వినాయక్ తో విష్ణు?!..

12:04 - August 17, 2018

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా పేరు తెచ్చుకున్న వినాయక్..ఇటీవల మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమాకు డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లలో వినాయక్ ను చిరు ఎంచుకోవటంతో ఆయనపై వున్న నమ్మకమేనన్నారు మెగాస్టార్. మరి మెగాస్టార్ నమ్మకాన్ని పొందిన వినాయక్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అటువంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించేందుకు మంచువారబ్బాయి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మంచు విష్ణు ప్రస్తుతం 'ఓటర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పరశురామ్ వేరే నిర్మాతల దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వలన, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేం. అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నా..'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి కావటానికి చాలా సమయం పట్టే అవకాశాలుండటంతో ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

Don't Miss