పోలీసులు చిత్రహింసలు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

15:42 - August 31, 2017

రంగారెడ్డి : పోలీసుల చిత్ర హింసలతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాండూర్ కు చెందిన క్రిస్టోఫర్ గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే క్రిస్టోఫర్ కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడని సరూర్ నగర్ పోలీసులకు అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశారు. క్రిస్టోఫర్ పై 498, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 498 కేసులో మూడురోజులుగా క్రిస్టోఫర్ ను విచారిస్తున్న పోలీసులు క్రిస్టోఫర్ ను చిత్రహింసలు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొడుతున్నారన్న భయంతో రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రన్నింగ్ బస్ ముందు క్రిస్టోఫర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss