు..నిధులు..నియామకాల కోసం పోరు జరిగింది. కొన్నేళ్ల ఉద్యమాలు..పోరాటాలు..ఆందోళనల తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆనాడు ఇచ్చిన హామీలు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆందోళన నెలకొంది. ఇందుకు ప్రతిపక్షాలు పోరుబాట పడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై ప్రొ.కోదండరాం ఆందోళన చేపట్టారు. 22వ తేదీన నిరుద్యోగ ర్యాలీ జేఏసీ చేపట్టింది. అందులో భాగంగా ఓ పాటను విడుదల చేశారు...

Monday, February 20, 2017 - 20:05

హైదరాబాద్: దుమ్మురేపుతోన్న నిరుద్యోగుల ర్యాలీ పాట...గట్టుమీదకొస్తున్న అన్ని సంఘాలోళ్లు, చేనేత కార్మికులకు పవనాలు చేయూత....మంగళగిరికాడ గర్జించిన జనసేన నేత, మళ్ల తిరుమలకొండెక్కిన గవర్నర్... గడికోపారి రావాలని బుద్ధి కలుగుతున్నదట, ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న ఆంజనేయులు...పాలకొల్లుదిక్కు పనిమంతుని యవ్వారం, పలకా,బలపం పడుతున్న పండు ముసలోళ్లు......

Sunday, February 19, 2017 - 08:39

కొంతమందికి ఉన్నఊరు కన్నజాతి మీద మస్తు ప్రేముంటది.. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా..? ఏంత గొప్పోళ్లు అయ్యినా సరే.. వాళ్ల మట్టివాసన తల్గంగనే పులకరించిపోతరు.. అగో అట్లనే పులకరించింది మన ఖానాపూర్ ఎమ్మెల్యే గిరిజన ముద్దు బిడ్డ రేఖానాయక్ మేడం.. సేవాలాల్ జయంతి పండుగల డ్యాన్సు జేశి పరవశించింది..మేడం డ్యాన్స్ సూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

Sunday, February 19, 2017 - 08:33

మన్సులకు క్షుద్రపూజలు జెయ్యంగ జూశ్నంగని..? పార్టీలకు జెయ్యంగ సూశిండ్రా మీరు ఎన్నడన్నా..? నేనైతె ఎన్నడు సూడలే..? ఏకంగ కుందూరు జానాలు ఎగిరేశిన కాంగ్రెస్ పార్టీ జెండాకు క్షుద్రపూజలు జేశిండ్రంటే.. సూడుండ్రిగ.. మరి జానాలు పనిజేస్తందుకా..? లేకపోతె జానాలు పార్టీని ఆగం జేస్తందుకా అనేది తెల్వదిగని.. మరి ఎక్కడా..ఎవరు చేసిండ్రు..ఇంకా విషయాలకు వీడియో క్లిక్ చేయుండి.

Sunday, February 19, 2017 - 08:28

మొన్న అమరావతి దిక్కు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు అయ్యింది...కేసీఆర్ సారు ఇగ మీకు ఢోకనే లేదు సారూ.. రెండువేల పందొమ్మిదిల మళ్ల మీ పార్టీ అధికారంలకొచ్చెతందుకు అన్ని ఏర్పాట్లు జేస్తున్నడు మన నల్లగొండ ఆణిముత్యం కోమటిరెడ్డి ఎంకన్న..నెల్లూరు పట్నాన్ని ఇడ్సిపెట్టె ముచ్చట్నే లేదు.. నేను ఉంటెనే నెల్లూరు ఉండాలే..? మన్సులకు క్షుద్రపూజలు జెయ్యంగ జూశ్నంగని..? పార్టీలకు జెయ్యంగ...

Saturday, February 18, 2017 - 10:10

తెలంగాణ ప్రభుత్వం ఏ పనిచేసినా ముందట పడ్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేద్దామంటే నిరుద్యోగులు కోర్టులో కేసు వేసిండ్రు. లాంగ్వేజ్ పండిట్లకు అప్ గ్రేడ్ చేద్దామంటే ఎస్ జీ డీలు కోర్టు మెట్లు ఎక్కిండ్రు. గురుకులాల్ల పోస్టులను భర్తీ చేద్దామంటే.. అర్హతల పంచాయతీ కోర్టుకు చేరింది. ఆఖరుకు సింగరేణి వారసత్వ ఉద్యోగుల ముచ్చట కూడా కోర్టుకు చేరింది. ఇంతకు తెలంగాణ ప్రభుత్వం...

Friday, February 17, 2017 - 21:43

ఃఅప్పులు అరవై.. గొప్పలు నూటిరవై... బంగారు తెలంగాణల బరువైన పైకం, నిరుద్యోగుల ర్యాలీకి కదులుతున్న యూత్.. అన్ని జిల్లాలల్ల అంటుకున్న మంటలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు...బ్యాటరీ కారెక్కిన తిరిగిన యువరాజు, ముంగటికెళ్లిచ్చి..ఎనుకటికెళ్లి తీసుకునుడు.. సర్కారు ఉద్యోగాలతోటి ప్రభుత్వం ఆట, సిరిసిల్ల కాడ సీతువలైతున్న పోలీసొల్లు.. పోరని చెయ్యిఇరగొట్టిన కాఖీ బలుపు, బంగ్లాలకు జొర్రిన...

