మరాఠాలకు ఎన్నికల తాయిలం : రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం..

15:42 - November 29, 2018

మహారాష్ట్ర : మరాఠాలకు ప్రభుత్వం శుభవార్తనందించింది. వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు కొద్ది నెలల క్రితం భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో ఎన్నికలు రానున్న తరుణంలో మరాఠాలకు రిజ్వషన్స్ కల్పిస్తు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నవంబర్ 18న శీతాకాల సమావేశాల సందర్భంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పలికింది. మరాఠాలకు విద్య, ఉదోగ్యాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు మహారాష్ట్ర శాసనసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతు తెలిపాయి. తర్వాత ఈ బిల్లును శాసనమండలికి పంపనున్నారు. ఈ బిల్లు ద్వారా కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమే మరాఠాలకు రిజర్వేషన్లు లభించనున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వర్తిస్తుండగా.. మరాఠాలకు మాత్రం రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వర్తించటంలేదు. ఈ నేపథ్యంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం.. మహారాష్ట్ర రాష్ట్ర బీసీ కమిషన్ సూచనల మేరకు ఫడ్నవీస్ సర్కారు ఎస్‌ఈబీసీ  అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతిని ఏర్పాటు చేసింది. దీని వల్ల ఓబీసీల రిజర్వేషన్లకు విఘాతం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
కాగా వచ్చే ఏడాది అంటే 2019లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న తరుణంలో.. మరాఠాల డిమాండ్‌ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీంతో మరాఠాల ఓట్ల కోసం ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయవర్గాల సమాచారం. 
 

Don't Miss