చేతబడి నెపంతో..

20:42 - December 20, 2016

ఖమ్మం : మూఢనమ్మకాలు కొందరిని మూర్ఖులను చేస్తుంది.. అనుమానం.. అపోహలతో రక్తం చిందిస్తున్నారు..పచ్చని పల్లెల్లో అరాచకం సృష్టిస్తున్నారు.. పచ్చని పైర్లలో రక్తాన్ని పారిస్తున్నారు... కేవలం అనుమానంతో జరుగుతున్న ఎన్నో ఘోరాలు గ్రామాల్లో చిచ్చు రేపుతున్నాయి... ఖమ్మం జిల్లాలో మరో దారుణం జరిగింది.
కిరాతకం 
రోజూ రాత్రి భోజనం చేసి పొలం వద్ద నిద్రపోయేవాడు..ఆ రోజు వెళ్లిన వృద్దుడు ఉదయాన్నే ఇంటికి రాలేదు..దీంతో కుటుంబీకులు ఏం జరిగిందని వెళ్లి చూస్తే రక్తపు మడుగులో కన్పించాడు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో 70సంవత్సరాల వృద్ధుడిని దుండగులు దారుణంగా చంపేశారు. తిరుమలాయపాలెం  మండలం రాజారంలో ఈ ఘటన కలకలం రేపింది.
వృద్ధుడు దారుణ హత్య  
రాజారం గ్రామానికి చెందిన 70 ఏళ్ల  పేర్ల ముత్తయ్య పొలందగ్గర గుడిసెలో నిద్రిస్తుండగా అర్థరాత్రి దుండగులు దారుణంగా కొట్టిచంపినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. హత్యజరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
హత్యపై పలు అనుమానాలు            
జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్న పోలీసులు మాత్రం పాత కక్షలని చెబుతున్నప్పటికీ మూఢనమ్మకాలతోనే ఈ దారుణం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి... అయితే వృద్దుడిని చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే చంపినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

Don't Miss