Thursday, February 16, 2017 - 21:21

తమిళనాడు పంచాదీకి ముక్కుతాడు... పళనిస్వామి వారే కుర్చి ఎక్కినాడు, తిరిగి తిరిగి మాట్లాడుతున్న ఆనం వివేక... మందలిచ్చి సొట్లు వెట్టొచ్చిన మల్లన్న, లెక్కలు మరిచిపోయిన ఆలేరు ఎమ్మెల్యే... సేవాలాల్ జయంతి నిధులల పరేషాన్, రాత్రి పూట గడుపుకున్న రావెల... సర్కారుకు హాస్టల్ కాడా మంత్రికి మర్యాద, చెప్పులు ఎత్కవోతుంటే దొర్కిర్రు.. అవే చెప్పులు మడతవెట్టి కొట్టిర్రు, స్టేజిమీదికెళ్లి...

Wednesday, February 15, 2017 - 22:19

ఇండియా ఇజ్జతు నిలవెట్టిన ఇస్రో... నిప్పులు జిమ్మి నింగికెగిసిన ఖ్యాతి, ఇరవై ఏండ్ల కింద అగ్నిరాజేసిన సుబ్రమణ్యం....అమ్మల భరతం పట్టిన పుణ్యాత్ముడు ఒక్కడే, అంబాసిడర్ కార్ల ఇర్కిన సమంత... చేనేత చేయూత మీద షబ్బీర్ పంచాదీ, మన పార్టీలున్నప్పుడు మంచోడు... మంది పార్టీల చేరంగనే జూపల్లి చెడ్డోడు, కలాస్ మిరపనారు వోస్తే మీరు కల్లాస్... ఒంగోలు కాడ నిండ మునిగిన మిర్చి రైతులు, లవర్స్ డే...

Tuesday, February 14, 2017 - 21:16

తారుమారైతున్న తమిళ రాజకీయం.. ఇద్దరు కొట్లాడితే మూడో మనిషికి ఛాన్స్, సర్కారును నిద్రలేపుతా అంటున్న కోదండం సారు.. గా పని జేయిసారు.. జేఏసీకో దండం, డెబ్బై సీట్లు గెలుస్తా అంటున్న కాంగ్రెస్ పార్టీ....జంపింగ్ ల లెక్కజెప్పని ఉత్తమ్ రెడ్డి, రండి బాబు..రండి ఆలస్యం చెయ్యకండ్రీ.. జగిత్యాల పేదోళ్లకు డబల్ బెడ్ రూం దమాకా, పచ్చడి అమ్మేటాయన ఈపు పచ్చడి...మంత్రి పద్మారావు కొడుకుజేసిన...

Monday, February 13, 2017 - 20:42

నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక వింతరోగమున్నదట.. అసొంటి రోగం ఇగ ఈ భూమ్మీద ఏ పార్టీ లీడర్కు గూడ ఉండదంటున్నడు మన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరన్న.. ఆ రోగ లక్షణాలు ఎట్లుంటయ్?.. మరి దానికి ఏమన్న ట్రీట్ మెంట్ ఉన్నదా..? అట్లనే ఇడ్సిపెడ్తె ఇతరుకు ఆ వ్యాది సోకే అవకాశం గూడ ఉన్నదా..ఇతరత్రా విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

Monday, February 13, 2017 - 20:40

అందరం తమిళ నాడుల రాజకీయం ఇట్లైతున్నది.. అట్లైతున్నది.. చిన్నమ్మ చిన్నయ్య అని అనుకుంటున్నంగని..? అసలు తెలంగాణల రాజకీయం ఎట్లైతున్నదో సూస్తున్నమా..శ్రీక్రిష్ణ భగవానుడు ఎట్లుంటడో సూశిండ్రా మీరు..? గది దెల్వదా మస్తుగ జూశ్నం పోట్వలళ్ల అనేరు..నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక వింతరోగమున్నదట..బీహార్ షేర్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఒకాయిన ప్రశ్న అడ్గిండట.. బాత్ రూం...

Saturday, February 11, 2017 - 13:28

తొందరపడి కూస్తున్న మీడియా కోకిలలు... అబద్ధాలు తెలుసుకున్న పబ్లిక్కు కిలకిలలు, పిల్లల కడుపుల నత్తలు బైటికి రావాలి... భరతమాత కడుపుల రాజకీయ నత్తలొద్దా, 
సొంత పార్టీని నమ్మనంటున్న తుమ్మల... ఎదుగుదల ఓర్సుకుంటలేరని రుస రుస.. ఇల్లందు దిక్కు తయారైన భూమి పుండు... ఓపెన్ కాస్టులను ఒద్దంటున్న ఊరి జనం.. 
బడికివోయిన పోరనికి బాల్ కటింగ్...కర్నాటక కాడా ప్రైవేట్ బడోని పైత్యం,...

