ప్రీతి మృతిపై చిన్నాన్న ఆందోళన..

16:21 - September 7, 2017

 

కర్నూలు : తమ కూతురు ప్రీతి మృతి కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ప్రీతి చిన్నాన్న రామచంద్ర నాయక్ కలెక్టరేట్ ఆఫీసులో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును సరిగ్గా పట్టించుకోవడం లేదని, ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రామచంద్ర నాయక్ మాత్రం వినిపించుకోలేదు. చివరకు విచారణ కమిటీ వేస్తామని హామీనిచ్చి తాడు సహాయంతో అతడిని కిందకు దించారు.

కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ హాస్టల్ ప్రీతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 19వ తేదీన ఈ ఘటన జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృత దేహంతో కలెక్టరేట్‌ ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. 

Don't Miss