సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్లో అభద్రతా భావం : మల్లురవి

18:24 - October 13, 2017

హైదరాబాద్ : లక్ష మంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డొచ్చినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టి తీరుతామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్లో అభద్రత కనిపిస్తుందన్నారు కాంగ్రెస్‌ నేత మల్లు రవి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే కేసీఆర్‌కు... లక్ష మందిలా కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాంలో 80 నుంచి 90 శాతం కట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.
 

Don't Miss