Friday, February 10, 2017 - 16:45

కోతలు గోసుట్ల మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాలు తర్వాతనే ఎవ్వలైనా..? అమెరికాకు వొయ్యి అమరావతిని గిట్లనే జేస్తాంటడు.. జపానుకు వొయ్యి అమరావతిని టోక్యో జేస్తాంటడు శ్రీలంకకు వొయ్యి శ్రీలంక టెక్నాలజీ వాడుతాంటడు.. ఇంట్ల ఇత్తులేదు కంటికి నిద్రలేదన్నట్టు.. ఇగ ఆ సారు అన్ని అంతర్జాతీయ ముచ్చట్లే మాట్లాడ్తడు గని..? ఆయన రాష్ట్రంల పరిపాలనను మాత్రం అస్సలే వట్టిచ్చుకోడు..అనడానికి ఒక చిన్న...

Friday, February 10, 2017 - 16:41

రామాయణం, మహాభారతం రెండింటిని.. రోట్లేశి నూరితె తయ్యారైందే తమిళనాడు రాజకీయం అంత అద్భుతంగ నడుస్తున్నది ఆడ యవ్వారం..మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సీఎం గాకముందుకు గడ్కోపారి జెప్తుండే తెలంగాణ రాష్ట్రం ఎందుకు గావాలె అంటే..? నీళ్లు నిధులు నియామకాలు అని..తెలంగాణల ఏడనన్న కొత్తగ కరెంటి తయ్యారు జేస్తున్నరా అంటే.. ఏడగూడ ఒక్క యూనిట్ తయ్యారు జేస్తలేరు.. కోతలు గోసుట్ల మన ఆంధ్ర...

Wednesday, February 8, 2017 - 08:45

హైదరాబాద్: సోషల్ మీడియాలో పడ్డ టీజేఏసీ..ఇక చూడాలమనం పోస్టుల కసి, ప్రతిపక్షాల భుజాల మీద ప్రతిపక్షాల తుపాకీ...బదనాం చేసి ఇడిసిపెడుతున్న ప్రభుత్వం, అవినీతి కాగితాలు తెచ్చిన పొన్నం....ఏ ఆఫీసుకేసినవే అన్నా కన్నం, రుణ మాఫీ చేయమంటున్న రైతులు...అప్పుల వ్యవసం ఆగం వుందని ఆవేదన, నాయన మీద సిన్మా తీస్తున్న బాలికాక...కామెడీ సీన్లు కట్ చేయాలో చీచో,...

Tuesday, February 7, 2017 - 09:16

హైదరాబాద్: సర్కారు భూమి అమ్మేసిన సర్కారు లీడర్లు... ఇళ్లు కట్టుకున్నంక కూలగొడుతున్న పోలీసోళ్లు, ఆడోళ్ల సీట్లకెళ్లి లేసిన తమిళ తంబీ....అతర్జాతీయ ఆపద్ధర్మ సీఎం రాజీనామా, రణం రణం అయితున్న శరణం గచ్చామీ... జిల్లాలకు పాకిన బహుజన సిన్మాలడాయి, బాధితులమీదనే కేసులు పెట్టిన కాఖీలు...చీరాల కాడ సీత్వ పని చేసిన పోలీసులు, ఆరిపోయిన చెర్వుగట్టు అగ్నిగుండాలు...

Sunday, February 5, 2017 - 08:12

నీళ్ల మీద నిమ్షం శేపు కాళ్లు జేతులు గొట్టకుంట నిలవడాల్నంటే అయితదా మనతోని గజ ఈతగాళ్లు గూడ గుడ్లె తెలేస్తరు.. నీళ్ల మీద బుడ్డరాయే నిలవడది అసొంటి మన్షి కాళ్లు చేతుల ఆడియ్యకుంట.. పర్పుమీద వన్నట్టు వంటే దెబ్బకే అడ్గుకు వోతడు అనుకున్న నేను... కని సిద్దిపేట ఒకాయిన.. నీళ్ల మీద ఎంత ముద్దుగ వంటున్నడో సూడాలంటే వీడియో సూడుండ్రి..

 

Sunday, February 5, 2017 - 08:11

మాజీ స్వర్ణాంధ్ర జనులారా.. తాజా నవ్యాంధ్ర జనులారా..? ఇగ కాసుకోండ్రి..అబ్బా తెలంగాణల ప్రతిపక్షాలకు పనేంలేనట్టుంది.. గడ్కోపారి ప్రభుత్వాన్ని సమాధానం జెప్పుండ్రి సమాధానం జెప్పుండ్రి అని గిచ్చుతా ఉన్నరు..నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ సారు జర్ర కోపం మీదున్నడట..ప్రపంచంల అందరికి కంటె ఎక్వ విగ్రహాలు ఎవ్వలియి ఉన్నయ్ చెప్పుండ్రి..? దయ్యాన్ని జూశిండ్రా మీరు ఎన్నడన్నా..? నీళ్ల మీద...

Pages

Don't Miss