డబుల్ శాలరీ అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు...

11:48 - November 5, 2018

అమ‌ృత్‌సర్ : ప్రభుత్వ ఉద్యోగులు..అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన వేతనం క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డబుల్ వేతనం క్రెడిట్ అయినట్లు తెలిసింది. ఈ వేతనం క్రెడిట్ అయిన వారు ఆనందం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సెలైంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందించిందా ? అని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసేసరికి మిన్నకుండిపోయారు..
అక్టోబర్ నెల మాసానికి సంబంధించిన వేతనాలను అక్కడి ట్రెజరీ వారి వారి అకౌంట్లో జమ చేసింది. కానీ ఒక్కసారిగా అసలు విషయం తెలుసుకున్న ట్రెజరీ ఆఫీసర్ ప్రభుత్వ శాఖలకు ఓ నోటీసు పంపించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ వేతనం క్రెడిట్ అయ్యిందని, పొరపాటున ఇది జరిగిందని నోటీసులో పేర్కొన్నారు. డబుల్ వేతనం డ్రా చేసుకోవద్దని..త్వరలోనే ఆ డబ్బును రికవరి చేస్తామన్నారు. రూ. 40-50 కోట్ల రూపాయలు అదనంగా క్రెడిట్ అయినట్లు సమాచారం. 

Don't Miss