తాళిబొట్లలో పగడాన్ని పగులగొడుతున్నారు..

11:28 - July 6, 2017

వినాయకుడు పాలు తాగుతున్నాడంట..విగ్రహం నుండి రక్తం కారుతోందంట...చెట్టు నుండి నీళ్లు కారుతున్నాయంట...ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చాయి..ఈ పుకార్లు నిజం కాదని తెలిసినా అమాయక జనం చూడటానికి ఎగపడుతుంటారు. ఈ విషయాన్ని ఒకరి ద్వారా మరొకరు..ఇలా క్షణాల్లో దావానంలా వ్యాపింప చేస్తుంది.
తాజాగా కర్ణాటకలో మరో వదంతి వైరల్ లా వ్యాపించింది. భార్యలు మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్తలు చనిపోతారా ? మంగళసూత్రాల్లో పగడం ఉంటే రాత్రిళ్లు నిద్ర పట్టదా ? అంటూ పుకార్లు షికారు చేశాయి. ‘తాళిబొట్లలో పగడం ఉంటే మొగుడికి కష్టం' అంటూ వచ్చిన మెసెజ్ క్షణాల్లో పాకిపోయింది. వాట్సప్ లో ఈ ప్రచారం జరిగింది. బళ్లారి, దావనగిరి, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ వింత ప్రచారం వ్యాపించింది. ఈ ప్రచారం అందుకున్న వారు తమ సమీప బంధువులకు తెలియచేశారు. తాళిబొట్లలో పగడం ఉంటే మొగుడికి కష్టాలు వస్తాయంటా అంటూ వదంతులు వ్యాపించాయి.
ఎవరు ప్రచారం చేశారో తెలియదు కానీ..ఈ పుకారు గాలి కంటే వేగంగా వ్యాపించింది. ఈ వదంతులను నమ్మిన వారు తమ తాళిబొట్లలోని పగడాలను పగులగొట్టుకున్నారు. ఇవన్నీ పుకార్లే అని చాలా మంది చెబుతున్నా కొంతమంది మహిళలు మాత్రం నమ్మడం లేదు. కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ..ఆంధ్ర జిల్లాలకు కూడా ఈ వదంతులు పాకాయి.

Don't Miss