విధివంచితులకు ఉపాధి కల్పిస్తున్న జైళ్ల శాఖ

13:51 - July 6, 2017

పుట్టుకతోనే ఎవరు నేరస్థులుగా పుట్టారు...పరిస్థితులు వారిని నేరుస్థులుగా మారుస్తాయి..పలు నేరాలకు సంబంధించిన వార్తలు మనం వింటున్నాం, చదువుతున్నాం..విధిలేని పరిస్థితుల్లో నేరస్థులుగా మారిన వారు ఎందరో ఉన్నారు..మరి కొందరు నేరప్రవృత్తి అలవాటుపడి జైలు శిక్షను అనుభవించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవించిన వారు విడుదలై బాహ్య ప్రపంచలోకి వస్తే సమాజం వారిని ఏ మాత్రం గౌరవించదు కాదు కాదా అవమానిస్తుంది.
దీంతో వారు సమాజం నుంచి అనేక అవమానాలు, చీత్కారాలు అనుభవిస్తుంటారు..జైలు శిక్ష అనంతరం మంచిగా బ్రతకాలని అనుకున్నవారు ఆశలు అంత తేలిగ్గా నెరవేరవు...ఈ నేపథ్యంలో వారు సమాజం పట్ల కోపంతో, ఉక్రోషంతో విధిలేక మళ్లీ నేరస్థులుగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయం పై ఆలోచించిన జైళ్ల శాఖ విడుదలైన ఖైదీల కోసం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే చంచల్ గూడ శిక్ష అనుభవించి విడుదలైన మహిళ ఖైదీల కోసం ఓ పెట్రోల్ బంక్ ఏర్పరిచి వారికి ఉపాధి కల్పించారు....
దీని గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

Don't Miss