ఎస్పీ గ్రీవెన్సుహాల్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

17:00 - January 9, 2017

నెల్లూరు : ఎస్పీ గ్రీవెన్సుహాల్ లో ముక్తార్ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని స్థల వివాదంలో పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ ఎస్పీ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతనని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Don't Miss