కుల దూషణలు...పంచాయతీ రాజ్ ఏఈ ఆత్మహత్య

12:57 - August 24, 2017

జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. పైస్థాయి అధికారి కుల దూషణలకు ఓ అధికారి బలయ్యాడు. కులం పేరుతో చేస్తున్న వేధింపులకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని ఎండపల్లి గ్రామంలో నివాసముంటున్న శ్రీకాంత్‌...మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో శ్రీకాంత్ పంచాయతీరాజ్ ఏఈ గా పనిచేస్తున్నాడు. అయితే గతకొన్ని రోజులుగా ఉన్నతాధికారి రఘువీరారెడ్డి శ్రీకాంత్ ను కులం పేరుతో దూషణలు, కుల వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్...పలుమార్లు ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. స్థానికులు కాపాడారు. అ తర్వాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కానీ ఆత్మహత్య ప్రయత్నం విఫలమైంది. తాజాగా తన చావుకు పైస్థాయి అధికారి రఘువీరారెడ్డి కుల దూషణలు, వేధింపులే కారణమని...సూసైడ్ నోట్ రాసి శ్రీకాంత్ ఉరేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ చాలా విషాదభరితంగా ఉంది. అయితే అధికారుల వేధింపులవల్లే శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీకాంత్ మృతికి కారకులపై కేసు నమోదు చేసుకుంటామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss