మన్మోహన్ బయోపిక్ లో..సోనియా పాత్రలో ఎవరో తెలుసా?

11:04 - April 7, 2018

ప్రస్తుతం సినిమా పరిశ్రమల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మోరీకోమ్, ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం దంగల్, క్రికెటర్స్ సచిన్ మహేంద్రసింగ్ ధోనీ, వంగవీటి మోహన్ రంగా, కిల్లింగ్ వీరప్పన్,మహానటి సావిత్రి, అలాగే మహానటుడు నందమూరి తారకరామారావు ఇలా బయోపిక్స్ హమీ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రంలో అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, రీసెంట్‌గా మ‌న్మోహ‌న్ లుక్‌లో అనుప‌మ్ ఖేర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుద‌ల చేశారు. ఇక చిత్రంలో కీల‌క పాత్ర అయిన సోనియా గాంధీ పాత్ర‌కి ఎవ‌రు తీసుకుంటారా అని జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న టైంలో జ‌ర్మ‌న్ యాక్ట‌ర్ సుజానే బెర్నెర్ట్ తాను సోనియా గాంధీ పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సుజానే ప‌లు టీవిషోస్ తో పాటు భార‌తీయ సినిమాల‌లోను న‌టించింది. న‌టుడు అఖిల్ మిశ్రాని వివాహం చేసుకున్న ‘ప్రధానమంత్రి’ టెలివిజన్‌ సిరీస్‌లో కూడా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలిగా నటించారు. మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీని విజ‌య్ ర‌త్నాక‌ర్ గుత్తే తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రంలో సంజ‌య్ బారు పాత్ర‌లో అక్ష‌య్ ఖ‌న్నా న‌టించ‌నున్నాడు. సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు కూడా ప్లాన్‌ చేశారని తెలుస్తోంది.

Don't Miss